మణిరామ్ దత్తా బారుహ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణిరామ్ దత్తా బారుహ్
মণিৰাম দেৱান
జననం
మణిరామ్ దత్తా బారుహ్

(1806-04-17)1806 ఏప్రిల్ 17
ఛారింగ్, సిబ్‌సాగర్
మరణం1858 ఫిబ్రవరి 26(1858-02-26) (వయసు 51)
జోర్హాట్ సెంట్రల్ జైలు
మరణ కారణంఉరిశిక్ష
ఇతర పేర్లుమణిరామ్ దేవాన్, కలితా రాజా
వృత్తిదేవాన్, తేయాకు సాగు
అస్సాం టీ కంపెనీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
1857 తిరుగుబాటులో పాల్గొనడం
గుర్తించదగిన సేవలు
1838లో బురంజీ బిబేకరత్న

మణిరామ్ దత్తా బారుహ్ (17 ఏప్రిల్ 1806 - 26 ఫిబ్రవరి 1858) మణిరామ్ దేవాన్ గా ప్రసిద్ధుడు. అస్సామ్ లో ప్రభువర్గానికి చెందిన కలితా కులంలో ప్రసిద్ధుడు. ఆందుకని అతన్ని కలితా రాజా అనికూడా పిలుస్తారు. అస్సాంలో తేయాకు తోటలకు బీజం వేసిన మొదటి వ్యక్తి. మొదట అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నమ్మకమైన వ్యక్తి. తరువాత 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారినందుకు అతన్ని ఉరితీశారు. అతను అస్సాం ప్రజలలో కలిత రాజా గా గుర్తింపు ఉన్నా నిజానికి అతను కాయస్థ దువారా కుటుంబానికి చెందినవాడు.[1]

జీవిత చరిత్ర[మార్చు]

మణిరామ్ దత్తా బారుహ్ 16వ శతాబ్దం ప్రారంభంలో కన్నౌజ్ నుండి అస్సాంకు వలస వచ్చిన కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి తరఫు పూర్వీకులు అహోం కోర్టులో ఉన్నత పదవులు నిర్వహించారు. మోమోరియా తిరుగుబాటు (1769-1806) తర్వాత అహోం పాలన బాగా బలహీనపడింది. అస్సాంపై బర్మీస్ దండయాత్రల సమయంలో (1817-1826), మణిరామ్ దత్తా బారుహ్ కుటుంబం బెంగాల్‌లో ఆశ్రయం పొందింది, ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉంది. మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం ప్రారంభ రోజులలో (1824-1826) బ్రిటిష్ రక్షణలో కుటుంబం అస్సాంకు తిరిగి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ బర్మీయులను ఓడించి, యాండబో ఒప్పందం (1826)[2] ద్వారా అస్సాంపై నియంత్రణ సాధించింది.

బ్రిటిష్ అసోసియేట్[మార్చు]

తన కెరీర్ ప్రారంభంలో మణిరామ్ దత్తా బారుహ్ ఈశాన్య భారతదేశంలో గవర్నర్ జనరల్ ఏజెంట్ అయిన డేవిడ్ స్కాట్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు నమ్మకమైన సహచరుడు.  1828లో, 22 ఏళ్ల మణిరామ్ దత్తా బారుహ్ స్కాట్ డిప్యూటీ కెప్టెన్ జాన్ బ్రయాన్ న్యూఫ్‌విల్లే ఆధ్వర్యంలో రంగ్‌పూర్‌కు తహసీల్దార్‌గా, షెరిస్టాదార్‌గా నియమితులయ్యారు.[3][4]

ఆ తరువాత 1833-1838 మధ్య సమయంలో అస్సాం నామమాత్రపు పాలకుడు పురందర్ సింఘాచే మణిరామ్ దత్తా బారుహ్ ను బోరభందర్ ప్రధానమంత్రి గా చేశారు. అతను పురందర్ సింఘా కుమారుడు కమలేశ్వర్ సింఘా, మనవడు కందర్పేశ్వర్ సింఘాకు సహచరుడిగా కొనసాగాడు.[5] మణిరామ్ దత్తా బారుహ్.. పురందర్ సింఘాకు నమ్మకమైన విశ్వాసపాత్రుడు అయ్యాడు. రాజును బ్రిటీష్ ప్రభుత్వం తొలగించినప్పుడు షెరిస్టాదార్, తహసీల్దార్ పదవులకు అతను రాజీనామా చేశారు.

వారసత్వం[మార్చు]

మణిరామ్ దత్తా బారుహ్ మరణం తర్వాత టీ ఎస్టేట్‌లను జార్జ్ విలియమ్సన్‌కు వేలంలో విక్రయించారు.[6] మణిరామ్ దేవనార్ గీత్ అని పిలువబడే అనేక జానపద పాటలు అతని జ్ఞాపకార్థం స్వరపరచబడ్డాయి.[7] గౌహతిలోని మణిరామ్ దేవాన్ ట్రేడ్ సెంటర్, దిబ్రూఘర్ విశ్వవిద్యాలయంలోని బాయ్స్ హాస్టల్‌కు అతని పేరు పెట్టారు.[8][9]

మూలాలు[మార్చు]

  1. Sharma, Jayeeta (2011). Empire's Garden: Assam and the Making of India (in ఇంగ్లీష్). Duke University Press. p. 46. ISBN 978-0822350491. Retrieved 1 May 2016.
  2. Anjali Sarma (1990). Among the Luminaries in Assam: A Study of Assamese Biography. Mittal Publications. p. 190. ISBN 978-81-7099-207-3. Retrieved 22 April 2012.
  3. Anjali Sarma (1990). Among the Luminaries in Assam: A Study of Assamese Biography. Mittal Publications. p. 190. ISBN 978-81-7099-207-3. Retrieved 22 April 2012.
  4. Bijay Bhushan Hazarika (1987). Political life in Assam during the nineteenth century. Gian Pub. House. pp. 351–360. ISBN 978-81-212-0069-1.
  5. HK Goswami (2009-02-26). "Martyrdom of Maniram Dewan". The Assam Tribune. Archived from the original on 2012-07-19. Retrieved 2012-04-21.
  6. Anil Kumar Sharma (2007). Quit India Movement In Assam. Mittal Publications. pp. 9–10. ISBN 978-81-8324-242-4. Retrieved 21 April 2012.
  7. C. Vijayasree; Sāhitya Akādemī (1 January 2004). Writing the West, 1750-1947: Representations from Indian Languages. Sahitya Akademi. p. 20. ISBN 978-81-260-1944-1. Retrieved 21 April 2012.
  8. "Maniram Dewan Boys' Hostel". Dibrugarh University. Retrieved 2012-02-21.
  9. Tea will be declared a national drink, says Montek