Jump to content

మిజోరం క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
మిజోరం క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్తరువార్ కొహ్లి
కోచ్మొహమ్మద్ సైఫ్
యజమానిక్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం
జట్టు సమాచారం
స్థాపితం2018
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0

మిజోరం క్రికెట్ జట్టు భారత దేశీయ పోటీలలో మిజోరాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. 2018 జూలైలో , భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో సహా 2018–19 సీజన్ కోసం దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో ఒకటిగా ఈ జట్టును ప్రకటించింది. [1] [2] [3] అయితే, రంజీ ట్రోఫీలో జట్టును చేర్చే నిర్ణయాన్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నిస్తూ, పోటీలో జట్టు పాల్గొనడానికి అర్హత ప్రమాణాలు ఉండాలని పేర్కొంది. [4]

2018 సెప్టెంబరులో వారు 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయారు. [5] [6] విజయ్ హజారే ట్రోఫీలో వారి మొదటి సీజన్‌లో, వారు తమ ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఆరు ఓటములతో ప్లేట్ గ్రూప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. [7] తరువార్ కోహ్లి 373 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది వికెట్లతో జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [8]

2018 నవంబరులో 2018-19 రంజీ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌లో, వారు నాగాలాండ్‌తో ఇన్నింగ్స్ 333 పరుగుల తేడాతో ఓడిపోయారు. [9] [10] రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జట్టుకు ఇది అతిపెద్ద ఓటమి. [11] 2018–19 టోర్నమెంటులో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఒక్క గెలుపూ లేకుండా, పట్టికలో చివరి, తొమ్మిదవ స్థానంలో ముగించారు. [12]

2019 మార్చిలో, మిజోరం 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ D లో ఏడు మ్యాచ్‌లలో ఒక్కదానిలో కూడా గెలుపొందకుండా చివరి స్థానంలో నిలిచింది. [13] తరువార్ కోహ్లి 222 పరుగులతో టోర్నమెంట్‌లో జట్టు తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సినాన్ ఖదీర్ ఏడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[14]

స్క్వాడ్

[మార్చు]
పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
తరువార్ కోహ్లీ (1988-12-17) 1988 డిసెంబరు 17 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం Captain
జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమా (2000-09-26) 2000 సెప్టెంబరు 26 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికాష్ కుమార్ (1996-12-01) 1996 డిసెంబరు 1 (వయసు 27) కుడిచేతి వాటం
జోతంజువాలా (1999-12-05) 1999 డిసెంబరు 5 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
లాల్హ్రుఐజెలా (1996-12-30) 1996 డిసెంబరు 30 (వయసు 27) కుడిచేతి వాటం
జెహు ఆండర్సన్ (1999-11-12) 1999 నవంబరు 12 (వయసు 25) కుడిచేతి వాటం
వనలల్హ్రుఅలుంగ (1999-03-14) 1999 మార్చి 14 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ఎఫ్ లాల్‌మౌంజువాలా (1998-08-20) 1998 ఆగస్టు 20 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
లాల్హ్మంగైహ (1983-11-17) 1983 నవంబరు 17 (వయసు 41) ఎడమచేతి వాటం
ఆల్ రౌండర్లు
పర్వేజ్ అహ్మద్ (1996-01-01) 1996 జనవరి 1 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సుమీత్ లామా (1996-02-26) 1996 ఫిబ్రవరి 26 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
వికెట్ కీపర్లు
శ్రీవత్స గోస్వామి (1989-05-18) 1989 మే 18 (వయసు 35) ఎడమచేతి వాటం
స్పిన్ బౌలర్లు
అవినాష్ యాదవ్ (1986-10-02) 1986 అక్టోబరు 2 (వయసు 38) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
బాబీ జోతన్సంగా (1986-08-25) 1986 ఆగస్టు 25 (వయసు 38) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
రిన్సాంగ్జెలా హ్మమ్టే (2002-06-07) 2002 జూన్ 7 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
రోసియామ్లియానా రాల్టే (1987-12-21) 1987 డిసెంబరు 21 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
పేస్ బౌలర్లు
రెమ్రుతడిక రాల్తే (1998-08-06) 1998 ఆగస్టు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
నవీన్ గురుంగ్ (2002-03-05) 2002 మార్చి 5 (వయసు 22) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం
జి లాల్బియాక్వేలా (1988-01-28) 1988 జనవరి 28 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
లాల్హ్రూయ్ రాల్టే (1992-03-10) 1992 మార్చి 10 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
లాలరించానా (1996-12-29) 1996 డిసెంబరు 29 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

2023 జనవరి 17 నాటికి నవీకరించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
  2. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 18 July 2018.
  3. "BCCI to host over 2000 matches in the upcoming 2018–19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
  4. "Telangana Cricket Association questions BCCI over inclusion of teams from North East in Ranji Trophy". First Post. Retrieved 10 August 2018.
  5. "Vijay Hazare Trophy: Bihar make winning return to domestic cricket". Times of India. Retrieved 19 September 2018.
  6. "Plate, Vijay Hazare Trophy at Nadiad, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
  7. "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  8. "Vijay Hazare Trophy, 2018/19 – Mizoram: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  9. "Ranji Trophy Takeaways: Unadkat Picks Seven; Mumbai in Command Against Railways". Network18 Media and Investments Ltd. Retrieved 3 November 2018.
  10. "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
  11. "Ranji Trophy Digest: Mixed Bag For India Stars, New States Take Baby Steps". Network18 Media and Investments Ltd. Retrieved 5 November 2018.
  12. "Ranji Trophy Table – 2018–19". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
  13. "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  14. "Syed Mushtaq Ali Trophy, 2018/19 – Mizoram: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.