మనీష్ జైస్వాల్
మనీష్ జైస్వాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
నియోజకవర్గం | హజారీబాగ్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1 డిసెంబర్ 2014 – 2024 | |||
నియోజకవర్గం | హజారీబాగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 3 ఆగస్టు 1965 | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | బ్రజ్ కిషోర్ జైస్వాల్, విద్యా | ||
జీవిత భాగస్వామి | నిషా జైస్వాల్ | ||
నివాసం | బిశేశ్వర్ దయాల్ జైస్వాల్ పాత్, అలంకార్ జ్యువెలర్స్ ఎదురుగా, వార్డ్ నం. 28 ఠాణా సదర్, హజారీబాగ్, జార్ఖండ్ |
మనీష్ జైస్వాల్ (జననం 3 ఆగస్టు 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మనీష్ జైస్వాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో హజారీబాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ప్రదీప్ ప్రసాద్‌పై 27,129 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో హజారీబాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర ప్రసాద్‌పై 51,812 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
మనీష్ జైస్వాల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ భాయ్ పటేల్‌పై 2,76,686 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (18 May 2024). "In a 1st, 2 OBC candidates lock horns in Hazaribagh" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ ETV Bharat News (4 June 2024). "Hazaribagh Lok Sabha Seat Result 2024: BJP's Manish Jaiswal Wins By 2.7 Lakh Votes" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hazaribagh". Retrieved 27 July 2024.
- ↑ India Today (4 June 2024). "Hazaribagh lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.