Jump to content

మంజమ్మ జోగతి

వికీపీడియా నుండి
మంజమ్మ జోగతి
జననం
మంజునాథ శెట్టి

(1964-04-18) 1964 ఏప్రిల్ 18 (వయసు 60)
వృత్తికన్నడ రంగస్థల నటి, గాయని, జానపద నృత్య నర్తకి
పురస్కారాలు
  • 2006 కర్ణాటక జనపద అకాడమీ అవార్డు.
  • 2010 వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డు.
  • 2021పద్మశ్రీ పురస్కారం (కళల విభాగం)

మంజమ్మ జోగతి (18 ఏప్రిల్ 1964) కన్నడ రంగస్థల నటి, గాయని, జానపద నృత్య నర్తకి. 2019లో క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా పనిచేసింది.[1][2][3].జనవరి 2021లో, జానపద కళల రంగానికి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.[4][5]

జననం

[మార్చు]

మంజమ్మ బళ్లారి జిల్లాలోని కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య,జయలక్ష్మి దంపతులకు జన్మించింది.మంజమ్మ అసలు పేరు మంజునాథ శెట్టి.10వ తరగతి వరకు చదువుకుంది.

జీవిత విశేషాలు

[మార్చు]

మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.మంజమ్మ అసలు పేరు మంజునాథ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించి మంజమ్మగా పేరు మార్చుకున్నారు. దీనిని ఆమె కుటుంబం కూడా అంగీకరించి మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేసింది. [6]జోగప్ప అనేది అతి పురాతన హిజ్రాల వర్గం. వీరు దేవుడిని పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని దేవుడికి అంకితమిస్తారు. అలా మంజునాథ శెట్టి కూడా దేవుడిని పెళ్లి చేసుకుని మంజమ్మ జోగతిగా మారింది. అయితే ఆ తర్వాత మంజమ్మను తన కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.దాంతోఆమె చీర క‌ట్టుకుని వీధుల్లో తిరుగుతు భిక్షాట‌న చేసేది. ఈ క్రమంలో క‌ల్ల‌వ జోగ‌తి అనే నత్యకళాకారుడి చెంతకు చేరింది. అలా ఆమెకు ఆమెకు డ్యాన్స్ నేర్పాడు. అలా అతని వద్ద మంజమ్మ జోగ‌ప్ప జాన‌ప‌ద నృత్యం నేర్చుకుంది. నృత్యంలో చక్కటి ప్రావీణ్యత సంపాదించింది. జోగిని కాళవ్వ మరణానంతరం జోగటి బృందం బాధ్యతలు స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో జానపద నృత్య కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.[7]

అవార్డులు

[మార్చు]
  • 2006లో కర్ణాటక జనపద అకాడమీ అవార్డు.
  • 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డు.
  • 2021పద్మశ్రీ పురస్కారం (కళల విభాగం)

మూలాలు

[మార్చు]
  1. Archana Nathan (15 Nov 2019). "Meet Manjamma Jogati: The first trans-president of the Karnataka Janapada Academy". The Hindu Business Line. Retrieved 16 Jan 2021.
  2. Theja Ram (20 Nov 2020). "A house for Manjamma: Crowdfunding campaign for a trans woman leader in Karnataka". The News Minute. Retrieved 16 Jan 2021.
  3. Asmita Bhakshi (9 Nov 2020). "The unstoppable dance of Manjamma Jogati". Live Mint.com. Retrieved 16 Jan 2021.
  4. "ಪದ್ಮ ಪುರಸ್ಕಾರಗಳು" [Padma Awards]. Prajavani (in Kannada). 25 January 2021. Retrieved 25 January 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. "List of Pamda awardees". The Hindu. 25 January 2021. Retrieved 26 January 2021.
  6. "Manjamma Jogathi: నాడు యాచకురాలు.. నేడు పద్మశ్రీ గ్రహీత". EENADU. Retrieved 2021-11-11.
  7. telugu, 10tv (2021-11-10). "Manjamma Jogati : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ.. రాష్ట్ర‌ప‌తికి చీర కొంగుతో దిష్టితీసిన ట్రాన్స్ జెండర్ | transgender folk dancer Manjamma Jogati receives padma shri". 10TV (in telugu). Retrieved 2021-11-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)