మాస్టర్ మంజునాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాస్టర్ మంజునాథ్
జననం మంజునాథ్ నాయకర్
(1976-12-23) 1976 డిసెంబరు 23 (వయస్సు: 41  సంవత్సరాలు)
కర్ణాటక
జాతీయత  భారతదేశం
ప్రసిద్ధులు మాల్గుడి రోజులు (1987) లో స్వామి

మంజునాథ్ నాయకర్ (Manjunath Nayaker) (born 23rd Dec 1976) గా జన్మించిన మాస్టర్ మంజునాథ్ (Master Manjunath) ప్రముఖ సినీ మరియు టి.వి. నటుడు. ఇతడు సుమారు 68 కన్నడ, హిందీ మరియు తెలుగు సినిమాలలో నటించాడు.

నట జీవితం[మార్చు]

దూరదర్శన్ మరియు వెండితెరలో శంకర్ నాగ్ దర్శకత్వంలో నిర్మించిన మాల్గుడి రోజులు (1987) లో ఇతడి నటన పలువురి ప్రశంశలు పొందినది. ఇది ఆర్.కే. నారాయణ్ రచించిన స్వామి అతని మిత్రులు ఆధారంగా తీసారు.[1][2] దీనికి గాను అతనికి ఆరు జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. తర్వాత అగ్నిపథ్ (1990) సినిమాలో విజయ్ గా అమితాబ్ బచ్చన్ తో నటించాడు. తెలుగు పరిశ్రమలో స్వాతి కిరణం (1992) లో ముమ్మూట్టితో దీటుగా నటించి మెప్పించాడు.

ఇతడు 19 సంవత్సరాల వయసులో నటనకు స్వస్తి పలికి చదువు మీద శ్రద్ధ చూపి ఎమ్.ఎ. (సోషియాలజీ), చలనచిత్రీకరణలో డిప్లొమా మరియు సి.ఎ. పూర్తిచేశాడు.[2], [3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మంజునాథ్ క్రీడాకారిణి స్వర్ణరేఖను వివాహమాడారు.[2] ఇతడు ప్రస్తుతం బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.[3]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]