Jump to content

మల్లు సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
మల్లు రామసుబ్బారెడ్డి
మల్లు సుబ్బారెడ్డి


పదవీ కాలం
1952 – 1955
తరువాత గోపవరం రామిరెడ్డి
నియోజకవర్గం నంద్యాల శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1962 – 1967
ముందు జి.వెంకటరెడ్డి
తరువాత ఎస్.బి.నబీసాహెబ్
నియోజకవర్గం నంద్యాల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1908
పాణ్యం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 6 డిసెంబరు 1968
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మల్లు తిమ్మారెడ్డి, లక్ష్మమ్మ
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
నివాసం పాణ్యం

మల్లు రామసుబ్బారెడ్డి (జ.1908 పాణ్యం, మ. 1968 డిసెంబరు 6), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, నంద్యాల నియోజకవర్గపు తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

మల్లు సుబ్బారెడ్డి 1908వ సంవత్సరం పాణ్యం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మల్లు తిమ్మారెడ్డి వ్యవసాయం చేసేవారు ఆయన తల్లి లక్ష్మమ్మ. మల్లు సుబ్బారెడ్డి యస్.యస్.ఎల్.సి వరకు నంద్యాల యస్.పి.జి ఉన్నత పాఠశాలలో చదివి తరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో, తర్వాత లా డిగ్రీ మద్రాసు లా కాలేజీ లో పూర్తిచేసి నంద్యాలలో న్యాయ వాది వృత్తి చేపట్టినారు. మల్లు సుబ్బారెడ్డికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రులు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య సహాధ్యాయులు. 1941వ సంవత్సరములో బ్రిటీషు పరిపాలనకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపి, తరువాత 1942వ సంవత్సరం నుండి 1944వ సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని, ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1952వ సంవత్సరములో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డికి నంద్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.[1] 1954వ సంవత్సరములో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని ఓటింగు నిర్వహించారు. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పినా, మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయమని అడిగినా తిరస్కరించి, మద్యపాన నిషేధం ఉండాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేయడంతో, ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. మరలా 1955వ సంవత్సరములో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డి కాంగ్రేసు పార్టీ తరఫున పోటీ చేసినా, స్వతంత్ర అభ్యర్ధి గోపవరం రామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ 1962వ సంవత్సరములో నంద్యాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1967వ సంవత్సరము వరకు రెండవ పర్యాయము ఎమ్మెల్యేగా కొనసాగాడు.[1]

కుటుంబం

[మార్చు]

మల్లు సుబ్బారెడ్డికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మొదటి సోదరుడు మల్లు తిమ్మారెడ్డి ఇంగ్లాండులో బారిష్టర్ గా చదివి కర్నూలులో న్యాయవాద వృత్తిని చేపట్టినారు, రెండవ సోదరుడు మల్లు వెంకటరెడ్డి, పాణ్యం సర్పంచ్ గా 25 సంవత్సరాలు పనిచేశారు. మూడవ సోదరుడు మల్లు నారాయణరెడ్డి వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు.

మరణం

[మార్చు]

రాజకీయాలంటే కేవలం సేవేగానీ, సంపాదన సంపాదన కాదని, నీతి నిజాయితీలే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపి మల్లు సుబ్బారెడ్డి ఆస్తమా వ్యాధితో 1968 డిసెంబరు 6న మరణించారు. మల్లు సుబ్బారెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మల్లు సుబ్బారెడ్డి కుమారుడు మల్లు రామచంద్రారెడ్డి 1985 సంవత్సరంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మెడిసేవా డయాగ్నొస్టిక్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Param (12 May 2024). "నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?". Andhra Today. Retrieved 5 September 2024.