మనుభాయ్ పంచోలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనుభాయ్ పంచోలి
పుట్టిన తేదీ, స్థలం(1914-10-15)1914 అక్టోబరు 15
పంచషియా, మోర్బి జిల్లా, గుజరాత్
మరణం2001 ఆగస్టు 29(2001-08-29) (వయసు 86)
సనోసర, భావ్‌నగర్, గుజరాత్
కలం పేరుదర్శక్
వృత్తిరచయిత, విద్యావేత్త, రాజకీయవేత్త
భాషగుజరాతీ
పురస్కారాలు
  • రంజిత్రమ్ సువర్ణ చంద్రక్ (1964)
  • సాహిత్య అకాడమీ అవార్డు (1975)
  • పద్మ భూషన్ (1991)
జీవిత భాగస్వామి
విజయబెన్ పటేల్
(died 1995)

మనుభాయ్ పంచోలి (అక్టోబర్ 15, 1914 - ఆగస్టు 29, 2001) ఈయన గుజరాతీ భాషా నవలా రచయిత, విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఈయనకు 1991లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1914, అక్టోబర్ 15 న గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లాలోని పంచషియా గ్రామంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను తిత్వా లున్సార్ నుండి పూర్తి చేశాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి తన చదువు ను విడిచిపెట్టాడు. ఈయన సబర్మతి, నాసిక్, విసాపూర్ జైలులో శిక్షను అనుభవించాడు. ఈయన 1938 లో అంబాలాలోని గ్రామదక్షిణమూర్ట్‌లో ప్రొఫెసర్‌గా చేరాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడ్డాడు. అతను 1953 లో నానోభాయ్ భట్‌తో కలిసి లోక్‌భర్తి గ్రామీద్యాపిత్ ఇనిస్టిట్యూట్‌ను సనోసారాలో స్థాపించాడు. ఈయన 1967 నుండి 1971 వరకు గుజరాత్ శాసనసభ సభ్యుడిగా, 1970 లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశాడు. 1975 లో అత్యవసర సమయంలో అతన్ని అరెస్టు చేశారు. 1981 నుండి 1983 వరకు గుజరాతీ సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991 నుండి 1998 వరకు గుజరాత్ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.[1]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన గుజరాతీ సాహిత్య నవలా రచయితలలో ఒకరు. పాంచోలి రాసిన నవలలు పిదా ఛే జాని జాని (1952), సోక్రటీస్ (1974), బంధన్ అని ముక్తి (1938), బండీఘర్ (1939), దీప్నిర్వాన్ (1944), ప్రేమ్ అని పూజా (1939) ఇది, జెర్ తో పిదా ఛే జాని జాని, సోక్రటీస్ క్లాసిక్ గా పరిగణించబడుతుంది. ఈయన నాటకాలను సేకరించి ప్రచురించారు. అందులో పరిత్రాన్ (1967), అధరసో సత్తవన్ (1935), జాలియవాలా (1934), యాంటీమ్ అధ్యాయ (1983). మారి వచనకథ (1969), వాగిశ్వరి నా కర్నాఫూలో (1963), అపనో వర్సో అనై వైభవ్ (1953), త్రివేణి తీర్థం (1955), ధర్మచక్ర పరివర్తన్ (1956), రామాయణ నో మర్మ (1963), లోక్షాహి (1973), మహాభారత్ నో మర్మ (1978), సర్వోదయ అని శిక్షన్ (1974) లాంటి మరెన్నో నాటకాలు ఉన్నాయి.

పురస్కారాలు

[మార్చు]

ఈయనకు 1964 లో రంజిత్రామ్ సువర్ణ చంద్రక్, 1975 లో సోక్రటీస్ రచనపై సాహిత్య అకాడమీ పురస్కారం, 1987 లో భారతీయ జ్ఞానిత్ మూర్తీదేవి పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయన ప్రజా వ్యవహారాలలో చేసిన కృషికి గాను 1991 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. 1997 లో సరస్వతి సమ్మన్ పురస్కారం, 1996 లో జమ్నాలాల్ బజాజ్ పురస్కారాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన బర్డోలిలోని వరద్ గ్రామానికి చెందిన విజయబెన్ పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈమె ఏప్రిల్ 25, 1995 న మరణించింది.[2]

మరణం

[మార్చు]

ఈయన మూత్రపిండాల వ్యాధితో ఆగస్టు 29, 2001 న గుజరాత్ లోని భావ్ నగర్ లోని సనోసారాలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Manubhai Pancholi". Lokbharti. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 12 December 2019.
  2. "ગૂર્જર ગૌરવ – ટીના દોશી". ReadGujarati.com (in గుజరాతి). 13 December 2019. Archived from the original on 22 సెప్టెంబరు 2017. Retrieved 13 December 2019.