భూకైలాస్ దేవాలయం - అంతారంతాండ
భూకైలాస్ దేవాలయం అంతారంతాండ | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°14′05″N 77°34′55″E / 18.234772°N 77.581809°E |
పేరు | |
ఇతర పేర్లు: | భూకైలాసం క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలు హరిహర క్షేత్రంగా |
ప్రధాన పేరు : | భూకైలాస్ దేవాలయం |
దేవనాగరి : | भूकैलाश देवस्थान, अंताराम टांडा, तांढुर, विकाराबाद जिला, तेलंगाना। |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం |
ప్రదేశం: | అంతారం తాండ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు |
ప్రధాన దేవత: | పార్వతి |
ఉత్సవ దైవం: | వీరభద్రుడు, ఆంజనేయుడు, వినాయకుడు, |
ఉత్సవ దేవత: | తుల్జా భవానీ, కాళికాదేవి, |
ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారత దేశ హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 12 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 2001లో |
సృష్టికర్త: | వాసు పవార్ నాయక్ |
భూకైలాస్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా, తాండూరు రెవెన్యూ డివిజను తాండూరు మండలంలోని అంతారం తాండలో కొలువైన పరమశివుడిని దర్శించుకుంటే సకల కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం.భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు[1][2][3].
స్థలపురాణం
[మార్చు]వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని అంతారం తాండ నివాసి పవార్ వాసు నాయక్ అనే శివభక్తుడు 2001 లో నేపాల్ లోని కొలువైన పశుపతినాథ్ దేవాలయం యానికి వెళ్ళాడట. అచటనే దేవుని సన్నిధిలో నాలుగు సంవత్సరాలు ఉండి అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడట.ఒక రోజు తన మదిలో ఆలోచన వచ్చిందట .ఈ పశుపతి నాథ్ ఆలయ మాదిరిగానే తన అంతారం తాండలో నిర్మించాలని అనుకున్నాడట. తాండకు వచ్చిన తర్వాత ఒక రోజు తన కుటుంబ సభ్యులతో పుంచుకున్నాడట తమ్ముడు శంకర్ పవార్ నాయక్ సరే అని చేప్పడంతో నిర్మాణం మొదలుపెట్టారట. తాము నిర్వహించే స్థిరాస్తి వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో యాభై శాతాన్ని ఆలయ నిర్మాణం కోసం కేటాయించడం మొదలు పెట్టారు. దాతల నుంచి విరాళాలనూ సేకరించారు.అలా 2001 లో ఐదెకరాలకు పైగా స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. తొమ్మిదేళ్లకు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో 2010 నుంచీ భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచామని చెబుతారు.
విశేషాలు
[మార్చు]తాండూరు అంతారం తాండలో వెలసిన భూకైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు ఉండటం విశేషం. ఈ శివాలయంలో భక్తులు నీళ్లలోని నడుచుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళి గర్భాలయంలో చేరుకోవచ్చు.
బ్రహ్మోత్సవాలు
[మార్చు]అంతారం తాండలో వెలసిన భూకైలాస్ ఆలయంలో స్వామివారికి నిత్యం పూజల తోపాటు ప్రతి రోజూ రుద్రాభిషేకం చేస్తారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆ సమయంలో జరిగే శివపార్వతుల కళ్యాణం, హోమాలు, అభిషేకాలు,ఇతర పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఇచట తాండకు చెందిన బంజారా లంబాడీ గిరిజన మహిళల సాంప్రదాయ దుస్తుల్లు ధరించి చేసే నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అపురూప దృశ్యాలను చూసేందుకు భక్తులు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి మొక్కులు చెల్లిస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
[మార్చు]ఈ భూకైలాస్ ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండడం విశేషం.ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇచ్చటనే ప్రితిష్ఠించారు.నీళ్ళ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళి మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు[4].
ఆలయంలో విగ్రహాలు
[మార్చు]తాండూరు అంతారం తాండలో వెలసిన భూకైలాసంగా పిలిచే ఈ ఆలయంలో కాలభైరవుడు, 65 అడుగుల ఎత్తులో ఉన్న శివుని విగ్రహం, వీరభద్రుడు, హనుమంతుడు, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, సాయిబాబా ఆలయం, వినాయకుని ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం, సీతారామ ఆలయం, పంచముఖి హనుమాన్ దేవాలయం, కాళికాదేవి ఆలయం, కొలను , స్విమ్మింగ్ పూల్ మొదలగు ఆలయాలను దర్శించుకోవచ్చు.
సేవాకార్యక్రమాలు
[మార్చు]ఈ భూకైలాస్ ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తు ఉంటారు. పెళ్లి చేసుకొనే పెద జంటలకు ఆలయ కమిటీ సభ్యుల వద్ద తమ పేర్లు నమోదు చేయించినచో వాళ్ళుకు కళ్యాణం కూడా నిర్వహించటం జరుగుతుంది. ఆర్థిక స్థోమత లేని పెద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సాయం కూడా అందజేయడం జరుగుతుంది.
ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఈ ఆలయం వికారాబాద్ జిల్లా ,తాండూరు మండలంలోని అంతారం తాండలో ఉంది. హైదరాబాదు నుండి రైళ్ళులలో గాని, బస్సులు ప్రైవేటు వాహనాల్లో ముందుగా తాండూరు చేరుకోవాలి.తాండూరు నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయాన్ని చేరుకోవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Sanagala, Naveen (2014-04-08). "Bhukailas Temple, Tandur". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-12-16.
- ↑ "తండాలో వెలిసిన భూకైలాసం". EENADU. Retrieved 2024-12-16.
- ↑ "Bhukailash Temple Tandur: History, Timings, How to Reach" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-11-27. Retrieved 2024-12-16.
- ↑ Tiwari, Richa Vishwadeepak (2024-04-04). "Bhukailash Temple Tandur History Timings | Tourism News in Hindi Samachar | Tourism की ताज़ा खबरे हिन्दी में | ब्रेकिंग और लेटेस्ट न्यूज़ in Hindi Newstrack | Bhukailash Temple History: बहुत खास है तेलंगाना का भू कैलाश मंदिर, करें अध्यात्म का एहसास | News Track in Hindi". Newstrack (in హిందీ). Retrieved 2024-12-16.