Jump to content

మహ్మద్ తస్లీముద్దీన్

వికీపీడియా నుండి
మహ్మద్ తస్లీముద్దీన్
మహ్మద్ తస్లీముద్దీన్


పదవీ కాలం
16 మే 2014 – 17 సెప్టెంబర్ 2017
ముందు ప్రదీప్ కుమార్ సింగ్
తరువాత సర్ఫరాజ్ ఆలం
నియోజకవర్గం అరారియా

పదవీ కాలం
2004 – 2009

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సహాయ మంత్రి
పదవీ కాలం
జూన్ 1996 – జూలై 1996

వ్యక్తిగత వివరాలు

జననం (1943-01-04)1943 జనవరి 4
సిసౌనా, బీహార్, బ్రిటిష్ ఇండియా
మరణం 2017 సెప్టెంబరు 17(2017-09-17) (వయసు 74)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
తల్లిదండ్రులు అమ్జద్ అలీ, బీవీ సాబుజన్
జీవిత భాగస్వామి అఖ్తరీ బేగం (m. 1949)
సంతానం 5 (ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు)
నివాసం అరారియా

మహ్మద్ తస్లీముద్దీన్ (4 జనవరి 1943 - 17 సెప్టెంబర్ 2017) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఆ తరువాత కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం, అరారియా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1959: సిసౌనా గ్రామ పంచాయతీ సర్పంచ్
  • 1964: ముఖియా, గ్రామ పంచ్యాత్, సిసౌనా, జోకిహత్
  • 1969-89, 1995-96 & 2002 - 2004: బీహార్ శాసనసభ సభ్యుడు (ఎనిమిది సార్లు)
  • 1977-80: పార్లమెంటరీ కార్యదర్శి, బీహార్ ప్రభుత్వం
  • 1985-1989 : జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, బీహార్
  • 1989: 9వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1989-91: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • 1989-97: జనతాదళ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
  • 1996: 11వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు
  • జూన్-జూలై 1996: హెచ్‌డి దేవెగౌడ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
  • 1996-98: హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • వక్ఫ్ బోర్డుపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
  • రాష్ట్రీయ జనతాదళ్ ప్రధాన కార్యదర్శి
  • 1998: 12వ లోక్‌సభకు 3వ సారి
  • 1998-99: రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడు & సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక మంత్రిత్వ శాఖ
  • ఫిబ్రవరి 2000: బీహార్ శాసనసభ్యుడు
  • 2000-2004: హౌసింగ్ శాఖ మంత్రి
  • 2004: 14వ లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నికయ్యారు
  • మే 2004 - 2009: కేంద్ర వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి
  • 2014: 16వ లోక్‌సభకు 5వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 1 సెప్టెంబర్ 2014 - 17 సెప్టెంబర్ 2017: ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు
  • రసాయనాలు, ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ & తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 29 జనవరి 2015 - 17 సెప్టెంబర్ 2017: సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు

మరణం

[మార్చు]

మహ్మద్ తస్లీముద్దీన్ 2017 సెప్టెంబర్ 17న చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అక్కడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (18 September 2017). "Voice of Seemanchal Mohammed Taslimuddin dies at 74" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. Financialexpress (18 September 2017). "Who was Mohammed Taslimuddin, RJD strongman and voice of Seemanchal who died at 74 on Sunday" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  3. "Veteran RJD leader and former Union minister Mohammad Taslimuddin dies at 74". 17 September 2017. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.