Jump to content

భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర

వికీపీడియా నుండి

భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర

పుస్తకం ముందు భాగం
పుస్తకం వెనుక భాగం

భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర పుస్తకంను బెల్లంకొండ మల్లారెడ్డి తెలుగులోనికి అనువదించాడు. ఈయన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నివాసి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఈ పుస్తకంను హిందీలో భారత్ మే విజ్ఞాన్ కీ ఉజ్వల పరంపరా సురేష్ సోనీ రచింనారు.

సారాంశం

[మార్చు]
  మన తాతలు చాలా గొప్ప వాళ్ళు అని చాలా మంది వివిధ సందర్భాల్లో చెబుతూ ఉంటాం. కానీ ప్రమాణాలు చూపించవలసి వచ్చేసరికిఅవి సిద్ధంగా అందుబాటులో లేనప్పుడు మన మాటకు లభించవలసినంత విలువ లభించదు.కాబట్టి మన భారతీయులు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని తెలియజెప్పే అంశాలు ఒకచోట సంకలితం చేయబడని ఎందరో ఎంతోకాలంగా కోరుకుంటున్న విషయం.విజ్ఞాన ప్రపంచం లో భారతీయుల పాత్ర పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం గతంలో (1997) అందించింది. కర్ణాటక రాజ్యయ మాధ్యమిక ఉపాధ్యాయ సంఘం వారు కన్నడంలోనూూ, ఆంగ్లంలోనూ ప్రచురించిన పుస్తకాన్నిి చిట్టా దామోదర శాస్త్రి తినిగించిఇచ్చారు.

రచయిత మనోగతం

[మార్చు]

1.మనదేశంలో సర్వసాధారణ ప్రజానీకంలో వైజ్ఞానిక రంగ ఆవిష్కరణ యొక్కతొలి కిరణాలు పాశ్చాత్య ఆకాశంలో ప్రసరించే. దాని నుండే ప్రపంచమంతటా వికాసం వేగవంతమైందని ఒక భావన వ్యాపించి ఉంది. ప్రాచ్య ప్రపంచ ఆకాశంలో వైజ్ఞానిక క్షేత్రంలో సర్వత్రా అంధకారం వ్యాపించి ఉన్నదనే ఈ భావన ప్రబలిన కారణంగానే పాశ్చాత్య అనుకరణ ప్రవృత్తి దేశంలో ప్రబలియున్నది. 'మనకొక వైజ్ఞానిక పరంపర ఉన్నది, వైజ్ఞానిక దృష్టి ఉన్నద'ని జ్ఞానం లేనందున నేటి ప్రపంచంలో మన స్థానం గురించి విశ్వాసరాహిత్యం అలముకొని యున్నది.

2.కాని 20వ శతాబ్ది ప్రారంభంలో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్, బ్రజేంద్రనాథ్ సీల్, జగదీశ్ చంద్రబోస్, రావూసాహెబ్ వరే మొదలైన శాస్త్రవేత్తలు తమ లోతైన అధ్యయనం ద్వారా కేవలం ధర్మదర్శన రంగంలోనే కాదు. శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా భారత్ అగ్రస్థానం వహించిందని రుజువు చేశారు. ఇంతేకాదు మన పూర్వులు వైజ్ఞానిక ఆధ్యాత్మిక రంగాలను సమన్వయం చేశారు. తద్వారా ఉత్పన్నమైన వైజ్ఞానిక దృష్టి కారణంగా విజ్ఞానవికాసంలో సృజనాత్మకతకు అనుకూలమైన,, సంక్షేమకారక దృష్టి ఏర్పడింది.

3.అనేకమంది విజ్ఞానవేత్తలు ఈ దిశలో ముందుకు నడిచి అనేక ప్రమాణాలు ప్రాచీన భారతీయ విజ్ఞానంన్ని అనేక పుస్తకాలలో, వ్యాసాలు అభి వ్యక్తీకరించారు. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి- ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారి హిందూ కెమిస్ట్రీ, బ్రజేంద్రనాథ్ సీల్ గారి 'ది పాజిటివ్ సైన్స్ ఆఫ్ ఏన్షియంట్ హిందూ' రావూసాహెబ్ వరే గారి హిందీ శిల్ప మాత్ర', ధరమ్ పాల్ గారి ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ది ఎయిటీన్ సెంచరీ' ఈ గ్రంథాలలో భారతీయ విజ్ఞాన సాంకేతిక పరంపరను ఉద్ఘాటించారు. ప్రస్తుతం సంస్కృతభారతి' అనే సంస్థ సంస్కృతంలో విజ్ఞానశాస్త్రం, బాటనీ, ఫిజిక్స్, మెటలర్జీ, మెషీన్స్, కెమిస్ట్రీ మొదలైన విషయాలలో అనేక పుస్తకాలు ప్రచురించి ఈ విషయాలను ముందుకు నడిపించారు.

4.ఇంతేకాక బెంగుళూరుకు చెందిన ఎం.పి.రావు గారు 'విమానశాస్త్రం', వారణాసికి చెందిన పి.జి.డోంగ్రే గారి 'అంశబోధిని పై అనేక ప్రయోగాలుచేస్తారు. ముంబైకి చెందిన విజ్ఞాన భారతి', జైపూర్ కు చెందిన 'పాథేయ కడ్' సంస్థలు పైన చెప్పిన అనేక అంశాల్ని సంకలనం చేసి ప్రజల ముందుంచారు. డా॥ మురళీ మనోహర్ జోషీ గారి వ్యాసాలు, వ్యాఖ్యానాలు ప్రాచీన భారతీయ వైజ్ఞానిక పరంపరను మిక్కిలి ప్రభావవంతంగా ప్రస్తుతించాయి. ఇంతేకాక నేటి ఆవశ్యకతయైన వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమన్వయం గురించి ఫ్రీట్ జాఫ్ కాప్రా, గ్రెజ్ కోవ్, జ్యోఫ్రీచ్వే,రామకృష్ణ మిషన్ పరమాధ్యక్షులు పూజ్య స్వామిరంగనాధానంద, స్వామి జితాత్మానంద గారల అనుభవాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా భారతీయ విజ్ఞానదృష్టి వైశిష్ట్యం ప్రపంచం ముందు ఉద్ఘాటింపబడుచున్నది. అనేకమంది పండితులు ఈ దిశలో ఆలోచిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ సాహిత్యాన్ని చదవడం ద్వారా నేటి తరానికి చక్కని మార్గదర్శనం లభించుచున్నది. వారి మనసుల్లో స్వాభిమానం జాగృతం అవుతున్నది. నేడు భౌతికాభివృద్ధి కారణంగా ప్రపంచంలో తలెత్తిన అనేక సమస్యలకు దీనిద్వారా విముక్తి లభిస్తుంది.

5.రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప.పూ. సరసంఘచాలకులు శ్రీ సుదర్శన్జీ ఈ పుస్తకాన్ని చదివి దీనిలో భాషా సంబంధ దోషాలను సవరించారు. దీనిని మరింత ఉపయుక్తంగా తీర్చిదిద్దుటకు వారిచ్చిన సలహాలకు కృతజ్ఞుణ్ణి. దీనిని ప్రచురించిన అర్చనా ప్రకాశన్ - భోపాల్ వారికి ధన్యవాదములు. ఈ నా రచన నేటి చింతల భారతీయ విజ్ఞానరంగ పరిచయంతోపాటు ఈ విషయంలో మరింత పరిశోధనలకు, ప్రయోగాలకు ఏకొద్ది ప్రేరణనిచ్చినా శ్రమకు సార్ధకత లభించినట్లు భావిస్తామ్.

చర్చించబడిన అంశాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]