మహేంద్రప్రసాద్
స్వరూపం
మహేంద్ర ప్రసాద్ | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం మే 1985 – డిసెంబర్ 2021 | |||
నియోజకవర్గం | బీహార్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గోవిందపూర్, జహానాబాద్ జిల్లా,బీహార్ రాష్ట్రం, భారతదేశం | 1940 జనవరి 8||
మరణం | 2021 డిసెంబరు 27 ఢిల్లీ, భారతదేశం | (వయసు 81)||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) |
మహేంద్ర ప్రసాద్ భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 7సార్లు రాజ్యసభకు, ఒక సారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్ర ప్రసాద్ రూ.4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా నిలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్ర ప్రసాద్ 1980లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడంతో జనతాదళ్ పార్టీలో అనంతరం రాష్ట్రీయ జనతా దళ్‌లో, తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చేరాడు. మహేంద్ర బిహార్ నుంచి 7 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2]
మరణం
[మార్చు]మహేంద్ర ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని తన నివాసంలో 27 డిసెంబర్ 2021న మరణించాడు. [3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ ETV Bharat News (23 July 2020). "వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
- ↑ The Indian Express (27 December 2021). "King Mahendra: The medicine baron who became JDU's longest-serving RS MP" (in ఇంగ్లీష్). Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
- ↑ Namasthe Telangana (27 December 2021). "మహేంద్ర ప్రసాద్ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
- ↑ Prajasakti (28 December 2021). "మహేంద్రప్రసాద్ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
- ↑ Sakshi (28 December 2021). "రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.