Jump to content

మనీషా గుల్యాని

వికీపీడియా నుండి
మనీషా గుల్యాని
వ్యక్తిగత సమాచారం
జననంజైపూర్, రాజస్థాన్
మూలంభారతదేశం
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ నృత్యం
వృత్తిపెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్
వెబ్‌సైటుhttp://www.manishagulyani.in

మనీషా గుల్యాని (హిందీ: मनीषा गुलयानी) భారతదేశానికి చెందిన కథక్ నృత్యకారిణి.[1] ఆమె పండిట్ గిర్ధారి మహారాజ్ శిష్యురాలు. గురు ప్రేరణ శ్రీమాలి సమర్థ మార్గదర్శకత్వంలో ఆమె అధునాతన శిక్షణ తీసుకుంది. ఆవిడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ICCR) కథక్ కళాకారిణి. విదేశాల్లోని ICC కేంద్రాలకు ఉపాధ్యాయురాలు, ప్రదర్శనకారిణి.[2][3][4] ఆమె దేశవిదేశాలలో వివిధ ప్రముఖ వేదికలపై తన కళను ప్రదర్శించింది.[5][6]

బాల్యం

[మార్చు]

ఆమె దేశంలోని జైపూర్‌లో పుట్టి పెరిగింది. ఆమె ఏడేళ్ల వయసునుంచే జైపూర్ కథక్ కేంద్రంలో శిక్షణ ప్రారంభించింది.

కెరీర్

[మార్చు]

ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతంతో పాటు నృత్య రంగంలో పరిశోధనా కథనాలను సమర్పించింది. అమిటీ యూనివర్శిటీ జైపూర్ లో ప్రదర్శన కళల విభాగానికి అధ్యక్షత వహించింది. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె డెల్ఫిక్ కౌన్సిల్ ఆఫ్ రాజస్థాన్ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యురాలు. ఆమె ఏటా నిర్వహించబడే భారతీయ శాస్త్రీయ నృత్య ఉత్సవం తిరక్ ఉత్సవ్‌కు క్యూరేటర్‌గా వ్యవహరిస్తుంది.[7][8][9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె హిందీ ఫిక్షన్ రచయిత లోకేష్ గుల్యానిని వివాహం చేసుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Famous Kathak Dancers, Pandit Birju Maharaj, Sitara Devi, Shovana Narayan, Malabika Mitra, Kumudini Lakhiya, Manisha Gulyani, Kartik Ram - Kalyan das". Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 13 డిసెంబరు 2013.
  2. http://www.culturall.ch/Autumn%20Concert.htm
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 5 May 2015. Retrieved 14 December 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 24 September 2015. Retrieved 14 December 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "'Dance is My Language'".[permanent dead link]
  6. "Kathak Recital by Manisha Gulyani, Ravindra Manch Jaipur | TimesCity". Archived from the original on 1 జూన్ 2014. Retrieved 1 జూన్ 2014.
  7. "Silk Road Projects - Via della Seta". Archived from the original on 2013-12-14. Retrieved 2013-12-14.
  8. "Sguardi.info – VA CULTURE Villa Abbamer Associazione Culturale".
  9. "New Event Coming up ~ High Point University International Club". Archived from the original on 2013-12-14. Retrieved 2013-12-14.