మహాబలి సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాబలి సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009-2014 – 2019-ప్రస్తుతం
ముందు ఉపేంద్ర కుష్వాహా(2014-2019)
నియోజకవర్గం కరకత్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2005 – 2009
నియోజకవర్గం చైన్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-04-20) 1955 ఏప్రిల్ 20 (వయసు 68)
రాజకీయ పార్టీ జేడీయూ
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్

మహాబలి సింగ్ కుష్వాహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 & 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని కరకత్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

మహాబలి సింగ్ కుష్వాహా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995, 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చైన్‌పూర్ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2002లో బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉంటూనే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఫిరాయించి, రబ్రీ దేవి మంత్రివర్గంలో 2002 నుండి 2004 వరకు పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ మంత్రిగా, 2004 నుండి 2005 వరకు పౌరసరఫరాల శాఖ మంత్రి భాద్యతలు నిర్వహించాడు. మహాబలి సింగ్ 2005లో జేడీయూలో చేరి 2005, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో చైన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మహాబలి సింగ్ కుష్వాహా 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరకత్ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహా చేతిలో ఓడిపోయి తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2022). "Mahabali Singh". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  2. Business Standard (2022). "Karakat Lok Sabha Election Results 2019: Karakat Election Result 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  3. "Karakat Lok Sabha Election Result 2019 Bihar: RLSP chief Upendra Kushwaha loses to Mahabali Singh of JD(U)". dnaindia.com. Archived from the original on 7 November 2020. Retrieved 2020-10-17.