మధులిమాయె

వికీపీడియా నుండి
(మధు లిమయే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మధులిమాయె

మధు లిమాయే (1922-1995) భారతదేశానికి చెందిన సోషలిస్ట్ వ్యాసకర్త, సామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. అతబు పూర్తి పేరు మధుకర్ రామచంద్ర లిమాయే. ఇతను ముఖ్యంగా 1970 లలో సమాజంలో చురుకైన కార్యాచరణాలలో పాల్గొనేవాడు. [1] ఇతను రామ్ మనోహర్ లోహియా అనుచరుడు జార్జ్ ఫెర్నాండెజ్ తోపాటు వివిధ అంశాలపై పనిచేసేవాడు , అత్యవసర పరిస్థితి తర్వాత కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న జనతా ప్రభుత్వంలో ముఖ్య పాత్రలు పోషించాడు. జనతా పార్టీలో భాగమైన వారు ఇతర పార్టీలలో గాని, రాజకీయ సంస్థలతో గాని భాగస్వామ్యంలో ఉండరాదని, మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా సంకీర్ణ ప్రభుత్వం అధికారంనుండి దింపడంలో రాజనారాయణ్ కృష్ణ కాంత్ అనే సహచరులతో కలిసి ప్రణాళికలు రూపొందించి సఫలమయ్యారు. ద్వంద్వ సభ్యత్వంపై జరిగిన ఈ దాడి ప్రత్యేకంగా జనసంఘ్ సభ్యులుగా ఉన్న జనతా పార్టీ సభ్యులపై నిర్దేశించబడింది,  జన్ సంఘ్ సైద్ధాంతిక మాతృమూర్తి అయిన రైట్-వింగ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సభ్యులుగా కొనసాగింది. ఈ సమస్య 1979 లో జనతా ప్రభుత్వం పతనానికి, జనతా కూటమి నాశనానికి దారితీసింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

మధు లిమయే 1992 మే 1న మహారాష్ట్ర లోని పూణే పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు రామచంద్ర మహాదేవ్ లిమయే. పూణే లోని ఫెర్గుసన్ కళాశాల నుండి విద్యను పూర్తి చేసాడు. ఇతనికి ప్రొఫెసర్ చంపా లిమయేతో వివాహమైంది, వీరికి ఒక కుమారుడు. 1938 నుండి 1948 వరకు భారత జాతీయ కాంగ్రెసులో ఇతను భాగంగా ఉండేవాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఇతని చదువుకు అంతరాయం కలిగింది. 1940 నుండి 1945 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాల జైలు జీవితం కూడా గడిపాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కాంగ్రెస్ పార్టీలో 1938-1939 లలో సభ్యునిగా ఉన్నారు. తదుపరి రాంమనోహర్ లోహియా సోషలిష్ట్ పార్టీలో ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని 12 సంవత్సరం జైలు జీవితం అనుభవించారు.[3] . మధులిమాయే 1964-1979 తన లోక్ సభ పదవి కాలంలో ఉత్తమమైన వక్తగా ప్రజా సమస్యలు తెలుపడంలో చురుకైన [4] పార్లమెంటేరియేన్ సభ్యునిగా పేరు గడించారు.[5]. అత్యవసర పరిస్థితి సమయములో 1975 నుంచి 1977 వరకు జైలులో వున్నారు తదనంతరం జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలను సమైక్య పరిచే ప్రయత్నంలో తన దైన పాత్ర పోషించారు [6][7] మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వము 1979 సంవత్సరంలో కూలి పోవడానికి, జనతా పార్టీలో చీలిక రావటంలో ( జనసంఘ్- రాస్ట్రీ య స్వయం సేవక్ పార్టీ ద్వంద సభ్యత్వముల కారణములలో) మధులిమాయే పాత్ర వున్నదని పేర్కొంటారు[8]

మధు లిమాయే రాజకీయ సిద్ధాంతం, లౌకిక జాతీయవాదం, భారతదేశం యొక్క లౌకిక ఆధారాలపై ఆయన రాజీలేని వైఖరిని కలిగి ఉన్నారు, అతను రాజ్యాంగంలోని లౌకిక పునాదుల పరిరక్షణకు గట్టిగా నిలబడ్డాడు. మధు లిమాయే తన జీవితమంతా పౌర స్వేచ్ఛ కోసం పోరాడేవాడు. పౌరుల స్వేచ్ఛ కోసం దిగువ కోర్టుల నుండి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో తన కేసులను వాదించాడు, అందులో విజయసాధించారు . మధు లిమాయ్ విదేశీ విధానంలో అలీన దేశాల సూత్రములపై (నాన్-అలైన్‌మెంట్ ) ఆధారం వలసవాద వ్యతిరేకత, ప్రజలందరికీ స్వేచ్ఛ, నిరాయుధీకరణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రయోజనాల రక్షణ, ప్రపంచ శాంతి మున్నగు వాటిలో గట్టి నమ్మకం ఉండేది . రాజకీయ-ఆర్థిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వలసరాజ్యాల ప్రజల పోరాటం యొక్క పొడిగింపు అయినందున, ఉత్తర-దక్షిణ ఘర్షణ అని పిలవబడే విషయంలో భారతదేశం తమ విదేశాంగ విధానములో దృఢ వైఖరిని తీసుకోవాలి అని ఆయన పేర్కొనే వారు [9]

రచయితగా

[మార్చు]

మధులిమాయె రాజకీయ నాయకునిగా కాక రచయితగా ఆంగ్లము, హిందీ, మరాఠి భాషలలో పుస్తకములను రచించారు.

మరణం

[మార్చు]

మధులిమాయే 1995 జనవరి 8 న్యూఢిల్లీలో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. Qurban Ali. Short Political Biography of Madhu Limaye. academia.edu
  2. Lloyd I. Rudolph and Susanne H. Rudolph (1987) In Pursuit of Lakshmi: The Political Economy of the Indian State. University of Chicago Press. pp 457–459. ISBN 9788125015512
  3. "Goa Liberation Movement and Madhu Limaye by Champa Limaye | Waterstones". www.waterstones.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  4. Ali, Qurban. "Short Political Biography of SHRI MADHU LIMAYE" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  5. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2020-07-21.
  6. Ali, Qurban. "Short Political Biography of SHRI MADHU LIMAYE" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  7. Ankit, Rakesh (2016-08-19). "Janata Party (1974–77): Creation of an All-India Opposition". History and Sociology of South Asia (in అమెరికన్ ఇంగ్లీష్). 11 (1): 39–54. doi:10.1177/2230807516652987. ISSN 2230-8075.
  8. "Madhu Limaye in 1979: Why Janata Party parted with Jan Sangh over RSS". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  9. "Late Madhu Limaye". Janata Weekly (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-17.