మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. జ్ఞానేంద్ర రెడ్డి

ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1996
ముందు ఎన్.పి.ఝాన్సీ లక్ష్మి
తరువాత నూతనకల్వ రామకృష్ణరెడ్డి
నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 డిసెంబర్ 1947
పెనుమూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు ఎం.ఆర్.రెడ్డి
జీవిత భాగస్వామి జయప్రద
సంతానం ముగ్గురు కుమార్తెలు
పూర్వ విద్యార్థి శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ , తిరుపతి

మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు చిత్తూరు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఎం. జ్ఞానేంద్ర రెడ్డి ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (విదేశీ, ప్రవాస భారతీయుల వ్యవహారాలు) ఉన్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎం. జ్ఞానేంద్ర రెడ్డి 1 డిసెంబర్ 1947లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పెనుమూరులో జన్మిచాడు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ నుండి బి.ఎస్సీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం. జ్ఞానేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పెనుమూరు గ్రామా సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పని చేశాడు. ఆయన 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎన్ రంగస్వామిపై 82508 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎం. జ్ఞానేంద్ర రెడ్డి 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుర్రం వి. శ్రీనాధ రెడ్డిపై 109982 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పలమనేరు నియోజకవర్గం టికెట్‌ కోసం ప్రయత్నించాడు ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరాడు.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (10 January 2022). "ఏపీ ప్రభుత్వం మరో సలహాదారుగా జ్ఞానేంద్ర రెడ్డి". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  2. Loksabha (2021). "Members Bioprofile". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.