Jump to content

మణిసిద్ధుని కథ

వికీపీడియా నుండి

కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. ఇది వచనములో 12 భాగాలుగా వ్రాయబడింది. మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమౌతూ మార్గమద్యంలో కాశీయాత్రలో చేరుకునే ప్రతి మజిలీలోనూ చెప్పుకున్న కథలలో ఇది మొదటిది. ఆ గొలుసుకట్టు కథలే కాశీమజిలీ కథలుగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది. పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథలు వంటి బాలసాహిత్యానికి ఇవి స్పూర్తిదాయకంగా సహకరించాయి.

కథాప్రారంభం

[మార్చు]

కథ మణిసిద్ధుని గురించి ఆయన పుట్టుక గురించి తరువాత జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. తల్లి తండ్రులకు ఏకైక వరపుత్రుడుగా జన్మించి గుణనిధిగా విద్యాబుద్ధులు గడించిన తరువాత తాత్వికతయందు ఆసక్తుడైన తన తండ్రికి గుణనిధి పలు కారణములు ఉదహరిస్తూ వివాహానికి విముఖుత తెలియజేస్తాడు. కుమారుడు వివాహానికి సమ్మతించక పోవడంతో నిరాశకు గురైన తల్లి,తండ్రి కుమారుని మనసు మార్చలేని అసక్తతతో చివరకు కాలధర్మం చెందుతారు. తరువాత గుణనిధి తాను బంధవుముక్తుడైనట్లు భావించి ఒక సిద్ధుని ఉపదేశంతో కాశీకి పోవాలని చేసిన ప్రయత్నంతో పలువురు మిత్రులను సంప్రదించిన తరువాత చివరకు ఒక గోపాలుడిని తనకు యాత్రకు తోడుగా రావడానికి అంగీకరింపజేస్తాడు. ఇంతటితో గుణనిధిగా ఆరంభమై మణిసిద్ధునిగా మారిన కథానయకుని కధ ప్రారంభమౌతుంది.

కథావివరణ

[మార్చు]

యజ్ఞశర్మ అనే పండితుడికి లేకలేక జన్మించిన కుమారుడికి గుణనిధి అని పేరుపెట్టి పెంచుకున్నాడు. బ్రాహ్మణ ధర్మంగా యజ్ఞశర్మ గుణనిధికి ఉపనయన కర్మానంతరం విద్యాబుద్ధులు నేర్పించాడు. విద్యాభ్యాసం తరువాత ఆయన కుమారుడిని పిలిచి వివాహం చేకొమ్మని అడిగాడు. గుణనిధి తండ్రిమాటను వ్యతిరేకిస్తూ వివాహం వద్దని తెలియజేసాడు. తత్వశాస్త్రంలో ఆసక్తి కలిగిన గుణనిధి తండ్రితో చేసిన వివాదంలో ఉపనయనం గురించి వివాదించబడింది. విద్యాభ్యాసానికి ముందు జరిగే ఉపనయనంలో వటువుచేత ధరింపజేయబడే జంధ్యంలో గుణత్రయానికి, యజ్ఞానగ్రంధికి చిహ్నానాలని తెలుపబడింది. వివాహసమయంలో ధరింపజేయబడే జంధ్యంలో గుహస్తధర్మబాధ్యలకు చిహ్నమని తలియజేయబడింది. అది విని గుణనిధి అది అనవసర భారమని అది తనకు వద్దని తండ్రికి తెలియజేస్తూ స్త్రీలపట్ల తీవ్రమైన వ్యతిరేకతని తెలియబరుస్తూ వివాహానికి నిరాకరించాడు. పలు విధముల ప్రయత్నించినప్పటికీ గుణనిధి మనసు మార్చలేని వంశభివృద్ధి జరగలేదని చింతిస్తూ కాలధర్మం చెందాడు. ఆయన భార్యకూడ ఆకాలంలో ఆచరించబడుతున్న సతీసహగమనాన్ని స్వీకరించి మరణించింది. తల్లి,తండ్రుల కాలధర్మం చెందిన తరువాత గుణనిధి తాను బంధవిముక్తుడైనట్లు భావించి సన్యాసజీవితం ఆచరించాలని నిశ్చయించుకుంటాడు.

గుణనిధి మణిసిద్ధుడుగా మారుట

[మార్చు]

తల్లితండ్రులు పరమపదించిన తరువాత గుణనిధి బంధవిముక్తుడైనందుకు ఆనందిస్తూ ఒకరోజు దైవదర్శనార్ధం ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒకసిద్ధుడిని చూసి ఆయన ప్రసంగిస్తున్న తీరుకు ఆకర్షితుడై సిద్ధుని తపోమహిమను తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చి రాత్రంతా సిద్ధుడి ప్రసంగం గుర్తుచేసుకుని ఆనందించి తరువాత పదిరోజులకాలం సిద్ధుడి ప్రసంగాలను శ్రద్ధాగా సంపూర్ణంగా వినసాగాడు.సిద్ధుడు ఆయన మంర్మలత్వానికి సంతసించి ఆయనను దగ్గరకు పిలిచి గుణనిధి వృత్తాతం తెలుపని కోరాడు. గుణనిధి తాను బ్రాహ్మణ కుమారుడినని తకు ప్రస్తుతం యవరులేరని తమవంటి సిద్ధులు, సన్యాసులే బంధువులని తనకు ప్రాపంచికసుఖములయందు రోతకలిగినదని కనుక కైవల్యమారం చూపమని కోరాడు.

సిద్ధుడు కైవల్యంకోరుతూ తనపాదములపడిన గుణనిధిని లేవనెత్తి కుమారా నీవు కారణజన్ముడవు పూర్వజన్మసుకృతం వలన నీకిప్పటికే మానసికంగా వైరాగ్యం సిద్ధించినది అయినప్పటికీ నీవు తగిన గురువును ఎంచుకుని దేహకృతంగా సన్యాసం సన్యాసం స్వీకరించాలి. తరువాత తగిన సహాయకులను ఎంచుకుని కాశీయాత్రకు సమాయత్తం చేసుకుని పరమహంసలను ఆశ్రయించి కైవల్యం సాధించవచ్చు అని బోధించాడు.

సిద్ధుడు చివరిగా తనౌత్తరీయంలోని ముడిని విడదీసి దానినుండి వెలుగులు విరజిమ్ముచున్న మణిని ఒకదానిని తీసి గుణనిధికిచ్చి ఇది మహిమాంవితం కలిగిన మణి దీనిని నీవు సాలిగ్రామాన్ని పూజించునట్లు అనుదినం పూజిచుంతూ ఉండలి అని ఆదేశించాడు. నీవీ మణిని ఫూజించి కనులుమూసుకుని ధ్యానించిన నీకు భూతభవిష్యత్వర్తమానాలు గోచరిస్తాయి. అని చెప్పి గుణనిధిని దీవించి ఆచోటువిడిచి వేరొక చూటుకు ప్రయాణించాడు. ఆమణిసిద్ధించిన కారణంగా గుణనిధి మణిసిద్ధుడు అయ్యాడు. తరువాత గురూపదేశాన్ని మంత్రోపదేశంగా భావించి దినం స్మరిచసాగాడు. తరువాత ఆయన గోవిందతీర్ధులు అనే యతీంద్రుని ఆశ్రయించి సన్యాసం స్వీకరించి మణిసిద్ధియతీంద్రుడిగా పిలువబడ్దాడు.

కధాంశవివరణ

[మార్చు]