మణిపూర్ క్రికెట్ జట్టు
మణిపూర్ క్రికెట్ జట్టు భారత దేశవాళీ పోటీలలో మణిపూర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు.[1] భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ లకు 2018–19 సీజన్ దేశీయ పోటీలలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో మణిపూర్ క్రికెట్ జట్టు కూడా ఒకటి అని 2018 జూలైలో, ప్రకటించింది.[2][3][4] 2018–19 సీజన్‌కు ముందు, శివ సుందర్ దాస్ జట్టుకు శిక్షకుడుగా నియమితులయ్యాడు.[5]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | లాంగ్లోన్యాంబ కెషంగ్బామ్ |
కోచ్ | శివ సుందర దాస్ |
యజమాని | మణిపూర్ క్రికెట్ జట్టు |
జట్టు సమాచారం | |
స్థాపితం | 2018 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
Vijay Hazare Trophy విజయాలు | 0 |
సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ Syed Mushtaq Ali Trophy విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | manipurcricket.com |
ఈ జట్టు 2018-19 విజయ్ హజారే ట్రోఫీకి మొదటి సీజన్‌లో 2018 సెప్టెంబరులో పుదుచ్చేరి క్రికెట్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో, 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.[6][7] మరుసటి రోజు, సిక్కిం జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్‌లో తమ మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది.[8][9] ఈ ట్రోఫీకి మొదటి సీజన్‌లో ఆడిన తమ 8 మ్యాచ్‌లలో రెండు గెలుపొందింది. ఐదు మ్యాచ్ లు ఓడి ఈ జట్టు 6 స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.[10] ఈ ట్రోఫీకి యశ్‌పాల్ సింగ్ 488 పరుగులతో అత్యధిక పరుగుల తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందితే, బిశ్వర్జిత్ సింగ్ తొమ్మిది ఔట్‌లతో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[11]
2018-19 రంజీ ట్రోఫీ 2018 నవంబరులో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో, మణిపూర్ జట్టు సిక్కిం జట్టు చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.[12][13] 2018–19 రంజీ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ మూడో రౌండ్‌లో మిజోరామ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.[14] ఈ జట్టు తమ 8 మ్యాచ్‌లలో మూడు గెలిచి టోర్నమెంట్ పట్టికలో 6 స్థానంలో ఉంది.[15]
2019 మార్చిలో, మణిపూర్ జట్టు 6 మ్యాచ్‌లలో ఒకటే గెలిచింది. 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్ A లో ఆరవ స్థానంలో నిలిచింది.[16] ఈ పోటీలలో మయాంక్ రాఘవ్ 301 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించాడు, యశ్‌పాల్ సింగ్ నాలుగు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[17]
2020 జనవరిలో, మేఘాలయతో జరిగిన 2019-20 రంజీ ట్రోఫీ ఆరవ రౌండ్ మ్యాచ్‌లో, మణిపూర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది.[18][19] 2020 ఫిబ్రవరి 12న, చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన 60,000వ మొదటి తరగతి క్రికెట్ మ్యాచ్.[20][21]
బృందం (స్క్వాడ్)
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | వివరాలు |
---|---|---|---|---|
బ్యాట్స్ మన్ | ||||
లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ | 1997 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
లెగ్ బ్రేక్ |
నాయకుడు |
కర్ణజిత్ యుమ్నం | 1997 డిసెంబరు 27 | కుడిచేతి వాటం | ||
జాన్సన్ న్గారియన్బామ్ | 1999 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | ||
బసీర్ రెహమాన్ | 1993 మార్చి 1 | ఎడమ చేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
|
రోనాల్డ్ లాంగ్జామ్ | 1997 ఆగస్టు 10 | కుడిచేతి వాటం | ||
గునీరామ్ అమోమ్ | 1996 డిసెంబరు 5 | కుడిచేతి వాటం | ||
సనాటోంబరోయ్ లైఫాంగ్బామ్ | 1997 డిసెంబరు 29 | కుడిచేతి వాటం | ||
ఆల్ రౌండర్లు | ||||
ప్రియోజిత్ కంగాబం | 1994 నవంబరు 24 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
|
