మహరాజా స్వాతి తిరునాళ్ కీర్తనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహరాజా స్వాతి తిరునాళ్ కీర్తనలు
స్వాతి తిరునాళ్ కీర్తనలు పుస్తకం ముఖచిత్రం
కృతికర్త:
అనువాదకులు: డి. వి. ఎస్. శర్మ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సంగీతం
ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు
విడుదల: 2003
పేజీలు: 121


మహరాజా స్వాతి తిరునాళ్ కీర్తనలు తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి వారు 2003 సంవత్సరంలో ముద్రించిన పుస్తకము.

మహారాజా స్వాతి తిరునాళ్ 19వ శతాబ్దంలో తిరువాన్కూరును పరిపాలించాడు. ఇతడు త్యాగరాజ స్వామి కి సమకాలికుడు. కేవలం 35 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఇతను బహుభాషావేత్త. వీరు సంస్కృతంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ భాషలలో సుమారు 400 సంకీర్తనలను రచించాడు. వాటిలో 212 సంకీర్తనలను ఎన్నుకొని డి. వి. ఎస్. శర్మ గారు తెలుగు లిపి (Transliteration) లోనికి మార్చినారు. మహారాజు కులదైవమైన అనంత పద్మనాభస్వామిని ఉద్దేశించి రచించిన కీర్తనలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. శివపార్వతుల స్తుతులు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, ఆదిశక్తి, శ్రీకృష్ణుడు మొదలైన దేవతల సంకీర్తనలు ఇందులో ఉన్నాయి. రచయిత ప్రతి కీర్తనకు రాగాన్ని, తాళాన్ని నిర్దేశించాడు. ఇవి ఇదివరకే ఆయా భాషలలో ప్రచారంలో ఉన్నవి.

ఇందులోని కీర్తనలు[మార్చు]

  1. ఆంజనేయ రఘురామదూత
  2. ఇంత మోడి యాలర
  3. ఇటు సాహసములు
  4. కలకంఠి కథంకారం
  5. కలయే కమలనయన
  6. కారణం వినా కార్యం
  7. కోసలేంద్ర మామవామిత
  8. కృపయా పాలయ శౌరీ
  9. గాంగేయవసనధర
  10. చింతయామి తే
  11. జగదీశ పంచశరసూదన
  12. జగదీశ శ్రీరమణ
  13. జగదీశ సదా మామవ
  14. జయ జయ పద్మనాభ మురారే
  15. జయ జయ పద్మనాభానుజేశ
  16. జయ జయ రఘురామ
  17. జలజనాభ మా మవ
  18. దేవ దేవ మాం పాలయ
  19. దేవదేవ జగదీశ్వర
  20. దేవి జగజ్జనని
  21. నందసుత తవ జనన
  22. పంకజాక్ష తవ సేవాం
  23. పద్మనాభ పాహి
  24. పన్నగశయన పాహిమాం
  25. పన్నగేంద్రశయ
  26. పరమపురుష
  27. పరమపురుషం హృదయ
  28. పరిపాలయ మాం
  29. పరిపాహి గణాధిప
  30. పరిపాహి మమయి
  31. పరిపాహి మాం
  32. పార్వతీ నాయక
  33. పాలయ మాధవ
  34. పాలయ రఘునాయక
  35. పాహి జగజ్జనని
  36. పాహి జగజ్జనని సతతం
  37. పాహి తరక్షుపురాలయ
  38. పాహి పద్మనాభ
  39. పాహి మామనిశం
  40. పాహి సదా పద్మనాభ
  41. పాహిమాం శ్రీనాగధీశ్వరి
  42. పాహిమాం శ్రీపద్మనాభ
  43. పాహి శ్రీపతే
  44. భక్తపరాయణ
  45. భావయే గోపబాలం
  46. భావయే శ్రీజానకికాంతం
  47. భోగీంద్ర శాయినం
  48. మా మవ జగదీశ్వర
  49. మా మవ పద్మనాభ
  50. మా మవ సదా జనని
  51. మా మవ సదా వరదే
  52. మా మవాశ్రితనిర్జర
  53. మోహనం తవ వపురయి
  54. రఘుకుల తిలకమయి
  55. రామ రామ గుణసీమా
  56. రామ రామ పాహి
  57. రామ రామ పాహి రామ
  58. రీణమదనుత పరిపాలయ
  59. వందే దేవదేవ
  60. వందే సదా పద్మనాభం
  61. వలపు తాళ వశమా
  62. విమలకమలదళ
  63. విహార మానస
  64. శ్రీకుమార నగరాలయే
  65. శ్రీరామచంద్ర పరిలన
  66. సంతతం భజామీహ
  67. సతతం తా వక
  68. సరసమైన మాటలంత
  69. సరసిజనాభ మురారే
  70. సరోజనాభ దయార్ణవ
  71. స్మరజనక శుభచరితా
  72. స్మరమానస పద్మనాభ
  73. సాదరమవ నిరుపమ రామ
  74. సాదరమవ సరసిజదళ సునయన
  75. సామజేంద్ర భీతిహరణ
  76. సామోదం చింతయామి
  77. సామోదం పరిపాలయ పావన
  78. సారససమమృదుపద
  79. సారససువదన
  80. సారసాక్ష పరిపాలయ
  81. సేవే స్యానందూరేశ్వర

మూలాలు[మార్చు]

  • మహరాజా స్వాతితిరునాళ్ కీర్తనలు, డి. వి. ఎస్. శర్మ, కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2003.