మధురవాణి (పాత్ర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మధురవాణి కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన పాత్ర. విస్తృతమైన ప్రాచుర్యం, క్లాసిక్ స్థాయి పొందిన ఈ పాత్ర నవలలోని కథాపాత్రగా తన పరిధిని దాటి స్వతంత్ర ప్రతిపత్తిని సాధించిందని విమర్శకులు పేర్కొన్నారు.[1]

నేపథ్యం, వ్యక్తిత్వం[మార్చు]

మధురవాణి పాత్ర కన్యాశుల్కం నాటకం ప్రకారం విజయనగరంలో 19వ శతాబ్దికి చెందిన వేశ్య, ఉన్నతమైన వ్యక్తిత్వం, కొంటెతనం, దయార్ద్ర హృదయం కలిగిన మహిళ. ఈ లక్షణాలతో పాటుగా మాటకారితనం, తెలివితేటలు కూడా ఆమె సొంతం.[2] ఐతే వీటన్నిటినీ ఎవరికైనా మేలు చేసేందుకు, తన జీవికను నిలబెట్టుకునేందుకు మాత్రమే వాడడం పాత్ర ఉదాత్తతను పెంచుంతుంది. అందం మంచితనం మాత్రమే కాకుండా ఎదుటివారిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ అవతలివారికి తగ్గట్టుగా ప్రవర్తించే లక్షణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి లక్షణాలకు మూలం తల్లి పెంపకం నుంచే లభిస్తుంది, ఆమె తల్లి మంచివారితో మంచిగానూ, చెడ్డవారితో చెడ్డగానూ ప్రవర్తించమని నేర్పినట్టు ఓ సంభాషణ చెప్తుంది.[3]

కన్యాశుల్కంలో[మార్చు]

నాటకం ప్రారంభంలోనే రామప్పంతులును వదిలివేసి గిరీశం పోషణలోకి వచ్చే ప్రయత్నం సాగుతూంటుంది. ఐతే కొద్దిలోనే గిరీశం మోసకారితనం గురించి తెలుసుకుంటుంది.

మూలాలు[మార్చు]

  1. నిడదవోలు, మాలతి. "కథపరిధి దాటి స్వయంప్రతిపత్తి సాధించుకున్న సజీవపాత్రలు". తెలుగు తూలిక. నిడదవోలు మాలతి. Retrieved 29 March 2016.
  2. నెమలికన్ను, మురళీ. "నాయికలు-మధురవాణి". నెమలికన్ను. మురళీ. Archived from the original on 17 ఏప్రిల్ 2016. Retrieved 29 March 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. వాడ్రేవు, వీరలక్ష్మీదేవి. "అప్పటి మధురవాణి – ఇప్పటి నళినీ జమీలా". భూమిక. Retrieved 29 March 2016.