మట్టి మెకోనెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మట్టి మెకోనెన్ (ఏప్రిల్ 16 1952 - జూన్ 26 2015) మొబైల్ కమ్యూనికేషన్స్ రంగంలో సాంకేతిక నిపుణుడు.[1][2] ఆయన నోకియా నెట్ వర్క్, టెలి ఫిన్‌లాండ్ వంటి సంస్థలలో పనిచేసారు.[3] మెకోనెన్ మొబైల్ నెట్‌వర్క్ ద్వారా ఎస్.ఎం.ఎస్ పంపే ఆలోచనను అభివృద్ధి చేసారు. టెక్స్ట్ మెసేజ్ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి ఎస్ఎంఎస్ పితామహుడిగా గుర్తింపుతెచ్చుకున్నారు.[4] ఎస్.ఎం.ఎస్. అభివృద్ధికి కీలక కృషి చేసినందుకుగానూ 2008 లో మెకానెన్ "ద ఎకనమిస్తు" ఇన్నోవేషన్ అవార్డును పొందారు.[5]

జీవిత విశేషాలు[మార్చు]

కొన్ని ఆధారాల ప్రకారం[1][6] మెకానెన్ సుయోముస్సాల్మి జన్మించారు. ఆయన 1976లో ఓలూ టెక్నికల్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పట్టభద్రుడైనాడు. ఆయన టెలికం, పోస్టల్ ఏజన్సీలో సిస్టం ఇంజనీరు,వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ అభివృద్ధి వంటి శాఖలలో పనిచేసారు (1976–1983). ఆయన PTL జ్య్ 1984 నుండి 1988 వరకు ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అదే కాలంలో జి.ఎస్.ఎం. టెక్నాలజీ అభివృద్ధి చేయు కార్యక్రమంలో నిమగ్నమైనారు. ఆయన 1989 వరకు మొబైల్ కమ్యూనికేషన్స్ యూనిట్ కు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సంస్థ ఆ తదుపరి టెలి ఫిన్‌లాండ్ గా పేరు మార్చుకుంది. ఆయన 1995-2000 వరకు మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూపుకు ఉపాధ్యక్షునిగా తన సేవలనందించారు. 2000లో ఆయన మొబైల్ ఇంటర్నెట్ ఆపరేటర్ యూనిట్ కు అధ్యక్షులు, బోర్డు మెంబరుగా ఉన్నారు. ఆ సంస్థ సొనేరాగా నామం మార్చుకుంది.

2000 నవంబరులో మెకోణెన్ నోకియా నెట్‌వర్క్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ లో విభాగాధిపతిగా చేరారు.[7] ఆ తరువాత ఆయన ఫిబ్రవరి 1 2003 న పిన్నెట్ ఓయే సంస్థకు సి.యి.ఓగా చేరారు.[8] a position which he held until 31 October 2005.[9]

2006 ప్రారంభంలో ఆయన టియేతో-ఎక్ష్, పి.ఆర్ ఏజన్సీ ఎవియా సంస్థలకు బోర్డు మెంబరుగా తన సేవలనందించారు.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Telecommunications Forum". Retrieved 29 June 2015.
  2. ""Matti oli ihmisläheinen esimies"" (in Finnish). Ilkka. 28 June 2015. Archived from the original on 1 జూలై 2015. Retrieved 28 June 2015.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. "Hightech Forum". Archived from the original on 2007-09-30. Retrieved 2015-07-14.
  4. ఎస్ఎంఎస్ పితామహుడు మట్టి మెకోనెన్ కన్నుమూత
  5. "And the Winners Were..." The Economist. 4 December 2008. Retrieved 29 June 2015.
  6. "Hermia.fi, puhujat". Archived from the original on 2007-11-09. Retrieved 2015-07-14.
  7. "Tiedotteet". Nokia. Archived from the original on 28 ఆగస్టు 2002. Retrieved 29 June 2015.
  8. Maarit Seeling. "Tiukkaa taistoa telemarkkinoista" (PDF) (in Finnish). Draka NK Cables. p. s. 20–21. Retrieved 2007-11-14.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  9. "Tietoviikko". Archived from the original on 2007-09-27. Retrieved 2015-07-14.
  10. "Tekstiviestin isä polskii hallitushaina". Retrieved 29 June 2015.

ఇతర లింకులు[మార్చు]