మరియపురం (గీసుకొండ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరియపురం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం గీసుగొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 760
పిన్ కోడ్ 506330
ఎస్.టి.డి కోడ్

మరియపురం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం 2021లో తొలివిడుత వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ జరిగిన గ్రామంగా రికార్డు సృష్టించడంతోపాటు[1][2] దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామంగా 2021లోనే కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీ అవార్డును కూడా అందుకుంది.[3] సోలార్‌ గ్రిడ్‌ల ఏర్పాటుతో ఊరిలోనే స్వంతంగా 6 కేవీ విద్యుత్తు తయారుచేసుకున్న గ్రామంగా 2022లో రికార్డు సృష్టించింది.

గ్రామం స్వరూపం, జనాభా

[మార్చు]

మరియపురం గ్రామం, జిల్లా కేంద్రమైన వరంగల్‌కు 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో 760 జనాభా ఉంది.

పరిపాలన

[మార్చు]

వరంగల్‌లో నిర్మలా బైండింగ్‌ వర్క్స్‌ నిర్వహిస్తున్న అల్లం బాలిరెడ్డి 2019 ఫిబ్రవరిలో ఈ గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ప్రత్యేకత

[మార్చు]
  • ఇక్కడి ప్రజలు అత్యంత క్రమశిక్షణతో, ఆరోగ్య సంరక్షణ పట్ల స్పృహ కలిగి ఉన్నారు. పారిశుధ్యం, హరితహారం, బహిరంగ మలవిసర్జన రహితం (ఓడిఎఫ్), వైకుంఠధామం వంటి వాటిలో శాతం విజయం సాధించి మోడల్ గ్రామంగా నిలిచింది.
  • ఈ గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డ పేరుమీద బ్యాంకులో 10 వేల రూపాయలు జమ చేస్తున్నారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత, ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం అప్పటికి రూ. లక్ష రూపాయలు ఆమె ఉన్నత చదువులకు లేదా పెళ్ళికి వినియోగించుకోవచ్చు.[4]
  • గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని 7 విద్యుత్తు మీటర్లకు ప్రతినెలా పది వేల నుంచి రూ.12 వేల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. దాంతో 4.50 లక్షల రూపాయల సొంత ఖర్చులతో సర్పంచ్‌ బాలిరెడ్డి 2022 అక్టోబరు 30న గ్రామంలో రెండు సోలార్‌ గ్రిడ్‌లను ఏర్పాటుచేయించాడు. ఈ గ్రిడ్‌ ద్వారా ఉత్పత్తవుతున్న 6 కేవీ విద్యుత్తుతో వీధిలైట్లు, వాటర్‌ ప్లాంట్‌తోపాటు ఇతర మీటర్లకు విద్యుత్తు సరఫరా అవుతోంది.[5]

అవార్డులు

[మార్చు]

ఈ గ్రామం 2021-2022 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నుండి ఆరోగ్యకరమైన గ్రామాలు, కార్బ‌న్ న్యూట్ర‌ల్ విశేష్ పంచాయ‌తీ పుర‌స్కార్ విభాగాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకుంది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Mahender, Adepu (2021-06-16). "First fully vaccinated village in Telangana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-15. Retrieved 2022-11-01.
  2. telugu, NT News (2021-04-19). "మరియపురం ఆదర్శం". www.ntnews.com. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-01.
  3. ABN (2022-02-25). "మళ్లీ మెరిసిన రెండు గ్రామాలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-01.
  4. "TS News: ఆడపిల్ల జన్మిస్తే రూ.10 వేల కానుక". EENADU. 2021-11-18. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-01.
  5. telugu, NT News (2022-10-31). "ఊర్లనే కరెంటు ఉత్పత్తి". www.ntnews.com. Archived from the original on 2022-10-31. Retrieved 2022-11-01.
  6. "రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే". EENADU. 2023-03-31. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.
  7. telugu, NT News (2023-03-30). "Telangana | 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. 31న‌ హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.