Jump to content

భారతీయ సాయుధ దళాల పురస్కారాలు, పతకాలు

వికీపీడియా నుండి

యుద్ధాల్లోను, శాంతి సమయాల్లోనూ అసాధారణమైన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకూ, విశిష్ట సేవ చేసినందుకూ భారతదేశ సాయుధ దళాలు అనేక సైనిక పురస్కారాలు పొందేందుకు అర్హులు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక పతకాలు ప్రసాదించబడ్డాయి.

సైనిక పతకం

[మార్చు]

ప్రాధాన్యత వారీగా పురస్కారాలు:

యుద్ధకాల శౌర్య పురస్కారాలు
పరమ వీర చక్ర (PVC)
మహా వీర చక్ర (MVC)
వీర చక్ర (VrC)
శాంతి సమయంలో గ్యాలంట్రీ అవార్డులు
అశోక్ చక్ర (AC)
కీర్తి చక్ర (KC)
శౌర్య చక్ర (SC)
యుద్ధకాల విశిష్ట సేవా పతకాలు
సర్వోత్తం యుద్ధ సేవా మెడల్ (SYSM)
ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్ (UYSM)
యుద్ధ సేవా మెడల్ (YSM)
శాంతి సమయంలో విశిష్ట సేవా పతకాలు
పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM)
అతి విశిష్ట సేవా మెడల్ (AVSM)
విశిష్ట సేవా మెడల్ (VSM)
విశిష్ట సేవ & శౌర్య పతకాలు
సేనా మెడల్ (ఆర్మీ) (SM)
నౌ సేనా మెడల్ (నేవీ) (NM)
వాయుసేన పతకం (ఎయిర్ ఫోర్స్) (VM)

సేవ, యుద్ధ పతకాలు

[మార్చు]
గాయ పతకం (పరాక్రమ్ పదక్)
జనరల్ సర్వీస్ మెడల్ 1947
సామాన్య సేవా పతకం
ప్రత్యేక సేవా పతకం
సమర్ సేవా స్టార్
పూర్వి స్టార్
పశ్చిమ నక్షత్రం
ఆపరేషన్ విజయ్ స్టార్
సియాచిన్ గ్లేసియర్ మెడల్
రక్షా పతకం
సంగ్రామ్ మెడల్
ఆపరేషన్ విజయ్ మెడల్
ఆపరేషన్ పరాక్రమ్ మెడల్
సైన్య సేవా పతకం
హై ఆల్టిట్యూడ్ సర్వీస్ మెడల్
ఆంత్రిక్ సురక్ష పదక్
విదేశ్ సేవా పతకం

సుదీర్ఘ సేవా పురస్కారాలు

[మార్చు]
మెరిటోరియస్ సర్వీస్ మెడల్
సుదీర్ఘ సేవ, మంచి ప్రవర్తన పతకం
30 ఏళ్ల సుదీర్ఘ సేవా పతకం
20 ఏళ్ల సుదీర్ఘ సేవా పతకం
9 సంవత్సరాల సుదీర్ఘ సేవా పతకం
టెరిటోరియల్ ఆర్మీ డెకరేషన్
టెరిటోరియల్ ఆర్మీ మెడల్

స్వాతంత్ర్య పతకాలు

[మార్చు]
భారత స్వాతంత్ర్య పతకం
50వ స్వాతంత్ర్య వార్షికోత్సవ పతకం
25వ స్వాతంత్ర్య వార్షికోత్సవ పతకం

సైనిక నిఘా, అన్వేషణ పతకం

[మార్చు]
మాక్‌గ్రెగర్ మెడల్ [1]

డిస్పాచ్‌లలో ప్రస్తావన

[మార్చు]

పతకాలు పురస్కారాలు పొందేంతటి స్థాయిలో లేని శౌర్య ప్రతాపాల ప్రదర్శనలకు గుర్తింపు నిచ్చేందుకు గాను ఈ డిస్పాచ్‌లలో ప్రస్తావనలను 1947 నుండి వాడుతూ ఉన్నారు. [2]

రిజర్వ్ ఫోర్సెస్, టెరిటోరియల్ ఆర్మీ, మిలిషియా, ఇతర చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన సాయుధ దళాల సిబ్బంది, నర్సింగ్ సర్వీస్ సభ్యులు, సాయుధ దళాల క్రింద లేదా వారితో పనిచేసే పౌరులతో సహా అన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అందరూ ఈ ప్రస్తావనలకు అర్హులే. [2]

మరణానంతరం పంపిన డిస్పాచ్‌లలో కూడా ప్రస్తావన చెయ్యవచ్చు. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ప్రస్తావనలు కూడా చెయ్యవచ్చు. డెస్పాచ్‌లో ప్రస్తావన పొందిన వ్యక్తి, దానికి సంబంధించిన పతకాన్ని, రిబ్బన్‌పై తామరాకు రూపంలో ధరించడానికి అర్హులు. వాటిని రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ధృవీకరణ పత్రంతో జారీ కూడా చేస్తారు. [2]

ప్రశంసా పత్రం

[మార్చు]
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్

మిలిటరీలోని మూడు శాఖలు కమెండేషన్ కార్డ్‌లను జారీ చేస్తాయి, ఇవి "వ్యక్తిగత శౌర్య ప్రదర్శనకు లేదా విశిష్ట సేవకు లేదా విధి నిర్వహణలో లేదా నాన్-ఆపరేషనల్ ఏరియాలలో నిర్వహించే విధికి సంబంధించిన బ్యాడ్జ్‌లు. ఇది ఒక రకమైన శౌర్య పురస్కారం. అవార్డు నిర్దిష్ట శౌర్య కార్యానికి లేదా విశిష్ట సేవకు లేదా ప్రత్యేక సేవ కోసమూ ఉంటుంది. ఈ పురస్కారాన్ని మరణానంతరం ఇవ్వరు."

