మగువ మాంచాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మగువ మాంచాల బ్రహ్మనాయుడు కొడుకైన బాలచంద్రుడు యొక్క భార్య.[1]

జననం - వివాహం[మార్చు]

గండు కన్నమ, రేఖాంబ లకు మాంచాల జన్మించింది. ఆరేళ్ళ వయసులోనే ఏడేళ్ళ వయసున్న బాలచంద్రుడితో వివాహం జరిగింది.

ఇతర వివరాలు[మార్చు]

బాలచంద్రుడికి సబ్బాయి అనే వేశ్యతో సంబంధం ఉండేది. ఆ విషయం తెలిసినా కూడా మాంచాల భర్త అనురాగంకోసం ఎదురుచూస్తుండేది. పల్నాటి యుద్ధం (నాగమ్మ నాయకత్వంలో నలగామరాజు సైన్యనాకి, బ్రహ్మానాయుని ఆధ్వర్యంలో మలిదేవరాజు సైన్యానికి కార్యంపూడి వద్ద జరిగిన యుద్ధం) కు బయలుదేరుతున్న తన భర్తను ఆపడానికి ప్రయత్నించింది. చివరకు ఒప్పుకొని, యుద్ధానికి పంపించింది. ఆ యుద్ధంలో బాలచంద్రుడు మరణించాడు. భర్త మరణవార్త విన్న మాంచాల తాను వీరపత్నినయ్యానని సంతోషించింది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మగువ మాంచాల, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 5. ISBN 978-81-8351-2824.