Jump to content

మహతి (పుస్తకం)

వికీపీడియా నుండి
మహతి
కృతికర్త: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: గేయ సంకలనం
ప్రచురణ: రాజమండ్రి ప్రార్థనా సమాజం
గుంటూరు ప్రార్థనా సమాజం
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1938(మహతి నుంచి శీర్షికన), 1949(సంపూర్ణంగా)
పేజీలు: 31

మహతి పుస్తకం ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయ సంకలనం. ఈ గేయసంకలనంలో మొత్తంగా 42 గీతాలు ఉన్నాయి.

రచన నేపథ్యం

[మార్చు]

మహతి మొదట 1949లో గుంటూరు ప్రార్థనా సమాజం ప్రచురించింది. అంతకుముందే 1938లో మహతి నుండి శీర్షికన ఒక గీతావళి రాజమండ్రి ప్రార్థన సమాజం ప్రకటించింది. అవి రెండూ ఇప్పుడు అలభ్య ప్రతులు. మొదట చివర చేర్చిన పద్యావళి కాక, మహతి 67 గీతాల సంపుటం. కన్నీరు కీర్తనలు, మంగళ కాహళిలో చేరిన 5 కీర్తనలు మినహాయించుకుని చూస్తే 42 గీతాలుగా తేలాయి.

రచయిత గురించి

[మార్చు]

ప్రధాన వ్యాసం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా ఉద్యమంలో కృష్ణశాస్త్రి ఒక కీలకమైన కవి. తొలిదశలో భావకవిత్వానికి రూపుదిద్ది, తర్వాత వయసులో రేడియో లలితసంగీతానికి ఒరవడి పెట్టి, ఆపైన సినీగీతాలకు రూపురేకలు తీర్చిన విశిష్టకవి. ఆయన ప్రభావం భావకవులపై ఎంతగా పడిందంటే కవిత్వాన్నే కాక ఆయన ఆహార్యాన్ని కూడా అనుకరించేవారు యువకులు. భావకవిత్వాన్ని భుజానమోసి ఊరూరా కవితాగానంతో ప్రచారం చేసిన వ్యక్తి. అటువంటి మధురగళం ఆయన తుదివయస్సులో మూగబోవడం గొప్ప విషాదం. గొంతు పోయినా చివరిదశ వరకూ తాను కవిత్వం రాస్తూనే గడిపారు.

కవితా వస్తువులు

[మార్చు]

వైవిధ్యభరితమైన వస్తువులను ఎన్నుకుని వ్రాసిన గీతాలివి. వేంకట పార్వతీశ్వర కవుల ఉదయ గానము చదివి ప్రతిస్పందనగా లేదోయి నిదురలో లేదోయి సుగతి గీతాన్ని రచించారు.[1], నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ గీతాన్ని చదివిన స్పందించి నేడే రమ్ము! నేడే రమ్ము! వాడిన ఈ సుమము గోయ! గేయాన్ని రచించారు.[2] బసవరాజు అప్పారావు పాట చదివి వాడిన తీగకె గీత రచన చేశారు.

మూలాలు

[మార్చు]
  1. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీ.40
  2. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీ.49