Jump to content

రక్ష (సినిమా)

వికీపీడియా నుండి
రక్ష
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆకెళ్ళ వంశీకృష్ణ
నిర్మాణం ఆజం ఖాన్
కథ ఆకెళ్ళ వంశీకృష్ణ
చిత్రానువాదం ఆకెళ్ళ వంశీకృష్ణ
తారాగణం జగపతి బాబు, అతుల్, భార్గవి, జయసుధ, రాధా కుమారి, రాజీవ్ కనకాల, కళ్యాణి, జీవా
సంభాషణలు జీవన్ రెడ్డి
ఛాయాగ్రహణం సర్జీదీప్ ఘోష్
కూర్పు భానోదయ
నిర్మాణ సంస్థ వన్ మోర్ థాట్ ఎంటర్ టైన్ మెంట్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
రక్ష (సినిమా)

రక్ష అనేది 2008 లో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం. వన్ మోర్ థాట్ ఎంటర్టైన్మెంట్, జెడ్ 3 పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆజమ్ ఖాన్ నిర్మించాడు. దీనిని రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. దర్శకత్వం ఆకెళ్ళ వంశీకృష్ణ.[1] ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి ప్రధాన పాత్రల్లో నటించగా, బోపి తుతుల్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2008 హిందీ చిత్రం ఫూంక్కు రీమేక్. దీని కథాంశం యండమూరి వీరేంద్రనాథ్ రాసిన తెలుగు థ్రిల్లర్ నవల తులసి దళాన్ని పోలి ఉంటుంది.[2][3][4][5]

రాజీవ్ నాస్తికుడు, కానీ అతని భార్యకూ, తల్లికీ దేవుడు, చేతబడి మొదలైనవాటిపై విపరీతమైన నమ్మకం. నిర్మాణ స్థలంలో ఓ రోజున, అతని సహాయకుడు శ్యామ్ ( నర్సింగ్ యాదవ్ ) ఒక పురాతన వినాయక విగ్రహం కనబడిందని చెబుతాడు. వినాయకుడికి ఆలయం నిర్మించాలని రాజీవ్‌కు సలహా ఇస్తూ, నిర్మించకపోతే అది వారికి కీడు జరుగుతుందని కూడా చెబుతాడు. అయితే, రాజీవ్ అతడి మాటలను పెడచెవిన పెడతాడు. ఒక రోజు తన కంపెనీలో పెద్ద వేణు, మధులు పెద్ద మోసగాళ్ళనీ పెద్ద యెత్తున మోసానికి పాల్పడ్డారనీ రాజీవ్ తన స్నేహితుడు వినయ్ ( సుబ్బరాజు ) ద్వారా తెలుసుకుంటాడు. రాజీవ్ అందరి ముందు వారిని అవమానించి, వారిని తన సంస్థ నుండి తరిమివేస్తాడు.

ఈ సంఘటన తరువాత, అకస్మాత్తుగా ఒక రోజున, రాజీవ్ ఇంట్లో వింత విషయాలు జరుగుతాయి. రక్ష అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. రాజీవ్ తల్లి, భార్య ఊహించని ఈ పరిస్థితులను పట్టించుకొమ్మని అతన్ని వేడుకుంటారు. కాని అతను వారిని పట్టించుకోడు. రక్ష ఆరోగ్యం క్షీణించడం మొదలైనప్పుడు, రాజీవ్ ఆమెను మానసిక వైద్యుడు డాక్టర్ రంగరాజన్ ( జీవా ) వద్దకు తీసుకువెళతాడు. కాని రంగరాజన్ నోరు విప్పడు. రక్షకు జరుగుతున్న మార్పులను వివరించలేకపోయాడు. తలుపులన్నీ మూసుకుపోయిన సమయంలో, మనస్తత్వశాస్త్రంలో నిపుణురాలైన డాక్టర్ సీమ ( జయసుధ ) రంగం లోకి ప్రవేశిస్తుంది. చివరగా, రాజీవ్ అద్భుతాలనూ చేతబడినీ నమ్మడం ప్రారంభిస్తాడు. వినయ్ అతన్ని బాబా ( ప్రదీప్ రావత్ ) అనే క్షుద్ర మాంత్రికుడి వద్దకు తీసుకు వెళ్తాడు. ఇది వేణు, మధులు చేసిన చేతబడి అని తెలుసుకుంటాడు. రాజీవ్ కారు డ్రైవరు మణి (శేఖర్) వారికి సహాయం చేస్తాడు. రాజీవ్, రక్షను ఈ భయానక స్థితి నుండి ఎలా కాపాడుతాడనేది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

జగపతి బాబు,
అతుల్,
భార్గవి,
జయసుధ,
రాధా కుమారి,
రాజీవ్ కనకాల,
కళ్యాణి,
జీవా

మూలాలు

[మార్చు]
  1. "రక్ష నటీనటులు-సాంకేతిక నిపుణులు | Raksha Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-10.
  2. "Heading". Filmi Beat.
  3. "Heading-2". 123 Telugu.
  4. "Heading-3". Indiaglitz.
  5. "Heading-4". gomolo. Archived from the original on 2019-03-28. Retrieved 2020-08-10.