మన్సూర్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్సూర్ ఖాన్
జననం
వృత్తిదర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1988–2008
జీవిత భాగస్వామిటీనా ఖాన్
పిల్లలుజయాన్ (కుమార్తె)
పాబ్లో (కుమారుడు)
తల్లిదండ్రులు
బంధువులుతరిఖ్ ఖాన్ (కజిన్)
అమీర్ ఖాన్ (కజిన్)
ఇమ్రాన్ ఖాన్ (మేనల్లుడు)

మన్సూర్ హుస్సేన్ ఖాన్, హిందీ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతడు 1988లో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతోపాటు ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.[1] మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్‌లోని మ్యూజికల్ రొమాంటిక్ సినిమాలకు మార్గం వేసింది.[2][3]

జానే తు యా జానే నా సినిమాలో ఆమిర్ ఖాన్ తోపాటు, ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా నటించాడు.[2][3]

తొలి జీవితం[మార్చు]

మన్సూర్ ఖాన్ హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి బాలీవుడ్ చలనచిత్ర నిర్మాత నాసిర్ హుస్సేన్, తల్లి అయేషా హుస్సేన్. మన్సూర్ ఖాన్ ఐఐటి బొంబాయిలో చదివాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఖాన్, తమిళనాడులోని కూనూర్‌లో స్థిరపడి, వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఒక కుమార్తె జయాన్, కుమారుడు పాబ్లో.[2][3]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1988 ఖయామత్ సే ఖయామత్ తక్ దర్శకుడు మొదటి చిత్రం
1992 జో జీతా వోహి సికందర్ దర్శకుడు అకాడమీ అవార్డులు గెలుచుకున్న బ్రేకింగ్ అవే సినిమా అనధికారిక రీమేక్
1995 అకెలే హమ్ అకెలే తుమ్ దర్శకుడు అకాడమీ అవార్డులు గెలుచుకున్న క్రామెర్ వర్సెస్ క్రామెర్ సినిమా అనధికారిక రీమేక్
2000 జోష్ దర్శకుడు అకాడమీ అవార్డులు గెలుచుకున్న వెస్ట్ సైడ్ స్టోరీ సినిమా అనధికారిక రీమేక్
2008 జానే తు యా జానే నా నిర్మాత

అవార్డులు[మార్చు]

జాతీయ చిత్ర పురస్కారాలు
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారం (దర్శకుడు) - ఖయామత్ సే ఖయామత్ తక్ (1988)
ఫిలింఫేర్ అవార్డులు
  • ఉత్తమ దర్శకుడికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు - ఖయామత్ సే ఖయామత్ తక్ (1988)

మూలాలు[మార్చు]

  1. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 April 2021.
  2. 2.0 2.1 2.2 "Aamir Khan's nephew Pablo roped in as AD for 'Dangal'".
  3. 3.0 3.1 3.2 "Aamir Khan to launch his nephew Pablo with 'Dangal'". IndiaTV News. 2015-07-24. Retrieved 26 April 2021.

బయటి లింకులు[మార్చు]