భార్గవి (నటి)
భార్గవి కోల | |
---|---|
జననం | 1983 గోరింట్ల, గుంటూరు జిల్లా |
మరణం | డిసెంబర్ 16, 2008[1] బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ |
మరణ కారణం | హత్య |
నివాస ప్రాంతం | బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ |
ప్రసిద్ధి | సినిమా, టెలివిజన్ నటి, |
పదవీ కాలం | 2005 నుండి 2008 వరకు |
మతం | హిందువు |
భార్య / భర్త | ప్రవీణ్ కుమార్ / బుజ్జి |
పిల్లలు | ఒక బాబు |
తండ్రి | రాజేంద్రప్రసాద్ కోల |
తల్లి | భానుమతి |
భార్గవి (1983 - డిసెంబర్ 16, 2008) తెలుగు చలనచిత్ర నటి. 2005లో వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన భార్గవి, అష్టా చమ్మా సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొన్ని ధారావాహికల్లో కూడా నటించింది.[2]
జననం
[మార్చు]భార్గవి 1983లో రాజేంద్రప్రసాద్ కోల, భానుమతి దంపతులకు గుంటూరు జిల్లా, గోరింట్ల గ్రామంలో జన్మించింది.[2]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]2005లో వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతర్వాత మా ఊరి వంట, ఆట వంటి జీ తెలుగు కార్యక్రమాలతోపాటూ... అమ్మమ్మ.కాం, అమృతం వంటి ధారావాహికల్లో నటించింది. అన్నవరం, రక్ష, హాలీడేస్, అంజనీ పుత్రుడు, మిస్టర్ మేధావి, పాండురంగడు వంటి చిత్రాలతోపాటు 2008 లో వచ్చిన అష్టా చమ్మా సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించింది.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు |
---|---|---|
2009 | హాలీడేస్ | హాసిని |
2009 | అంజనీ పుత్రుడు | కన్యక శిరోమణి తులసి |
2008 | మిస్టర్ మేధావి | షీలా |
2008 | పాండురంగడు | |
2008 | అష్టా చమ్మా | వరలక్ష్మీ |
2008 | రక్ష | లక్ష్మీ |
2006 | అన్నవరం | సీతా |
2005 | దేవదాసు | హీరో బృందం |
నటించిన సీరియళ్లు
[మార్చు]సంవత్సరం | సీరియల్ పేరు | పాత్రపేరు |
---|---|---|
2007 | అమ్మమ్మ.కాం | నందు |
2007 | అమృతం | ఉమాదేవి (అప్పాజీ కూతురు) |
టెలివిజన్ కార్యక్రమాలు
[మార్చు]- ఆట (జీ తెలుగు)
- మా ఊరి వంట (జీ తెలుగు)
మరణం
[మార్చు]భార్గవి 2008, డిసెంబర్ 16న హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గరైంది. భార్గవి చనిపోయిన తరువాత ప్రవీణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.[1]
ప్రవీణ్ (బుజీ) గత ఐదు సంవత్సరాలుగా ఒక సంగీత ఆర్కెస్ట్రా (సాయిబాబా ఆర్కెస్ట్రా) ను నడుపుతున్నారు. ప్రవీణ్ (బుజీ)కి గతంలో రెండుసార్లు (గుంటూరు మాజీ DSP కుమార్తె డాలీ, సుబ్బు చిత్రనటి స్వప్న) వివాహం జరిగింది. అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
2006, ఫిబ్రవరి 12న నెల్లూరు లోని మురళీ కృష్ణ హోటల్ లో బుజ్జి స్నేహితుల సమక్షంలో బుజ్జి భార్గవిల వివాహం జరిగిందని తెలుస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 నవతరంగం. "'అష్టాచెమ్మ' భార్గవి మృతి". navatarangam.com. Archived from the original on 22 జూన్ 2017. Retrieved 12 June 2017.
- ↑ 2.0 2.1 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "భార్గవి , Bhargavi". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 12 June 2017.