Coordinates: 29°33′15″N 75°33′55″E / 29.55417°N 75.56528°E / 29.55417; 75.56528

భిరానా

వికీపీడియా నుండి
(భిర్రన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Bhirrana
Birhana, भिरड़ाना
Village,
Archaeological Excavation Site
Ancient Town of Indus Valley Civilisation
Bhirrana is located in Haryana
Bhirrana
Bhirrana
Location in Haryana, India
Bhirrana is located in India
Bhirrana
Bhirrana
Bhirrana (India)
Coordinates: 29°33′15″N 75°33′55″E / 29.55417°N 75.56528°E / 29.55417; 75.56528
Country India
రాష్ట్రంHaryana
జిల్లాFatehabad
భాషలు
 • అధికారహిందీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR
Nearest cityFatehabad

భిరానా, హర్యానారాష్ట్రం లోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం.[1][2] పురావస్తు పరిశోధనలలో వెల్లడైన ఆధారాలను బట్టి దాని చరిత్ర హరప్పా నాగరికత కంటే ముందు కాలానికి, సా.పూ. 8 - 7 సహస్రాబ్దులకు చెందినదని తేలింది. దీన్ని భిర్దానా, భిర్హానా అని కూడా అంటారు.

ఉపస్థిత ప్రదేశం[మార్చు]

Bhirrana site
స్థానంHaryana, India
నిర్దేశాంకాలు29°33′15″N 75°33′55″E / 29.55417°N 75.56528°E / 29.55417; 75.56528
పొడవు190 m (620 ft)
వెడల్పు240 m (790 ft)
చరిత్ర
స్థాపన తేదీApproximately 7570 BCE
వదిలేసిన తేదీApproximately 2600 BCE
పీరియడ్‌లుHakra Wares to Mature Harappan
సంస్కృతులుIndus Valley Civilization
స్థల గమనికలు
తవకాల తేదీలు2003-04, 2004–05, 2005-06

ఈ ప్రదేశం న్యూ ఢిల్లీ-ఫాజిల్కా జాతీయ రహదారి మిద న్యూ ఢిల్లీకి వాయువ్య దిశలో 220 కిలోమీటర్లు, ఫతేహాబాదు జిల్లాలోని భునా రహదారి మీద జిల్లా ప్రధాన కార్యాలయానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధునిక హర్యానాలో నహను నుండి సిర్సా వరకు ప్రవహించే ఘగ్గరు నది (వర్షానుగుణంగా ప్రవహిస్తుంది) పురాతన-కాలువ వెంట కనిపించే అనేక ప్రాంతాలలో ఈ ప్రాంతం ఒకటి.

ఈ మట్టిదిబ్బ ఉత్తర-దక్షిణాలుగా 190 మీటర్లు, తూర్పు-పడమరగా 240 మీటర్ల పొడవు ఉంటుంది. చదునుగా ఉండే ఒండ్రుమట్టితో కూడిన సోటారు మైదానం చుట్టుపక్కల ప్రాంతంలో 5.50 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది.

త్రవ్వకం[మార్చు]

2003-04, 2004-05, 2005-06 మధ్యకాలంలో " ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " నిర్వహించిన నాగపూరు తవ్వకం శాఖ -1 ఈ క్షేత్రాన్ని మూడు క్షేత్ర సీజన్లలో తవ్వారు. రావు తదితరులు దీని మీద అనేక ప్రచురణలు రాశారు.

కాలనిర్ణయం[మార్చు]

రావు అభిప్రాయం ఆధారంగా హక్రా వేరు సంస్కృతి భిరానాలో కనుగొనబడింది. ఇది హరప్పాసంస్కృతికి పూర్వం కాలం (క్రీ.పూ. 8 వ -7 వ సహస్రాబ్ది) నాటిది.[3][4][5] హక్రా పాత్రల సంస్కృతి అనేది సింధు లోయ ప్రారంభ హరప్పా రావి దశ సంస్కృతి (క్రీ.పూ. 3300-2800) తో సమకాలీనమైన భౌతిక సంస్కృతి.[6][7]

