Jump to content

మనీష్ గుప్తా

వికీపీడియా నుండి
మనీష్ గుప్తా
జననం1975, మే 12
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం

మనీష్ గుప్తా మహారాష్ట్రకు చెందిన సినిమా దర్శకుడు, రచయిత. వన్ ఫ్రైడే నైట్ (2023), 420 ఐపిసి (2021), రహస్య (2015), హాస్టల్ (2011), ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009), డర్నా జరూరీ హై (2006) వంటి 6 సినిమాలకు దర్శకత్వం వహించాడు. సర్కార్ (2005), సెక్షన్ 375 (2019) మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాడు.[1]

జననం

[మార్చు]

మనీష్ గుప్తా 1975, మే 12న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించాడు.

వృత్తిరంగం

[మార్చు]

స్క్రీన్ ప్లే రచయితగా తన కెరీర్‌ని ప్రారంభించిన మనీష్ అమితాబ్ బచ్చన్ నటించిన సర్కార్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. సర్కార్ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగాల్లో అనేక అవార్డులకు నామినేషట్ చేయబడ్డాడు.

2006లో వచ్చిన డర్నా జరూరీ హై సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో ఆరు విభిన్న కథలలో, ప్రతి కథకు ప్రత్యేక దర్శకుడు ఉన్నాడు. ఇందులోని ప్రధాన కథకు మనీష్ దర్శకత్వం వహించాడు.

1983లో బొంబాయిని కదిలించిన అప్రసిద్ధ స్టోన్‌మ్యాన్ హత్యల ఆధారంగా కేకే మీనన్, అర్బాజ్ ఖాన్ నటించిన ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009) సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆ తర్వాత, కాలేజీ హాస్టళ్లలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థుల మరణాల గురించి హాస్టల్ (2011), ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా విమర్శకుల ప్రశంసలు పొందిన రహస్య (2015), ఆర్థిక నేరం గురించిన కోర్టు గది డ్రామాతో 420 ఐపిసి, మహిళా సూపర్ స్టార్ రవీనా టాండన్ నటించిన వన్ ఫ్రైడే నైట్ (2023) సినిమాలు తీశాడు.

నకిలీ అత్యాచారం కేసుకు సంబంధించిన కోర్ట్ రూమ్ డ్రామాతో వచ్చిన సెక్షన్ 375 సినిమా స్క్రిప్ట్ కు 2020లో 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

సినిమాలు

[మార్చు]

దర్శకుడు

[మార్చు]
  • వన్ ఫ్రైడే నైట్ (2023)
  • 420 ఐపిసి (2021)
  • రహస్య (2015)
  • హాస్టల్ (2011)
  • ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009)
  • దర్నా జరూరీ హై (2006)

స్క్రీన్ ప్లే, డైలాగ్స్

[మార్చు]
  • సర్కార్ (2005)
  • సెక్షన్ 375 (2019)

మూలాలు

[మార్చు]
  1. "'It is not crime but realism that excites me': Manish Gupta". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-01-19.

ఇతర లంకెలు

[మార్చు]