బికాష్ బీరెన్ | 1992 నవంబరు 17 | కుడిచేతి వాటం | ఎడమ చేతి మీడియం | |
నితేష్ సెడై | 1998 ఫిబ్రవరి 8 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
ఆఫ్ బ్రేక్ |
|
సుల్తాన్ కరీం | 1994 నవంబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
|
బిదాష్ చింగఖం | 2001 జనవరి 21 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
|
వికెట్ కీపర్లు | ||||
ప్రఫుల్లోమణి పుఖ్రంభం | 1994 మార్చి 1 | కుడిచేతి వాటం | ||
అల్ బాషిద్ ముహమ్మద్ | 1998 ఏప్రిల్ 27 | కుడిచేతి వాటం | ||
అహ్మద్ షా | 1995 ఫిబ్రవరి 3 | కుడిచేతి వాటం | ||
నరిసింగ్ క్షేత్రమయం | 1992 మార్చి 3 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
కిషన్ సింఘా | 1996 డిసెంబరు 23 | కుడిచేతి వాటం | ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ | |
అజయ్ లామాబామ్ | 1999 ఫిబ్రవరి 8 | ఎడమ చేతి వాటం | ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ | |
పేస్ బౌలర్లు | ||||
బిశ్వర్జిత్ కొంతౌజం | 1996 ఫిబ్రవరి 3 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
ఉప నాయకుడు |
రెక్స్ రాజ్ కుమార్ | 2000 ఆగస్టు 30 | ఎడమ చేతి వాటం | ఎడమ చేతి
మీడియం/ఫాస్ట్ |
|
జోటిన్ ఫీరోయిజం | 2006 మార్చి 15 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం |
|
కిషన్ తోక్చోమ్ | 1990 జనవరి 1 | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం-
మీడియం/ఫాస్ట్ |
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Manipur to play in major domestic cricket tournaments". E Pao. Retrieved 23 July 2018.
- ↑ "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
- ↑ "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 18 July 2018.
- ↑ "BCCI to host over 2000 matches in the upcoming 2018–19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
- ↑ "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.
- ↑ "Vijay Hazare Trophy: Bihar make winning return to domestic cricket". Times of India. Retrieved 19 September 2018.
- ↑ "Plate, Vijay Hazare Trophy at Vadodara, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
- ↑ "Vijay Hazare Trophy 2018–19, Plate Group wrap: Wins for Meghalaya, Manipur and Bihar". Cricket Country. Retrieved 20 September 2018.
- ↑ "Plate Group, Vijay Hazare Trophy at Vadodara, Sep 20 2018". ESPN Cricinfo. Retrieved 20 September 2018.
- ↑ "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Vijay Hazare Trophy, 2018/19 – Manipur: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Ranji Trophy Takeaways: Unadkat Picks Seven; Mumbai in Command Against Railways". Network18 Media and Investments Ltd. Retrieved 3 November 2018.
- ↑ "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
- ↑ "Ranji Trophy Takeaways: Kerala, Manipur Register Historic Wins; Milind Kumar Continues to Pile on Runs". Network18 Media and Investments Ltd. Retrieved 22 November 2018.
- ↑ "Ranji Trophy Table – 2018–19". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
- ↑ "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
- ↑ "Syed Mushtaq Ali Trophy, 2018/19 – Manipur: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
- ↑ "Ranji Trophy: Manipur folded for 27 as Meghalaya secure innings win". Times of India. Retrieved 21 January 2020.
- ↑ "Ranji Trophy: Manipur folds for 27 as Meghalaya secures innings win". Sportstar. Retrieved 21 January 2020.
- ↑ "Are R Ashwin's 362 wickets the most after 70 Tests?". ESPN Cricinfo. Retrieved 18 February 2020.
- ↑ "60,000 not out: Landmark first-class match set for Ranji Trophy". The Cricketer. Retrieved 18 February 2020.