మూడు శాఖలూ అత్యున్నత అధికారి ( చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) స్థాయిలో కమెండేషన్స్ కార్డ్‌లను జారీ చేస్తాయి. దిగువ స్థాయిలలో అవార్డులు సేవల మధ్య మారుతూ ఉంటాయి. [3] [4]

ధరించే క్రమం

[మార్చు]

వివిధ అలంకరణలు, పతకాలను క్రింది క్రమంలో ధరిస్తారు: [5] [6]

స్థాయి పురస్కారం రిబ్బను
1 భారత రత్న
2 పరమ వీర చక్ర
3 అశోక చక్ర
4 పద్మ విభూషణ్
5 పద్మ భూషణ్
6 సర్వోత్తమ యుద్ధ సేవా పతకం
7 పరమ విశిష్ట సేవా పతకం
8 మహా వీర చక్ర
9 కీర్తి చక్ర
10 పద్మశ్రీ
11 సర్వోత్తమ జీవన రక్షా పతకం
12 ఉత్తమ యుద్ధ సేవా పతకం
13 అతి విశిష్ట సేవా పతకం
14 వీర చక్ర
15 శౌర్య చక్ర
16 యుద్ధ సేవా పతకం
17 సేనా పతకం (ఆర్మీ సిబ్బందికి)
నవ సేనా పతకం (నావికాదళ సిబ్బందికి)
వాయు సేనా పతకం (ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి)
18 విశిష్ట సేవా పతకం
19 ఉత్తమ జీవన రక్షా పదక్
20 పరాక్రం పతకం (గాయ పతకం)
21 సామాన్య సేవా పతకం 1947
22 సామాన్య సేవా పతకం - 1965
23 స్పెషల్ సర్వీస్ పతకం
24 సమర సేవా స్టార్ - 1965
25 పూర్వీ స్టార్
26 పశ్చిమీ స్టార్
27 ఆపరేషన్ విజయ్ స్టార్ పతకం
28 సియాచెన్ గ్లేసియర్ పతకం
29 రక్షా పతకం – 1965
30 సంగ్రామ పతకం
31 ఆపరేషన్ విజయ్ మెడల్
32 ఆపరేషన్ పరాక్రం మెడల్
33 సైన్య సేవా మెడల్
34 హై ఆల్టిట్యూడ్ మెడల్
35 విదేశ సేవా మెడల్
36 మెరిటోరియస్ సర్వీస్ మెడల్
37 సుదీర్ఘ సేవ, సత్ప్రవర్తన మెడల్
38 జీవన రక్షా పదక్
39 టెరిటోరియల్ ఆర్మీ డెకరేషన్
40 టెరిటోరియల్ ఆర్మీ మెడల్
41 స్వాతంత్ర్య దినోత్సవ మెడల్ - 1947
42 స్వాతంత్ర్య దినోత్సవ మెడల్ - 1950
43 50 వ స్వాతంత్ర్యదినోత్సవ మెడల్
44 25 వ స్వాతంత్ర్యదినోత్సవ మెడల్
45 30 సంవత్సరాల సేవా మెడల్
46 20 సంవత్సరాల సేవా మెడల్
47 9 సంవత్సరాల సేవా పతకం
48 కామన్వెల్త్ పురస్కారాలు
49 ఐక్యరాజ్యసమితి పురస్కారాలు
50 ఇతర పురస్కారాలు

పోలీసు పతకాలు, ఫైర్ సర్వీసెస్ పతకాలు, కరెక్షనల్ సర్వీసెస్ పతకాలు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ పతకాలను పై జాబితా నుండి మినహాయించాం. పైన పేర్కొన్న పురస్కారాల ప్రాధాన్యతా క్రమం భారత సైన్యానికి సంబంధించినది. భారత నౌకాదళం, భారత వైమానిక దళం అనుసరించే క్రమంలో ముఖ్యంగా ప్రచార పతకాలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.

సమీప బంధువులు పతకాలు ధరించడం

[మార్చు]

భారత సైన్యపు "సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్ అడ్జుటెంట్ జనరల్స్ బ్రాంచ్" 2019 జూలై 11 న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా, మరణించిన సైనిక సిబ్బందికి దగ్గరి బంధువులు యుద్ధ స్మారక చిహ్నాల వద్ద, అంత్యక్రియల వద్ద, స్మశానవాటికల లోనూ నివాళులర్పించేందుకు హాజరవుతున్నప్పుడు వారి పతకాలను ఛాతీకి కుడి వైపున ధరించడానికి అనుమతినిచ్చింది. మరణించిన వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు, అంతకు పూర్వీకులు వంటి వారి కుటుంబ సభ్యులు, పౌర దుస్తులను ధరించి, ఈ శౌర్య లేదా సేవా పురస్కారాలను ధరించవచ్చు. [7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. SSBCrack (2017-02-18). "Ever Observed Colorful Ribbons On Soldier's Uniform? Here's What They Mean". SSBCrack (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  2. 2.0 2.1 2.2 "Mention in Dispatches". Indian Army. Retrieved 5 October 2014. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "India" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "The Official Home Page of the Indian Army".
  4. "Army's New Norms for Commendation Badges - Livefist". 13 August 2009.
  5. "Precedence Of Medals". Official Website of the Indian Army. Indian Army. Retrieved 19 February 2017.
  6. "Order of Precedence | Indian Navy". Official Website of the Indian Navy. Retrieved 25 December 2016.
  7. Indian Army allows next of kin to wear medals of late ex-servicemen during homage ceremonies, India Today, 23 July 2019.