మగురి మోటాపుంగ్ బీల్ సరస్సు
Maguri Motapung Beel | |
---|---|
ప్రదేశం | దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం, మోటాపుంగ్ గ్రామం, తిన్‌సుకియా జిల్లా, అస్సాం, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 27°34′36.2″N 95°23′42.9″E / 27.576722°N 95.395250°E |
స్థానిక పేరు | మగురి మోటాపుంగ్ బీల్ సరస్సు (Assamese) |
మగురి మోటాపుంగ్ బీల్ సరస్సును మగురి బీల్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలో గల దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం, మోటాపుంగ్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చిత్తడి నేల కలిగిన సరస్సు. మగురి మోటాపుంగ్ బీల్ వన్యప్రాణులకు సహజ నివాసాన్ని, స్థానిక సమాజానికి జీవనోపాధిని అందిస్తుంది.[1][2]
పేరు - అర్థం
[మార్చు]మగురి అనగా అస్సామీ భాషలో మార్పు చేప అని అర్థం. మోటాపుంగ్ అనేది స్థానిక గ్రామం పేరును సూచిస్తుంది. బిల్ లేదా బీల్ అంటే అస్సామీ భాషలో సరస్సు అని అర్థం.[1]
భౌగోళికం
[మార్చు]మగురి మోటాపుంగ్ బీల్ తిన్‌సుకియా పట్టణం నుండి సుమారు 9 కి.మీ దూరంలో, దిబృఘర్ విమానాశ్రయం నుండి 50 కి.మీ. దూరంలో, గుబ్రన్ ఫెర్రీ ఘాట్ నుండి 3.8 కిలోమీటర్ల దూరంలో, దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం ప్రవేశ ద్వారం వద్ద ఉంది. మగూరి మోటాపుంగ్ బీల్ డిబ్రూ నదికి దక్షిణ ఒడ్డున ఉంది. ఇది డిబ్రూ నదిని ఒక చిన్న కెనాల్ ద్వారా కలిసి, చివరికి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది.[3] [4]
పక్షుల నివాసం
[మార్చు]మగురి మోటాపుంగ్ బీల్ అనేక రకాల పక్షులకు సహజ నివాస స్థలంగా ఉంది. ఈ సరస్సు 110 కి పైగా నివాస, వలస పక్షి జాతులకు ముఖ్యమైన నివాసంగా ఉంది, ఈ పక్షులలో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ జాబితాలో ఎనిమిది పక్షులు ఉన్నాయి, వాటిలో స్వాంప్ గ్రాస్ బాబ్లర్, ఫెర్రుగినస్ డక్, వైట్ వింగ్డ్ వుడ్ డక్, ఫాల్కేటెడ్ డక్ పక్షులు ముఖ్యమైనవి.[1]
2021 లో 118 తర్వాత ఒక అరుదైన మాండరిన్ డక్ చిత్తడి నేల కలిగిన ఈ మగురి మోటాపుంగ్ బీల్‌లో కనిపించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Near the Baghjan Blowout, Assam's Critical Wetland Habitat Is Burning". The Wire (India) (in ఇంగ్లీష్). Archived from the original on 8 అక్టోబరు 2020. Retrieved 7 November 2020.
- ↑ "Maguri Motapung: an asset lost to flames". Wetlands International (in ఇంగ్లీష్). Retrieved 7 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Maguri Beel". Tezpur University website (in ఇంగ్లీష్). Retrieved 7 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Avians attract tourists to beel". The Telegraph (Kolkata) (in ఇంగ్లీష్). Retrieved 7 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Explained: Why a rare duck has created a flutter in Upper Assam". Indian Express (in ఇంగ్లీష్). Retrieved 16 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)