భాషా సామర్థ్యాలు
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పిల్లలందరిని బాధ్యతాయుతమైన, హేతుబద్దమైన పౌరులుగా తీర్చిదిద్దడమే విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం. గత కొంతకాలం వరకు చదువు జ్ఞాపకశక్తి లేదా బట్టీ విధానం మీద ఆధారపడి ఉండేది. 2009- విద్యా హక్కు చట్టం ఈ పద్ధతిని మార్చివేసింది. విద్యార్థి ఒక తరగతిని పూర్తి చేయడమంటే...ఆ తరగతిలోని అన్ని విషయాలకు సంబంధించిన సామర్థ్యాలను సాధించడమే అని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం - 2011 పేర్కొంది. అందులో భాగంగా ప్రతి విషయానికి కొన్ని సామర్థ్యాలను నిర్ధేశించింది. తెలుగు భాషను ఒక విషయంగా నేర్చుకొనే పాఠశాల విద్యార్థులు కచ్చితంగా కింది సామర్థ్యాలు సాధించాల్సి ఉందని రా. వి. ప్ర. ప. ప.-2011 పేర్కొంది[1]..
- ప్రథమ భాషగా తెలుగు నేర్చుకొనే (9, 10 తరగతుల) విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు
అవగాహన - ప్రతిస్పందన
[మార్చు]- వినడం - మాట్లాడడం, ధారాళంగా చదివి, అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం
- అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
- విద్యార్థి విన్న, చదివిన అంశాలను అర్థం చేసుకోవాలి.
- తన అభిప్రాయాలను వ్యక్తీకరించాలి.
- సమర్థిస్తూ, విభేదిస్తూ మాట్లాడగలగాలి. కారణాలు వివరించగలగాలి.
- నచ్చిన సందర్భాన్ని, అనుభూతులను వర్ణించగలగాలి.
- పద్య భావాలు, పాఠ్య భాగ సారాంశాలు, కథలు సొంత మాటల్లో చెప్పగలగాలి.
- వక్తృత్వ పోటిల్లో పాల్గొనాలి. సద్యోభాషణం చేయగలగాలి.
- జాతీయాలు, సామెతలు గుర్తించగలగాలి.
- సందర్భాలను గుర్తించగలగాలి.
- భావాలకు తగిన పద్యపాదాలను గుర్తించగలగాలి.
- పేరాలకు శీర్షికలు పెట్టడం, శీర్షికలకనుగుణంగా పేరాలను గుర్తించాలి.
- అపరిచిత గద్య, పద్యాలను చదివి అర్థం చేసుకోవాలి.
వ్యక్తీకరణ - సృజనాత్మకత
[మార్చు]- స్వీయరచన, సృజనాత్మకత, ప్రశంస
- అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
- కారణాలు రాయగలగాలి
- వివరిస్తూ రాయగలగాలి
- అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను రాయగలగాలి.
- రచయిత అభిప్రాయాలను గ్రహించి, వివరించగలగాలి.
- సమర్థిస్తూ, విభేదిస్తూ రాయగలగాలి.
- ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ రాయగలగాలి.
- అభినందన వ్యాసాలు, కరపత్రాలు, సన్మాన పత్రాలు రాయగలగాలి.
- వ్యాసాలు, కవితలు, కథలు రాయగలగాలి.
భాషాంశాలు
[మార్చు]- పదజాలం, వ్యాకరణాంశాలు
- అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
- పదాలకు అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు రాయగలగాలి.
- ఇచ్చిన పదాలను, జాతీయాలను సొంత వాక్యాలలో ప్రయోగించగలగాలి.
- ప్రకృతి, వికృతులను రాయగలగాలి.
- దైనందిన జీవితంలో జాతీయాలను, సామెతలను ఉపయోగించాలి.
- పద్యాల లక్షణాలను అర్థం చేసుకోవాలి.
- సంధులు, సమాసాలను అర్థం చేసుకొని వివరించగలగాలి.
- అలంకారాలను అర్థం చేసుకొని, వివరించగలగాలి.
ప్రాజెక్టు పనులు
[మార్చు]- వివిధ సామార్థ్యాల సమాహారం
- కథలు, కవితలు, రచయితలు, కళాకారుల వివరాలు సేకరించడం. సేకరించిన అంశాలపై నివేదికలు రూపొందించడం
మూలాలు
[మార్చు]- ↑ 10 వ తరగతి తెలుగు ఉపాధ్యాయ కరదీపిక, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ, తెలంగాణ, హైదరాబాద్, 2014, పుట- 47