మన లిపి పుట్టు పూర్వోత్తరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన లిపి పుట్టు పూర్వోత్తరాలు పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు, రచయిత, పరిశోధకుడు తిరుమల రామచంద్ర రచించారు.

రచన నేపథ్యం[మార్చు]

తిరుమల రామచంద్ర రచించిన మన లిపి పుట్టు పూర్వోత్తరాలు గ్రంథాన్ని మొదట 1957లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. అనంతరం 1990, 1993, 1999, 2012ల్లో పునర్ముద్రణ పొందింది. ఈ గ్రంథాన్ని తిరుమల రామచంద్ర ఆంధ్ర రాజవంశాల చరిత్ర గురించి విశేష కృషి సాగించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మకు, తెలుగుపత్రికలు/ప్రచురణ సంస్థలు విశాలాంధ్ర, ప్రజాశక్తిలకు అంకితమిచ్చారు.

ప్రధానాంశాలు[మార్చు]

ప్రపంచంలో తొలుత లిపి పుట్టడం, వివిధ భాషలలో లిపులు అభివృద్ధి జరగడం మొదలుకొని భారతీయ భాషల్లో లిపి అభివృద్ధి, తెలుగులో లిపి పుట్టుక, అభివృద్ధి వంటి అనేకాంశాలతో ఈ గ్రంథం రాశారు. తిరుమల రామచంద్ర వివిధ గ్రంథాలను మథించి అక్షరాస్యులైన తెలుగు వారంతా చదువుకునే వీలుండేలా తేలికైన భాషలో ఈ గ్రంథాన్ని రచించారు.

అధ్యాయాలు[మార్చు]

ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా, ఆయా భాగాలను వివిధ ప్రకరణాలుగా విభజించారు.

ప్రథమ భాగం

  • ప్రథమ ప్రకరణం
ప్రాణాలతో ఉన్న పుస్తకం
సజీవ గ్రంథాలయం కథ
  • ద్వితీయ ప్రకరణం
జ్ఞాపకానికి గుర్తులు
  • తృతీయ ప్రకరణం
మాట్లాడే వస్తువులు
కథచెప్పే కాయితం
  • చతుర్థ ప్రకరణం
బొమ్మల జాబు
దారితప్పిన దండు
  • పంచమ ప్రకరణం
ససేమిరా వ్రాతలు
  • షష్థ ప్రకరణం
ఈజిప్టు అక్షరాల యాత్ర

మూలాలు[మార్చు]