మణిపూసలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆధునిక తెలుగు సాహిత్యంలో 26-4-2018 న వడిచర్ల సత్యం ప్రవేశపెట్టిన కొత్త కవితా రూపం మణిపూసలు[1][2]
మణిపూసల నియమాలు
[మార్చు]1)మణిపూసలో నాలుగు పాదాలుంటాయి.
2)1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి.అనగా1 పాదంలో ఎన్ని మాత్రలు వస్తే 2,4 పాదాల్లో కూడా అన్నే మాత్రలు రావాలి.
3)3వ పాదానికి అంత్యానుప్రాస లేకుండా 10 నుండి 12 వరకు ఎన్నిమాత్రలైనా ఉండవచ్చును.
4)3,4 పాదాల్లో కవితా మెరుపు ఉండాలి.[లఘువు(I)ను ఒక మాత్రగా,గురువు(U)ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు]
లక్షణాలు
[మార్చు]సారల్యము,క్లుప్తత, మాత్రల కొలత,అంత్య ప్రాసలాకర్షన,కవితా మెరుపు,సూటిదనము,పరిమిత పదాల కూర్పు,శిల్ప సౌందర్యము,గానయోగ్యమైన లయ,ముక్తక స్వభావము,తక్షణ భావస్పురణ, లఘురూపము,అనేవి మణిపూసల జీవలక్షణాలు.
ఉదాహరణలు
[మార్చు]1.
ప్రేమను పంచని సతి
U I I U I I I I =10
బాధ్యత మొయ్యని పతి
U I I U I I I I =10
ఉన్న లాభ మేమిటయ్య
U I U I U I U I = 12
ఇడుములు బాపని మతి
I I I I U I I I I = 10
2.
మంచి తనం పంచుదాం
U I I U U I U = 11
మలిన గుణం తుంచుదాం
I I I I U U I U = 11
మనిషికొక్క మొక్కనాటి
I I I U I U I U I = 12
మరువకుండ పెంచుదాం
I I I U I U I U = 11
3.
మణిపూసల కవులకంత
I I U I I I I I U I = 12
చదువుచున్న జనులకంత
I I I U I I I I U I = 12
వందనాలు వందనాలు
U I U I U I U I = 12
ప్రోత్సహించు ఘనులకంత
U I U i i i i U I = 12
మణిపూసలు సాధించిన గుర్తింపు
[మార్చు]50 రోజుల్లో 100 మందికి పైగా కవులు మణిపూసలను రాయడం వలన వండర్ బుక్ ఆఫ్ రికార్ద్స్ అవార్డు
తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ద్స్
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రక్రియ
మణిపూసల పై ప్రముఖుల అభిప్రాయాలు
[మార్చు]వర్తమాన కవులకు రాబోవు కవులకు మణిపూసలు ఒక చక్కని వేదికగా మారడం హర్షించదగ్గ శుభపరిణామం. సాంప్రదాయిక పునాదులపై రూపుదిద్దుకున్న ఈ అపూర్వ ప్రక్రియ నవతరం కవులకు ఒక వరం లాంటిది.మాత్రా నియమాలు అంత్యానుప్రాసలు, కవితా మెరుపులు వంటి లక్షణాలతో సృష్టించబడిన మణిపూసలు సాహిత్యలోకంలో అడుగుపెట్టడం కవితా ప్రక్రియకు లాభదాయకమని ప్రసిద్ద కవి దొరవేటిచెన్నయ్య అభిప్రాయం.
”మణిపూసలు తెలుగు సాహిత్యానికి వెన్నుపూసలు” అని శతావధాని మలుగ అంజయ్య చమత్కరించారు.
”కొత్తగా కవిత్వం రాస్తున్న కవులనే కాకుండా, పరిష్ఠులను కూడా మణిపూసలు ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు” అమ్మంగి వేణుగొపాల్
”తక్కువ మాత్రల్లో కవిత చెప్పడమే మణిపుసలకున్న ప్రత్యేకత” ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
”పద్యం రాయలేని వారికి మణిపూసలు ప్రక్రియ పరమాన్నం వంటిది” శ్రీనాటి శ్రీనాద్
”పద్యానికి తమ్ముడు వచన కవితకు అన్నవంటిది మనిపూసలు” ఏనుగు నరసింహా రెడ్డి
”మణిపూసలు పెద్దల్నే కాకుండా,చిన్న పిల్లల్ని ఆకర్షించడం విశేషం” పత్తిపాక మోహన్
మణిపూసల అనువాదం
[మార్చు]వడిచర్ల సత్యం మణిపూసలను కె.పాండురంగ విఠల్ హిందిలోకి,డి.హనుమంతరావు ఆంగ్లంలోకి,సయ్యద్ యూసుఫ్‌ఉర్దూలోకి,వి.జలంధర్ మరాఠీలోకి అనువదించారు.
మూలాలు
[మార్చు]- ↑ "సాహితీ ప్రపంచంలో మణిపూసలు". చెలిమె, నమస్తే తెలంగాణ. 2018-11-26. Retrieved 2022-03-08.
- ↑ "సాహితీ క్షేత్రంలో మణిపూసలు". నినాదం. 2021-04-26. Retrieved 2022-03-08.