భీమ్‌రావ్ తాప్‌కీర్
భీమ్‌రావ్ తాప్‌కీర్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2011 | |||
ముందు | రమేష్ వాంజలే | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖడక్‌వస్లా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పూణే, మహారాష్ట్ర, భారతదేశం | 1960 సెప్టెంబరు 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | ధంక్వాడి పూణే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
భీమ్‌రావ్ ధోండిబా తాప్‌కీర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖడక్వాస్లా శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]భీమ్‌రావ్ తాప్‌కీర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2001లో పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తొలిసారి కార్పొరేటర్‌గా ఆ తరువాత 2006లో పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తిరిగి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు . ఆయన 2011లో ఖడక్‌వస్లా ఎమ్మెల్యే రమేష్ వాంజలే మరణం తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
భీమ్‌రావ్ తాప్‌కీర్ 2014 మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థి దిలీప్ బరాటేను 63026 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి,[2] 2019 ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థి సచిన్ డోడ్కేను 2,495 ఓట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి డోడ్కే సచిన్ శివాజీరావును 52322 ఓట్ల తేడాతో ఓడించి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Khadakwasala Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Khadakwasala" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.