భూభ్రమణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తన యొక్క అక్షం చుట్టూ భూభ్రమణం చూపే ఒక యానిమేషన్.
నేపాల్ హిమాలయాలు పైగా ఉత్తరపు రాత్రి ఆకాశం, భూమి తిరుగుతున్నట్లుగా నక్షత్ర మార్గాలు చూపిస్తున్నాయి.

భూభ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తొరగడం. భూమి పశ్చిమం నుండి తూర్పు వైపుగా ప్రోగ్రేడ్[lower-alpha 1] దిశలో తిరుగుతుంటుంది. ఉత్తర నక్షత్రం లేదా ధృవనక్షత్రము పొలారిస్ నుండి చూస్తే భూమి అపసవ్య దిశలో తిరుగుతుంటుంది. ఉత్తర ధ్రువాన్ని భౌగోళిక ఉత్తర ధ్రువం అని కూడా అంటారు. ఇది ఉత్తరార్ధగోళంలోని పాయింట్, ఇక్కడ భూమి భ్రమణాక్షం దాని ఉపరితలం కలుస్తుంది. ఈ పాయింట్ భూమి యొక్క ఉత్తర అయస్కాంత ధ్రువానికి భిన్నమైనది. దక్షిణ ధృవం అనేది అంటార్కిటికాలో భ్రమణము యొక్క భూ అక్షం దాని ఉపరితలం కలిసే మరొక పాయింట్. భూమి సూర్యునికి సంబంధించి 24 గంటల కొకసారి నక్షత్రాలకు సంబంధించి ప్రతి 23 గంటల 56 నిమిషాల 4 సెకన్లకు ఒకసారి గుండ్రంగా తిరుగుతుంది.
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist for a group named "lower-alpha", but no corresponding <references group="lower-alpha"/> tag was found, or a closing </ref> is missing

"https://te.wikipedia.org/w/index.php?title=భూభ్రమణం&oldid=2622181" నుండి వెలికితీశారు