దీక్షితు, రామి అభిప్రాయం ఆధారంగా హరప్పా పూర్వం భిరానా ప్రాచీనత అంచనా కార్బను నమూనాల లెక్కలు ఆధారంగా రెండు కాలాలు నిర్ణయించబడ్డాయి; ఇది వరుసగా క్రీ.పూ. 7570-7180, క్రీ.పూ 6689-6201.[3][4]

సంస్కృతులు[మార్చు]

రావు అభిప్రాయం ఆధారంగా ఈ త్రవ్వకాలు ఈ సాంస్కృతిక కాలాలను వెల్లడించింది; కాలం 1 ఎ. హక్రా పాత్రల సంస్కృతి, కాలం 1 బి: ప్రారంభ హరప్పా సంస్కృతి, కాలం 2 ఎ: ప్రారంభ పరిపక్వ హరప్పా సంస్కృతి, కాలం 2 బి: పరిపక్వ హరప్పా సంస్కృతి.[3][4][5]

కాలం 1 ఎ: హక్రా వస్తువుల సంస్కృతి[మార్చు]

తవ్వకం దాని ప్రారంభ దశ నుండే హరప్పా సంస్కృతి అవశేషాలను వెల్లడించింది. అనగా హక్రా పాత్రల[8] సంస్కృతి (ఉపఖండంలో ప్రారంభ హరప్పా సంస్కృతి అంటారు. దీనిని కాలిబంగను 1 అని కూడా అంటారు) పూర్తి స్థాయి పరిపక్వ హరప్పా నగరం. భిరానా తవ్వకానికి ముందు హక్రా పాత్రల సంస్కృతి లేదు. ప్రారంభ హరప్పా సంస్కృతికి ముందున్నదని భావిస్తున్న హక్రా పాత్రల సంస్కృతి ఇతర ఏ భారతీయ ప్రదేశంలోనూ బహిర్గతం చేయలేదు. ఈ సంస్కృతి అవశేషాలు మొదటిసారిగా భిరానా వద్ద బహిర్గతమయ్యాయి. ఈ సంస్కృతి సహజ మట్టిలో కత్తిరించబడిన భూగర్భ నివాస గుంటల రూపనిర్మాణాలుగా వర్గీకరించబడుతుంది. ఈ గుంటల గోడలు, నేల సరస్వతి లోయ పసుపు రంగు వండ్రుమట్టితో పూత చేయబడ్డాయి. ఈ కాలపు కళాఖండాలలో రాగి గాజులు, రాగి బాణం ములుకులు, టెర్రకోట గాజులు, కార్నెలియను పూసలు, లాపిసు లాజులి, స్టీటైటు, ఎముక బిందువు, రాతి జీను, తిరగలి ఉన్నాయి. .[9] మృణ్మయ పాత్రల సుసంపన్న సంగ్రహాలయం, ఈ కాలపు రోగనిర్ధారణ వస్తువులలో మడ్ అప్లికు పాత్రలు, సైజులు (లోతైనవి, తేలికైనవి), టాను / చాక్లెటు స్లిప్డు పాత్రలు, బ్రౌను-ఆన్-బఫు పాత్రలు, బిక్రోం పాత్రలు (నలుపు, తెలుపు వర్ణద్రవ్యం కలిగిన బాహ్య చిత్రాలు ), నలుపు - ఎరుపు పాత్రలు, సాదా ఎరుపు వస్తువులు.

కాలం 1 బి: ప్రారంభ హరప్పా సంస్కృతి[మార్చు]

ఈ కాలంలో మొత్తం ప్రాంతం ఆక్రమించబడింది. ఈ స్థావరం కోట లేని బహిరంగ ప్రదేశం. ఇళ్ళు 3: 2: 1 నిష్పత్తిలో బఫు కలరు మట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. కలిబంగను కాలానికి చెందిన 6 వస్త్రాలు మొదటి హక్రా సంస్కృతికి చెందిన వస్తువులతో ఈ కాలానికి చెందిన కుండలు గురించి చూపిస్తుంది ఈ కాలపు కళాఖండాలలో షెలు, బాణం ములుకులు, గాజులు, రాగి వలయాలు, కార్నెలియను, జాస్పరు, లాపిసు లాజులి, స్టీటైటు, షెలు, టెర్రకోట, ఆభరణాలలో ఉపయోగించే పతకాలు, ఎద్దు బొమ్మలు, గిలక్కాయలు, చక్రాలు, క్రీడాకారులు, టెర్రకోట గోళీలు, టెర్రకోట - పింగాణీ గాజులు, ఎముక వస్తువులు, స్లింగు బంతులు, గోళీలు, ఇసుకరాయి పౌండర్లు.

