భూటాన్ - భారత దేశ సంబంధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indo-Bhutanese సంబంధాలు
Map indicating locations of India and Bhutan

India

భూటాన్
భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ ప్రధాని త్సేరింగ్ తోబ్గేతో సమావేశం అయిన దృశ్యం

హిమాలయ రాజ్యమైన భూటాన్కీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాంప్రదాయకంగా సన్నిహఙతంగా ఉంటాయి ఈ రెండు దేశాలూ ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయి, [1] [2] ఆ ప్రత్యేక అనుబంధం ద్వారా భూటాన్‌ ఒక రక్షిత రాజ్యంగా ఉంటుంది, కానీ అది భారతదేశపు రక్షిత ప్రాంతం కాబోదు. భూటాన్ విదేశాంగ విధానం, రక్షణ, వాణిజ్యాలపై భారతదేశం ప్రభావశీలంగా ఉంది. 2012–13 ఆర్థిక సంవత్సరంలో, ఈ దేశానికి భారతదేశం ఇచ్చిన బడ్జెట్ మద్దతు 600 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 3000 కోట్ల రూపాయలు). ఇది 2015-16లో 985 మిలియన్ అమెరికన్ డాలర్లకు (6160 కోట్ల రూపాయలకు) చేరుకుంది. ఇలా భారతదేశ విదేశీ సహాయానికి అతిపెద్ద లబ్ధిదారుగా భూటాన్ నిలిచింది. భూటాన్ ప్రధాన మంత్రి, షెరింగ్ టోబ్గే, 2013 ఆగస్టులో కొత్త ఢిల్లీ పర్యటన సందర్భంగా భూటాన్ కోసం భారతదేశం నుండి 5400 కోట్ల రూపాయల (ఒప్పందం కుదుర్చుకునే సమయంలో మారకపు రేట్ల ప్రకారం US $ 819 మిలియన్లు) అదనపు సహాయ ప్యాకేజీని అభ్యర్థించారు. ఈ మొత్తంలో ఐదవ వంతు (4500 కోట్ల రూపాయలు) భూటాన్ దేశపు 11వ పంచవర్ష ప్రణాళికకు కేటాయించబడింది. మునుపటి ప్రణాళిక కాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం 400 కోట్ల రూపాయలు కేటాయించారు. భారతదేశపు "ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ" లో మిగిలిన 5 బిలియన్ రూపాయలు మందగమనంలో సాగుతున్న భూటాన్ ఆర్థిక వ్యవస్థ కోసం. భారతదేశం భూటాన్‌లో 1,416 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది, ఇవి కాక 2,129 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే మరో 3 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. భూటాన్ మూడవ ప్రధాన మంత్రి లోటే థెరింగ్ నవంబర్ 2018లో తన మొదటి విదేశీ పర్యటనలో 12వ పంచవర్ష ప్రణాళిక కోసం సుమారు 45 బిలియన్ డాలర్ల (సుమారు 63.5 కోట్ల రూపాయల) సహాయ ప్యాకేజీని పొందారు. ఈ సమావేశంలో మంగ్దేచు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ సుంకం రేటు కూడా చర్చకు వచ్చింది, ఇక్కడ లోటే షెరింగ్ రేటును Nu.4.27 కు (Nu అంటే భూటానీస్ కరెన్సీ అన్‌గల్ట్రమ్) పెంచడానికి ప్రయత్నించారు, కాని ఇది భారత ప్రభుత్వ చర్చల ధర Nu.4.1 వైపు ముగిసింది. తుదకు ప్లాంట్ కోసం సవరించిన సుంకం రేటు అప్పుడు Nu.4.12 వద్ద పరిష్కారమైంది. భూటాన్ ప్రభుత్వం వాణిజ్య సౌకర్యాలను, ఆర్థిక సంబంధాలను వృద్ధి చేయడానికి 4 బిలియన్లను అందుకుంది. [3]

నేపథ్యం[మార్చు]

భూటాన్ తన చరిత్రలో ఎక్కువ భాగం బయటి ప్రపంచం నుండి తన ఒంటరితనాన్ని కాపాడుకుంది, అంతర్జాతీయ సంస్థలకు దూరంగా ఉండి, కొద్దిపాటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించింది. 1910లో ఒక ఒప్పందంపై సంతకం చేసిన తరువాత భూటాన్ బ్రిటిష్ ఇండియాకు రక్షణాత్మక ప్రాంతంగా మారింది, ఇది బ్రిటిష్ వారు భూటాన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ విషయాల్లో "మార్గనిర్దేశం" చేయడానికి వీలు కల్పించింది. 1947లో భారతదేశ స్వాతంత్ర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశాల్లో భూటాన్ ఒకటి, ఆ క్రమంలో ఇరు దేశాలు దగ్గరి సంబంధాలను పెంపొందించుకున్నాయి, 1950లో టిబెట్‌ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చేజిక్కించుకోవడమూ, భూటాన్, భారతదేశాలు రెండింటితో చైనా సరిహద్దు వివాదాలు కలిగివుండడం ద్వారా భూటాన్ ప్రాముఖ్యత పెరిగింది. నేపాల్, భూటాన్ రెండూ భారతదేశపు "హిమాలయ సరిహద్దు" భద్రతా విధానానికి కేంద్రంగా ఉన్నాయి. భారతదేశం 605 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. భూటాన్‌కు భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, దాని ఎగుమతుల్లో 98 శాతం, దిగుమతుల్లో 90 శాతం వాటా భారతదేశానిదే. [4]

మూలాలు[మార్చు]

  1. Handle with care, Bhutan is a friend Archived 2017-02-15 at the Wayback Machine
  2. Narendra Modi leaves for Bhutan on his first foreign visit as PM Archived 2017-02-15 at the Wayback Machine
  3. Palden, Tshering (January 1, 2019). "India-Bhutan relations strengthened: PM". Journalism. Kuensel. Kuensel. Retrieved 12 February 2019.
  4. Singh Visits Bhutan to Show India Backs Its Democratic Changes Archived 2014-06-15 at the Wayback Machine