మరో ప్రస్థానం
మరో ప్రస్థానం | |
---|---|
దర్శకత్వం | ఎన్. రాఘవన్ |
నిర్మాత | మిర్త్ మీడియా |
తారాగణం | తనీష్, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర |
ఛాయాగ్రహణం | ఎంఎన్ బాల్ రెడ్డి |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | హిమాలయ స్టూడియో మాన్షన్స్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మరో ప్రస్థానం 2021లో తెలుగులో విడుదలైన సినిమా. ఉదయ్ కిరణ్ సమర్పణలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ బ్యానర్ పై మిర్త్ మీడియా నిర్మించిన ఈ సినిమాకు జాని దర్శకత్వం వహించాడు. తనీష్, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]కబీర్ దుహాన్ సింగ్ అతని గ్యాంగ్ కలిసి ముంబైలో వరస నేరాలకు పాల్పడుతుంటారు. ఈ గ్యాంగ్‌లో శివ ( తనీష్) ఓ సభ్యుడు. అయితే, ఒకరోజు నైని (అర్చనా సింగ్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా శివను ఇష్టపడుతుంది. అయితే, గ్యాంగ్‌స్టర్ వృత్తిలో ఉన్న శివ ఆ వృత్తిని వదిలేద్దామని అనుకోని క్రైమ్ గ్యాంగ్ నేరసామ్రాజ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటాడు. గ్యాంగ్ చేస్తున్న నేరాలను సీక్రెట్ కెమేరాలో చిత్రీకరిస్తుంటాడు. విలన్ చేయబోయే ఓ పెద్ద బాంబ్ బ్లాస్ట్ ను ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. శివ ఈ బాంబ్ బ్లాస్ట్‌ను ఆపగలిగాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- తనీష్
- భానుశ్రీ మెహ్రా
- కబీర్ దుహాన్ సింగ్
- రాజా రవీంద్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హిమాలయ స్టూడియో మాన్షన్స్
- నిర్మాత:మిర్త్ మీడియా
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: జాని
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్ బాల్ రెడ్డి
- ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే)
- మాటలు:వసంత కిరణ్, యానాల శివ
- పాటలు: ప్రణవం
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (11 September 2021). "డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తనీష్ 'మరో ప్రస్థానం'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
- ↑ Andhrajyothy (11 September 2021). "తనీష్ 'మరో ప్రస్థానం' సినిమా స్పెషల్ ఇదే". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
- ↑ Andrajyothy (24 September 2021). "'మరో ప్రస్థానం' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
- ↑ Sakshi (23 September 2021). "'మరో ప్రస్థానం' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.