కాలం 2 ఎ: ప్రారంభ పరిపక్వ హరప్పా సంస్కృతి[మార్చు]

ఈ కాలం నగర లే-అవుట్‌లో పరివర్తన ద్వారా గుర్తించబడింది. ఒక కోట గోడ లోపల మొత్తం స్థావరం ఉంది. పట్టణ ప్రణాళిక జంట యూనిట్లు; కోట ప్రహరీ, దిగువ పట్టణం వాడుకలోకి వచ్చాయి. మట్టి ఇటుక నిర్మాణాలు ఉత్తరంలో కొంచెం ఖాళీతో నిర్మించబడ్డాయి. వీధులు, దారులు, ఉప-మార్గాలు ఇలాంటి పద్ధతిలోనే ఉన్నాయి. మృణ్మయ పాత్రల బృహత్తర సేకరణ ప్రారంభ హరప్పా, పరిపక్వ హరప్పా రూపాల మిశ్రమ శైలిని చూపిస్తుంది. ఈ కాలపు కళాఖండాలలో పాక్షిక విలువైన రాళ్ల పూసలు (రెండు సూక్ష్మ కుండీలలో ఉంచిన రెండు పూసల కాష్లతో సహా), రాగి, షెలు, టెర్రకోట, పింగాణీ గాజులు ఉన్నాయి; చేపలుపట్టే గాలి, ఉలి, రాగి బాణం; టెర్రకోట జంతు బొమ్మలు, ఇతర కళాఖండాలు ఉన్నాయి.

కాలం 2 బి: పరిపక్వ హరప్పా సంస్కృతి[మార్చు]

బాగా అభివృద్ధి చెందిన హరప్పా నగరం అన్ని లక్షణాలతో ఈ స్థలంలో చివరి ఆక్రమణలు పరిపక్వ హరప్పా కాలానికి చెందినవి. ఈ కాలంలోని ముఖ్యమైన కళాఖండాలు స్టీల్సు ముద్రలు, రాగి, టెర్రకోట, పింగాణీ, షెలు గాజులు, రాగి, ఎముక వస్తువులు, టెర్రకోట స్పోక్డు చక్రాలు, టెర్రకోట జంతు బొమ్మలు, లాపిసు లాజులి పూసలు, ఎరుపురాయి, అగాటె, పింగాణీ, స్టీటైటు, టెర్రకోట, రాతి వస్తువులు.[9] మోహెంజోదారో నుండి ప్రసిద్ధమైన "నృత్యంచేసే యువతి" ప్రతిరూపం ఒక కుండ మీద[1] ఒక గ్రాఫిటీ రూపంలో చెక్కబడి ఉంది.[10] పట్టణం భారీ కోట గోడ[9] మట్టి ఇటుకలతో నిర్మించబడింది. ఇళ్ళు మట్టి ఇటుకలతో (ఎండతో కాల్చిన ఇటుకలు) తయారు చేయబడ్డాయి. ఇళ్ళు వేరుచేసే విస్తృత సరళ రహదారులను చూడవచ్చు. కాల్చిన భూమి వృత్తాకార నిర్మాణం బహుశా "తాండూరు" - గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ కనిపించే కమ్యూనిటీ కిచెను. కాల్చిన ఇటుకల ఉనికిని ఇళ్ళ నుండి మురికినీటిని బయటకు తీయడానికి కోట గోడ ఉత్తరభాగంలో ఉన్న ప్రధాన కాలువలో ఉపయోగించబడుతుంది.

నృత్యం చేస్తున్న యువతి[మార్చు]

భిరానాలోని కుమ్మరి గ్రాఫిటీ "మత్స్యకన్య" రకం దేవతలు, నాట్య చేస్తున్న యువతి చూపిస్తుంది;[1] తరువాతివారికి మోహెంజో-దారో కాంస్య "నృత్యం చేస్తున్న యువతి" కు సమానమైన భంగిమ ఉంది. పురావస్తు శాస్త్రవేత్త ఎల్.ఎస్. "భిరానా స్తకళాకారుడికి పూర్వపు వంశపారంపర్య జ్ఞానం ఉన్నట్లు తెలుస్తుంది" అని రావు పేర్కొన్నాడు.[9][11] ఈ దేవతలు లేదా నాట్య భంగిమలో ఉన్న యువతులు సింధు లోయలో విస్తృతంగా వ్యాపించిన జల కర్మలతో సంబంధం ఉన్న అప్సరాలు లేదా జలదేవతలను సూచిస్తారు.[10]

ఇతర పరిశోధనలు[మార్చు]

రంగులద్దిన చువ్వలతో టెర్రకోట చక్రాలు ఉన్నాయి.[12] ప్రజలు నిస్సారమైన మట్టి ప్లాస్టర్డు భూగర్భ నివాసాలు, గుంటలలో పారిశ్రామిక కార్యకలాపాలు లేదా యఙయాగాదులు కూడా ఉపయోగించారు.[9] ఈ స్థలంలో బహుళ గదుల గృహాలు, పది గదులతో ఒక ఇల్లు, మూడు గదులతో కూడిన ఇల్లు బహిర్గతమయ్యాయి. మరొక ఇంట్లో వంటగది, కోర్టు యార్డులు, చుల్లా [అనగా, చుల్హా, వంట పొయ్యిలు] వంటగదిలో ఉన్నాయి; చుల్లా పక్కన, కాల్చిన ధాన్యాలు కూడా కనుగొనబడ్డాయి. [9] రావు ప్రకారం, సింధు లోయ నాగరికత అన్ని దశలు ఈ ప్రదేశంలో ప్రాతినిధ్యం వహిస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Harappan link". Frontline. 19 జనవరి 2008.
  2. Kunal, Bhirdana and Banawali in Fatehabad
  3. 3.0 3.1 3.2 Dikshit 2013, p. 129-133.
  4. 4.0 4.1 4.2 Mani 2008, p. 237-238.
  5. 5.0 5.1 Sarkar 2006, p. 2-3.
  6. Coningham & Young 2015, p. 158.
  7. Ahmed 2014, p. 107.
  8. William Law (II), Randal (2008). Inter-regional Interaction and Urbanism in the Ancient Indus Valley: A Geologic Provenience Study of Harappa's Rock and Mineral Assemblage. Ann Arbor, MI: ProQuest. p. 83. ISBN 9780549628798.[permanent dead link]
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. pp. 109, 145, 153. ISBN 9788131711200.
  10. 10.0 10.1 Mahadevan, Iravatham (ఆగస్టు 2011). "The Indus Fish Swam in the Great Bath: A New Solution to an Old Riddle" (PDF). Bulletin of the Indus Research Centre (2): 19. Archived from the original (PDF) on 18 ఏప్రిల్ 2015. Retrieved 5 జూలై 2012.
  11. "The ageless tale a potsherd from Bhirrana tells". The Hindu. 12 సెప్టెంబరు 2007. Archived from the original on 17 సెప్టెంబరు 2007. Retrieved 30 అక్టోబరు 2019.
  12. "Images of Excavation Site - Bhirrana, A Harappan town - Archaeological Survey of India". asi.nic.in. Archived from the original on 27 సెప్టెంబరు 2007. Retrieved 14 జూలై 2007.

వనరులు[మార్చు]

ఇతర అధ్యయనాలు[మార్చు]

  • The Tribune, 2 January 2004
  • Puratattva, The Bulletin of the Archaeological Society of India No. 34, 35 and 36;
  • Man and Environment xxxi

ఇతర లింకులు[మార్చు]

మూస:Indus Valley Civilization మూస:Haryana మూస:Fatehabad District

"https://te.wikipedia.org/w/index.php?title=భిరానా&oldid=3808245" నుండి వెలికితీశారు