మహేశా పాపవినాశా
స్వరూపం
మహేశా పాపవినాశా పాట కాళహస్తి మహాత్యం (సినిమా) కోసం తోలేటి వెంకటరెడ్డి రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేయగా ఆర్. సుదర్శనం సంగీతాన్ని అందించారు.
పాట సాహిత్యం
[మార్చు]ఓం నమశ్శివాయా నవనీత హృదయా
తమ ప్రకాశా తరుణేందుభుషా నమో శంకరా దేవదేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా
భక్తియేదొ పూజలేవో తెలియనైతినే
పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా
మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి
ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య
వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య