మధుర్ మిట్టల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుర్ మిట్టల్
జననం (1991-02-20) 1991 ఫిబ్రవరి 20 (వయసు 33)
జాతీయతబారతీయుడు
పౌరసత్వంభారతదేశం
విద్యబ్యాచిలర్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్‌
వృత్తినటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్లమ్‌డాగ్ మిలియనీర్
గుర్తించదగిన సేవలు
స్లమ్‌డాగ్ మిలియనీర్,
మిలియన్ డాలర్ ఆర్మ్
పురస్కారాలుస్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు

మధుర్ మిట్టల్ (జననం 1991 ఫిబ్రవరి 20) భారతీయ నటుడు. ఆయన టీవీ సీరియల్ షక లక బూమ్ బూమ్‌లోని టిటో పాత్రకు, స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో సలీం మాలిక్‌గా తన నటనకు ప్రసిద్ధి చెందాడు. 2008 ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును స్లమ్‌డాగ్ మిలియనీర్ దక్కించుకుంది. ఇందులో నటనకుగాను మధుర్ మిట్టల్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్నాడు.

2023 అక్టోబరు 6న విడుదల కానున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందించబడిన తమిళ భాషా చిత్రం 800లో ఆయన ప్రధానపాత్ర పోషించాడు. ఆయన సరసన మహిమా నంబియార్ నటించగా ఈ చిత్రం తెలుగు, హిందీలోనూ విడుదలవుతోంది.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

భారతదేశంలోని ఆగ్రాలో 1991 ఫిబ్రవరి 20న మధుర్ మిట్టల్ జన్మించాడు.

1997లో, ఆయన టెలివిజన్‌లో ప్రసిద్ధ రియాలిటీ డ్యాన్స్ షో బూగీ వూగీని గెలుచుకున్నాడు. కొంతకాలం తర్వాత, అతని కుటుంబం ముంబైకి మారింది, అక్కడ తన పాఠశాల విద్యను ఏవీఎమ్ హై స్కూల్ లో కొనసాగించాడు. ఆ సమయంలోనూ ఆయన ఛారిటీ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా అవార్డు వేడుకల్లో స్టేజ్‌పై నటన, నృత్యం వగైరాలతో బిజీగా ఉండేవాడు. ఆయన వెయ్యికి పైగా స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చాడు.

కెరీర్

[మార్చు]

బాల నటుడిగా మధుర్ మిట్టల్ వన్ టూ కా ఫోర్, కహిన్ ప్యార్ నా హో జాయే, సే సలామ్ ఇండియా వంటి విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించాడు. అంతేకాకుండా, ఆయన షక లక బూమ్ బూమ్, కసౌతీ జిందగీ కి, జల్వా, చమత్కర్, పృథ్వీరాజ్ చౌహాన్, దస్తక్‌తో సహా పలు టీవీ షోలలో కూడా నటించాడు.[2]

స్లమ్‌డాగ్ మిలియనీర్‌ సినిమాలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. దర్శకుడు డానీ బాయిల్ రూపొందించిన గాడ్ ఫాదర్ సిరీస్‌లోను ఆయన నటించాడు.[3]

2008లో, ఆయన బ్లాక్ రీల్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. 2009లో, స్లమ్‌డాగ్ మిలియనీర్ మొత్తం తారాగణంతో పాటు 15వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌ పురస్కారాలలో చలనచిత్రంలో నటీనటులు అత్యుత్తమ పనితీరుకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే, ఆయన 66వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్,[4] 15వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యాడు.[5]

2012 ఫిబ్రవరి 23 నుండి ITV1లో ప్రసారమైన కిడ్నాప్ అండ్ రాన్సమ్ రెండవ సిరీస్‌లో ఆయన అన్వర్ రజ్దాన్ పాత్రను పోషించాడు.[6]

ఆయన డిస్నీ చిత్రం మిలియన్ డాలర్ ఆర్మ్‌లో దినేష్ పటేల్‌గా నటించాడు. మాత్ర్ (2017)లో విలన్‌గా అతని నటనకు మంచి సమీక్షలను అందుకున్నాడు. 2020లో, OTT ప్లాట్‌ఫారమ్ MX ప్లేయర్‌లో హై అనే వెబ్ సిరీస్‌ని ఆయన చేసాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (14 September 2023). "'800'లో క్రికెట్టే కాదు, అంతకు మించి - అక్టోబర్ తొలి వారంలో ముత్తయ్య బయోపిక్". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  2. "Madhur Mittal on Slumdog Millionaire and more - Part 1". Rediff.com NEWS". 2009-01-20. Retrieved 2009-03-15.
  3. Naomi Canton (13 January 2009). "Actor gets offers from Hollywood, Bollywood". Hindustan Times. Archived from the original on 27 April 2015. Retrieved 16 March 2009.
  4. "Madhur Mittal on Slumdog Millionaire and more - Part 5". Rediff.com NEWS". 2009-01-20. Retrieved 2009-03-17.
  5. Little big winners Archived 28 ఫిబ్రవరి 2009 at the Wayback Machine, India Today 20 February 2009. Retrieved 16 March 2009.
  6. "Kidnap and Ransom". TV Pixie. Retrieved 17 February 2012.[permanent dead link]
  7. "MX Player High Review". scroll.in. Retrieved 13 July 2021.