మద్యపానం

వికీపీడియా నుండి
(మద్యనిషేధం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మద్యపానం అలవాటుగా మొదలయి చివరికి మద్యపాన వ్యసనంగా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.

  1. సరదాగా అప్పడప్పడు త్రాగడం.
  2. త్రాగడం అలవాటు మొదలు.
  3. దొంగతనంగా త్రాగడం.
  4. అపరాధ భావము.
  5. కష్టాలు చెప్పకోలేక పోవడము.
  6. త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం.
  7. స్వాధీనం తప్పి అతిగా త్రాగడం.
  8. గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం.
  9. చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము.
  10. చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము.
  11. ఉద్యోగము, సంపాదనలో కష్టాలు.
  12. అకారణముగా కోపము.
  13. ఆహారంపై అశ్రద్ధ.
  14. అనైతిక కార్యక్రమాలు.
  15. హానికలిగించు ఆలోచన ధోరణి.
  16. ఏ పని ప్రారంభించలేకపోవడము.
  17. అస్పష్టమైన అధ్యాత్మిక చింతన.
  18. సంపూర్ణ ఓటమి అంగీకారము.
  19. త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.

మితంగా తాగినా చేటే

[మార్చు]

పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని శాస్త్రజ్ఞులు తెలిపారు.మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముంది. మద్యంలోని మాల్ట్ సుగర్ వల్ల కొందరి శరీరంలో అధికంగా క్రొవ్వు చేరి అనారోగ్యంపాలు అవుతారు.

మద్యనిషేధం కోసం పిటీషన్

[మార్చు]

దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని, 1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు:

  • 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
  • రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.
  • మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.
  • వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.
  • మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.
  • సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి".

నిబంధనలు

[మార్చు]
  • పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపుగా దుకాణం ఏర్పాటు చేయకూడదు.
  • పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి. అలాగే దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది. 30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు.
  • దుకాణం ఏర్పాటు నిర్ధేశించిన స్థలం మేరకే ఉండాలి. దుకాణంతో పాటు ప్రత్యేక గదులు, బార్‌స్థాయి ఏర్పాట్లు చేయకూడదు. దుకాణం అమ్మకం స్థానం మాత్రమే. కొన్నచోటే తాగటానికి ఏర్పాట్లు చేయటం నిషిద్దం.
  • మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి.
  • విక్రయాలు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు.
  • బార్‌లు అయితే రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంది.

ఆల్కోపాప్స్‌

[మార్చు]

ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది. తియ్యగా పండ్ల రసం లా ఉంటుంది. త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది. దీన్ని 'రెడీ టు డ్రింక్‌' అని పిలుస్తారు. నారింజ, బెర్రీ... ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం ఆల్కహాలు ఉంటుంది. సాధారణ మద్యం కంటే దీని ధర, వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మద్యపానం&oldid=4339930" నుండి వెలికితీశారు