మరాఠా కందకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరాఠా కందకం
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరాఠా కందకం కలకత్తా నగరం సరిహద్దు మీద, ఓమిచంద్, గోబింద్‌రామ్‌ల భవంతుల చుట్టూ ఉండేది
రకముకందకం
స్థల సమాచారం
నియంత్రణఈస్టిండియా కంపెనీ (1757–1858)
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం1793
Battles/warsబెంగాలుపై మరాఠాల దండయాత్రలు

మరాఠా కందకం అనేది కలకత్తాలోని ఫోర్ట్ విలియం చుట్టూ ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ నిర్మించిన మూడు-మైళ్ల పొడవున్న లోతైన కందకం.[1] చుట్టుపక్కల గ్రామాలు, కోటలను మరాఠా బార్గీ కిరాయి సైనికుల నుండి రక్షించుకోడానికి దీన్ని నిర్మించారు.[2][3][4][5] ఈ కందకం పందొమ్మిదవ శతాబ్దపు కలకత్తా నగర బయటి సరిహద్దుకు గుర్తు.[6][2]

చరిత్ర

[మార్చు]

బెంగాల్‌పై మరాఠాల దండయాత్రల సమయంలో, నాగ్‌పూర్‌లోని మరాఠాలు నియమించిన బార్గీలు అనే కిరాయి సైనికులు గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారు. దీని వలన బెంగాల్‌కు భారీ ఆర్థిక నష్టాలు సంభవించాయి. 1742లో, బెంగాల్‌లోని ఈస్టిండియా కంపెనీ ప్రెసిడెంటు, కలకత్తా చుట్టూ కందకాన్ని తవ్వించమని నవాబ్ అలీవర్ది ఖాన్‌ను అభ్యర్థించాడు.[7] ఈ అభ్యర్థనను అలీవర్ది ఖాన్ వెంటనే ఆమోదించాడు. 1743 లో భారతీయులు, యూరోపియన్లు కలిసి విలియం ఫోర్ట్‌కు ఉత్తరాన 3-మైళ్ల పొడవైన కందకాన్ని త్రవ్వారు, దీనినే మరాఠా కందకం అని పిలుస్తారు. [1]

అయితే కందకం పూర్తి కాకముందే మరాఠా దండయాత్రల ముప్పు ఆగిపోయింది. దాంతో కందకం నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.[2] తదనంతరం, ఇది 19వ శతాబ్దంలో కలకత్తా వెలుపలి సరిహద్దుగా ఉండిపోయింది.[6] ఆ తరువాత, నగర రక్షణకు ఏమీ పనికిరాకుండా పోయింది. ఆ కందకం కారణంగా దళాలు, ఫిరంగిదళాల కదలికలకు బాగా ఇబ్బందులు కలిగేవి.[7]

1799లో కలకత్తా చుట్టూ వృత్తాకార రహదారి కోసం కందకాన్ని పాక్షికంగా నింపారు. హారిసన్ రోడ్డు నిర్మాణం కోసం 1893 లో పూర్తిగా పూడ్చేసారు.[2] నేడు, ఉత్తర కోల్‌కతాలో మరాఠా డిచ్ లేన్ పేరుతో ఉన్న రహదారి ఒకప్పుడు కందకం ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Banerjee, Sandeep (21 March 2019). Space, Utopia and Indian Decolonization: Literary Pre-Figurations of the Postcolony (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-0-429-68639-9. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.Banerjee, Sandeep (21 March 2019). Space, Utopia and Indian Decolonization: Literary Pre-Figurations of the Postcolony. Routledge. ISBN 978-0-429-68639-9. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "sp" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 2.3 Borden, Iain; Kerr, Joe; Pivaro, Alicia; Rendell, Jane (2002). The Unknown City: Contesting Architecture and Social Space (in ఇంగ్లీష్). MIT Press. ISBN 978-0-262-52335-6. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.Borden, Iain; Kerr, Joe; Pivaro, Alicia; Rendell, Jane (2002). The Unknown City: Contesting Architecture and Social Space. MIT Press. ISBN 978-0-262-52335-6. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "city" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 foundation, Temple of India (10 August 2018). Bengal – India's Rebellious Spirit (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-1-64324-746-5. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.foundation, Temple of India (10 August 2018). Bengal – India's Rebellious Spirit. Notion Press. ISBN 978-1-64324-746-5. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "bengal" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. Acworth, Harry Arbuthnot (1894). Ballads of Marathas (in ఇంగ్లీష్). Longmans, Green, and Company. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.
  5. Cooper, Randolf G. S. (2003). The Anglo-Maratha Campaigns and the Contest for India: The Struggle for Control of the South Asian Military Economy (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-0-521-82444-6. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.
  6. 6.0 6.1 Bajpai, Lopamudra Maitra (7 February 2019). Stories of the Colonial Architecture: Kolkata-Colombo (in ఇంగ్లీష్). Doshor Publication. ISBN 978-81-939544-0-9. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "story" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. 7.0 7.1 Reid, Stuart (30 May 2017). The Battle of Plassey, 1757: The Victory That Won an Empire (in ఇంగ్లీష్). Casemate Publishers. ISBN 978-1-4738-8528-8. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "plassey" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు