Jump to content

మల్లారం అడవి

వికీపీడియా నుండి
మల్లారం అడవి
మల్లారం అడవి ప్రవేశ బోర్డు
Locationమల్లారం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
Nearest cityనిజామాబాద్
Area204 హెక్టార్లు
Governing bodyతెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ
అధికారిక వెబ్సైటు

మల్లారం అడవి, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ గ్రామీణ మండలంలోని మల్లారం గ్రామ సమీపంలో ఉన్న అడవి. ఇది నిజామాబాదు పట్టణం నుండి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజథాని హైదరాబాదు నగరం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఇక్కడ చుక్కల జింకలు, లేళ్లు, సాంబార్‌లు, నీల్‌గాయ్‌లు, నెమళ్ళు మొదలైన వన్యప్రాణులు ఉన్నాయి.

ప్రత్యేకత

[మార్చు]

పూర్తిగా చెట్లతో నిండివున్న ఈ దట్టమైన అడవి వలస పక్షులకు, జంతు జాతులకు నిలయంగా ఉంది. సహజమైన పరిసరాలతో, స్వచ్ఛమైన గాలితో, పక్షుల కిలకిలరావాలతో కూడిన పరిపూర్ణ విహారయాత్ర కేంద్రమిది. ఇక్కడ మల్లారం చెరువు కూడా ఉంది.[2]

ఆకర్షణలు

[మార్చు]

ఇందులో అడవి మార్గాలు, ఒక గోపురం, ఒక దృశ్యకేంద్రమున్న టవర్, బౌద్ధ దేవాలయాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన పుట్టగొడుగు ఆకారంలో ఉండే శిల ఇక్కడ ఉంది. ఇది అడవుల్లో విహరించడానికి అనువైన ప్రదేశం.[3] మల్లారం అటవీప్రాంతం పర్యావరణ-పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయబడింది. కొండపై గుడిసెలు నిర్మించారు. పర్యాటకులు కొండపై ఉండటమే కాకుండా చుట్టుపక్కల దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణలోని నిగూఢ‌ ర‌త్నాలు.. ఈ 8 ద‌ర్శ‌నీయ ప్రాంతాలు..!". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-16. Archived from the original on 2022-01-25. Retrieved 2022-01-28.
  2. "పర్యాటకులను కట్టిపడేసే అందాలు చూసొద్దాం." Sakshi. 2019-09-27. Archived from the original on 2020-01-21. Retrieved 2022-01-28.
  3. "తెలంగాణ సిగలో నిజామాబాద్‌... | జరదేఖో | www.NavaTelangana.com". m.navatelangana.com. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28.