Jump to content

మాస్టర్ మంజునాథ్

వికీపీడియా నుండి
(మంజునాథ్ నాయకర్ నుండి దారిమార్పు చెందింది)
మాస్టర్ మంజునాథ్
జననం
మంజునాథ్ నాయకర్

(1976-12-23) 1976 డిసెంబరు 23 (వయసు 47)
జాతీయత భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మాల్గుడి రోజులు (1987) లో స్వామి

మంజునాథ్ నాయకర్ (ఆంగ్లం: Manjunath Nayaker; 1976 డిసెంబరు 23)గా జన్మించిన మాస్టర్ మంజునాథ్ (Master Manjunath) ప్రముఖ సినీ, టి.వి. నటుడు. ఇతడు సుమారు 68 కన్నడ, హిందీ, తెలుగు సినిమాలలో నటించాడు.

నట జీవితం

[మార్చు]

దూరదర్శన్, వెండితెరలో శంకర్ నాగ్ దర్శకత్వంలో నిర్మించిన మాల్గుడి రోజులు (1987) లో ఇతడి నటన పలువురి ప్రశంశలు పొందినది. ఇది ఆర్.కే. నారాయణ్ రచించిన స్వామి అతని మిత్రులు ఆధారంగా తీసారు.[1][2] దీనికి గాను అతనికి ఆరు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. తర్వాత అగ్నిపథ్ (1990) సినిమాలో విజయ్ గా అమితాబ్ బచ్చన్ తో నటించాడు. తెలుగు పరిశ్రమలో స్వాతి కిరణం (1992) లో ముమ్మూట్టితో దీటుగా నటించి మెప్పించాడు.

ఇతడు 19 సంవత్సరాల వయసులో నటనకు స్వస్తి పలికి చదువు మీద శ్రద్ధ చూపి ఎమ్.ఎ. (సోషియాలజీ), చలనచిత్రీకరణలో డిప్లొమా, సి.ఎ. పూర్తిచేశాడు.[2], [3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మంజునాథ్ క్రీడాకారిణి స్వర్ణరేఖను వివాహమాడారు.[2] ఇతడు ప్రస్తుతం బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ""I exactly acted as I imagine Swami to be"". Rediff.com. May 16, 2001.
  2. 2.0 2.1 2.2 "The star of Malgudi Days". ది హిందూ. ది హిందూ. Oct 24, 2004. Archived from the original on 2012-01-14. Retrieved 2011-09-21.
  3. 3.0 3.1 "Life and times of Swami". Mumbai Mirror. March 28, 2010. Archived from the original on 2012-10-02. Retrieved 2011-09-21.

బయటి లింకులు

[మార్చు]