Jump to content

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి

వికీపీడియా నుండి
(మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి నుండి దారిమార్పు చెందింది)
మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి
జననం1808
మరణం11 మే, 1873
వృత్తికవి, పండితుడు
తల్లిదండ్రులు
  • శరభరాజామాత్యుడు (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808 విభవ నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.

విద్య

[మార్చు]

ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. కవిత్వం వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

రచనలు

[మార్చు]
  • సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
  • కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
  • భీమలింగశతకము (1869)

రచనలకు గుర్తింపు

[మార్చు]

రచనల ఉదాహరణలు

[మార్చు]
  • భీమలింగశతకం నుండి:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
బాయల మోదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

మూలాలు

[మార్చు]