Jump to content

మాండీ తఖర్

వికీపీడియా నుండి
మాండీ తఖర్
జననం
వాల్వర్‌హాంప్టన్, వెస్ట్ మిడ్‌లాండ్స్, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటీష్
విద్యాసంస్థకింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

మాండీ తఖర్, పంజాబీ, హిందీ, తమిళ సినిమా నటి.

జననం, విద్య

[మార్చు]

మాండీ తఖర్ 1982, మే 1న యుకె లోని వోల్వర్‌హాంప్టన్ నగరంలో జన్మించింది.[1] మాండీ మూలాలు పంజాబ్‌లోని ఫగ్వారా సమీపంలోని మలియానా అనే చిన్న గ్రామంలో ఉన్నాయని గుర్తించింది.[2] 17 సంవత్సరాల వయస్సులో కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో కోర్సు అభ్యసించడానికి లండన్‌కు వెళ్ళింది. భారతీయ సినిమారంగంలో నటిగా పని చేయడానికి 2009లో యుకె నుండి భారతదేశానికి వచ్చింది.[2]

సినిమారంగం

[మార్చు]

మాండీ ముంబైకి వెళ్ళి, 2010లో వచ్చిన ఏకం - సన్ ఆఫ్ సాయిల్ సినిమాలో ప్రఖ్యాత పంజాబీ గాయకుడు బబ్బు మాన్ సరసన నటించింది.[2] తరువాత మీర్జా - ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో సూపర్ స్టార్ గిప్పీ గ్రేవాల్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. సాహిబా పాత్రలో పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది.

2013లో, తు మేరా 22 మెయిన్ తేరా 22 సినిమాలో అమ్రీందర్ గిల్, హనీ సింగ్‌లతో కలిసి నటించింది. ఉపాధ్యాయురాలిగా నటించిన మాండీ, 6వ పంజాబీ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 2012-2013లో అత్యంత ప్రముఖమైన & పాపులర్ ఫేస్, యూత్ ఐకాన్‌గా అవార్డును పొందింది.[3][4]

వెంకట్ ప్రభు దర్శకత్వంలో కార్తీ నటించిన బిరియాని సినిమాతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5] పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటిగా అవార్డును గెలుచుకుంది.

2017 ప్రారంభంలో రబ్ డా రేడియో అనే పంజాబీ సినిమాలో కనిపించింది. 2017లో సుఖీ బార్ట్‌తో కలిసి బ్రిట్ ఆసియా టీవీ మ్యూజిక్ అవార్డ్స్‌కు కో-హోస్ట్ గా చేసింది.[6][7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2010 ఏకం - సన్ ఆఫ్ సాయిల్డు నవనీత్ పంజాబీ బాబు మాన్‌తో
2012 మీర్జా – ది అన్‌టోల్డ్ స్టోరీ సాహిబా పంజాబీ గిప్పీ గ్రేవాల్ & హనీ సింగ్‌తో
2012 బొంగు పింకీ హిందీ జగదీష్ రాజ్‌పురోహిత్ దర్శకత్వం వహించారు
2012 సాదీ వఖ్రీ హై షాన్ జోట్ పంజాబీ
2013 తు మేరా 22 మెయిన్ తేరా 22 సిమ్మీ పంజాబీ అమ్రీందర్ గిల్ & హనీ సింగ్‌తో
2013 ఇష్క్ గరారీ మిస్ స్వీటీ పంజాబీ శారీ మాన్‌తో
2013 బిర్యానీ మాయ తమిళం దర్శకుడు వెంకట్ ప్రభు
2015 సర్దార్జీ జాస్మిన్ పంజాబీ (దర్శకుడు రోహిత్ జుగ్రాజ్, నిర్మాత వైట్ హిల్ ప్రొడక్షన్స్) దిల్జిత్ దోసంజ్‌తో[8]
2015 ముండే కమల్ దే సోనియా పంజాబీ (దర్శకుడు అమిత్ ప్రషెర్ ) అమ్రీందర్ గిల్‌తో
2016 అర్దాస్ బైండర్ పంజాబీ గిప్పీ గ్రెవాల్ దర్శకత్వం వహించారు
2016 సర్దార్ జీ 2 అతిథి పాత్ర పంజాబీ "పాప్లిన్"లో ప్రత్యేక ప్రదర్శన
2016 కడవుల్ ఇరుకన్ కుమారు ఆడి కార్ లేడీ తమిళం ప్రత్యేక ప్రదర్శన
2017 రబ్ డా రేడియో నసీబ్ కౌర్ పంజాబీ టార్సెమ్ జస్సర్‌తో
2018 ఖిడో ఖుండీ లాలీ పంజాబీ రంజిత్ బావతో
2019 లుకాన్ మిచి పంజాబీ ప్రీత్ హర్పాల్‌తో
2019 బ్యాండ్ వాజే బిల్లో పంజాబీ బిన్ను ధిల్లాన్‌తో
2019 సాక్ చాన్ కౌర్ పంజాబీ జోబన్‌ప్రీత్ సింగ్‌తో[9]
2021 ఎస్ ఐయామ్ స్టూడెంట్[10] రీట్ పంజాబీ సిద్ధూ మూసేవాలాతో

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పాట కళాకారుడు సంగీతం సాహిత్యం కంపనీ
2020 తోడ్ డా ఇ దిల్ అమ్మీ విర్క్ అవ్వి స్రా మనీందర్ బుట్టర్ దేశీ మెలోడీస్
2020 దిల్ చాహ్తే హో జుబిన్ నౌటియల్ పాయల్ దేవ్ ఏఎం తురాజ్ టి-సిరీస్

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2016 పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి సర్దార్జీ గెలుపు
2012-13 6వ పంజాబీ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అత్యంత ప్రముఖమైన & జనాదరణ పొందిన నటి -- గెలుపు
2013 పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి మీర్జా – ది అన్‌టోల్డ్ స్టోరీ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "BRITISH ACTRESS 'MANDY TAKHAR' MAKES HER BOLLYWOOD DEBUT". 27 March 2012. Retrieved 2022-05-05.
  2. 2.0 2.1 2.2 Lakhi, Navleen (9 September 2012). "Mandy unplugged". Hindustan Times. Retrieved 2022-05-05.
  3. "Not everybody gets a Yash Raj launch: Mandy". The Times of India. 5 December 2012. Archived from the original on 10 January 2014. Retrieved 2022-05-05.
  4. "Prem Chopra gets lifetime achievement honour". Hindustan Times. 7 April 2013. Archived from the original on 8 April 2013. Retrieved 2022-05-05.
  5. "Mandy Takhar joins 'Biriyani' gang!". Sify. Archived from the original on 8 November 2012. Retrieved 2022-05-05.
  6. "Film star Mandy Takhar to host the BritAsia TV World Music Awards 2017!". BritAsia TV. 8 February 2017. Retrieved 2022-05-05.
  7. "BritAsia TV World Music Awards 2017 celebrated". New Asian Post. 4 March 2017. Archived from the original on 2020-10-11. Retrieved 2022-05-05.
  8. Reid, Michael D. (31 October 2014). "Big Picture: Craigdarroch Castle turns into little India". Times Colonist. Retrieved 2022-05-05.
  9. "Saak: Two days ahead of the release, Mandy Takhar shares a new poster". Times of India. 4 September 2019. Retrieved 2022-05-05.
  10. "Yes I Am Student: The shoot of Sidhu Moose Wala's debut movie goes on the floor". The Times of India (in ఇంగ్లీష్). 27 August 2019. Retrieved 2022-05-05.

బయటి లింకులు

[మార్చు]