Jump to content

మలము

వికీపీడియా నుండి
ఏనుగు మలము

మలము లేదా మలం లేదా పెంట లేదా రెట్ట అనునది జీవులలో ఆహారం జీర్ణం కాగా మిగిలిపోయే విసర్జక పదార్థము. ఇది సాధారణంగా జీర్ణాశయంలో తయారై పురీషనాళము ద్వారా ప్రయాణించి , గుదము ద్వారా విసర్జింపబడుతుంది.

జీవావరణ శాస్త్రము

[మార్చు]

ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న ఆహారంలో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక జంతువు / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాథమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క మానవ మలము ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.

వాసన

[మార్చు]

మలము దుర్వాసన వేస్తుంటుంది. దీనికి కారణము అందులోని బ్యాక్టీరియా. కానీ ఇదే వాసన ఆ మలమును భుజించుటకు ఇతర జంతువులను ఆకర్షిస్తుంది. సుగంధ ద్రవ్యాలను తిన్న తర్వాత విసర్జించే మలములో జీర్ణం కాకుండా మిగిలిప్ఫ్యిన వాటి అవశేశాల కారణంగా కొన్ని సార్లు ఆ మలానికి దుర్వాసన ఉండదు.

జంతు మలములు

[మార్చు]

జంతువుల మలములకు కొన్ని ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు:

  • ఆవు \ గేదె \ ఎద్దు - పేడ
  • పక్షులు - రెట్ట
  • మేక \ గొర్రె \ పొట్టేలు - పెంటికలు

ఉపయోగాలు

[మార్చు]
  • మానవ మలమును సహజసిద్ద ఎరువు గా ఉపయోగిస్తారు. అలాగే వానపాముల మలాన్ని కూడా ఎరువుగా వాడుతారు.
  • కొన్ని జంతువుల మలము నుండి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరాకు గోబర్ గ్యాస్

చిత్రమాలిక

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మలము&oldid=4370008" నుండి వెలికితీశారు