Coordinates: 45°51′40″N 84°37′50″W / 45.86111°N 84.63056°W / 45.86111; -84.63056

మాకినాక్ ద్వీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mackinac
భూగోళశాస్త్రం
ప్రదేశంLake Huron
అక్షాంశ,రేఖాంశాలు45°51′40″N 84°37′50″W / 45.86111°N 84.63056°W / 45.86111; -84.63056
విస్తీర్ణం{{convert/{{{d}}}|3.776||km2|||||s=|r={{{r}}}

|u=sq mi |n=square mile |h=square-mile |o=km2 |b=2589988.110336

|j=6.41329777-0}}
తీరరేఖ8 mi (13 km)
అత్యధిక ఎత్తు890 ft (271 m)
నిర్వహణ
United States
జనాభా వివరాలు
జనాభా492 residents and as many as 15,000 tourists per day during peak season
జన సాంద్రత50.31 /km2 (130.3 /sq mi)

మాకినాక్ ద్వీపం. ఇది ఒక ద్వీపం, రిసార్ట్. 3.8 చ.కిమీ వైశాల్యం కలిగిన ఈ దీవి యు.ఎస్ స్టాట్ మిచిగాన్‌లో ఉంది. ఇది హురాన్ సరోవరంలో మాకినాక్ స్టారియట్‌ తూర్పుతీరంలో అప్పర్ పెనింసులా, లోయర్ పెనింసులా మధ్యన ఉంది.[5] 17వ శతాబ్దంలో యురోపియన్ అణ్వేషకులు ఇక్కడకు చేరేముందు ఇక్కడ ఒడ్వా వలసప్రజలు నివసించే వారు. గ్రేట్ లేక్స్ మధ్యన ఉన్న ఈ ద్వీపం ఫర్ వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. ఫలితంగా అమెరికన్ తిరుగుబాటు యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ మాకినాక్ కోటను నిర్మించింది. 1812లో ఇది రెండు యుద్ధాలకు వేదిక అయింది.[6] 19వ శతాబ్దంలో మాకినాక్ ద్వీపం ప్రబల పర్యాటక కేంద్రంగా, వేసవి విడిదిగా మారింది. దీవిలో చాలాభాగం చారిత్రక సంరక్షితప్రాంతం, పునరావాస కేంద్రంగా మార్చబడింది. ఫలితంగా దీవి మొత్తం " నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ " అయింది. వైవిధ్యమైన నిర్మాణశైలికి, పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇక్కడ విక్టోరియన్ నిర్మాణశైలితో కూడిన పలు వైవిధ్యమైన నిర్మాణశైలి కట్టడాలు దర్శనం ఇస్తాయి. ఇక్కడ మోటర్ వాహనాల వాడకం నిషిద్ధం. దీవిలో 80% శాతం కంటే అధికభాగం మాకినాక్ ఐలాండ్ స్టేట్ పార్క్ సంరక్షణలో ఉంది.[7]

పేరువెనుక చరిత్ర[మార్చు]

గ్రేట్ లేక్స్ ప్రాంతంలోని పలు చారిత్రకప్రాంతాలలా మాకినాక్ అనేపేరు స్థానిక అమెరికన్ల నుండి ఆరంభమై ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ సమీపప్రాంతాలలో ఉన్న స్థానిక అమెరికన్లు ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంది కనుక దీనికి మిట్చిమాకినాక్ (అంటే వారి భాషలో పెద్ద తాబేలు అని అర్ధం) అని పేరు పెట్టారని భావిస్తున్నారు.[8] ఓడ్వా చరిత్రకారుడు " ఆండ్ర్యూ బ్లాక్ బర్డ్) ఇక్కడ నివసివిన స్థానికజాతుల పేరు ఈ దీవికి పెట్టారని భావిస్తున్నాడు.[9] ఫ్రెంచ్ వారు దీనిని " మిచిలిమాకినాక్ " అంటారు. బ్రిటిన్ దీనిని సంక్షిప్తం చేసి మాకినాక్ అని ప్రస్తావించింది.[10][11] మిచిలి మాకినాక్ ను మిషిని మాకినాగో, మి- షి- మాకి నా-గో, మిస్సిలి మాకినాక్, టియోడోండొరేగీ అని కూడా అనే వారు.

మిచిగాన్ అప్పర్ పెనింసులాలో విస్కాంసిన్ నుండి 10 మిలియన్ల ఎకరాలలో మెనోమినీ సంప్రదాయ ప్రజలు నివసించే వారు. మిచిగాన్‌కు చెందిన స్లోవేనియన్ ఫాదర్ 1878లో తన డిక్షనరీలో దీనిని మిషినిమాకినాగో అని వ్రాసాడని చరిత్రకారులు పరిశోధనలు వెల్లడి చేసాయి. మెనోమినీ భాషలో మీకీనాహ్ అంటే తాబేలు అని అర్ధం. జాన్ రీడ్ స్వాంటన్ 1952లో వ్రాసిన " ఇండియన్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ అమెరికా " లో విస్కాంసిన్ విభాగంలో పాత కోట వద్ద సమీపంలో ఉన్న " మిచిలిమాకినాక్ " ప్రజల గురించి ప్రస్తావించాడు.[12] యు.ఎస్ అధికారిక వ్యాఖ్యాత ఆండ్ర్యూ బ్లాక్బర్డ్ (ఒటావా చీఫ్ కుమారుడు) 1887లో వ్రాసిన వ్రాతలు మాకినాక్ గురించిన మొదటి వ్రాతపూర్వక చారిత్రక ఆధారంగా భావిస్తున్నారు. ఆయన వ్రాతలలో " ఆధారంగా ఒకప్పుడు " మి-షి-నే-మాకి నా- గో " ఆదిమవాసులు మాకినాక్ దీవిని ఆక్రమించుకున్నారు. వారు హ్యురాన్ సరోవర ఉత్తరప్రాంతంలో ఉన్న ఒటావా దీవి (మనితౌలిన్ దీవి) ప్రజలతో సమ్మిశ్రితం అయ్యారు. ఒకశీతాకాలంలో న్యూయార్క్ ప్రాంతం నుండి వచ్చిన సెనేకా ప్రజలు మాకినాక్ దీవిలోని మి-షి-నే-మాకి నా- గో ప్రజలను పూర్తిగా నాశనం చేసారు. దీవిలో సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో తలదాచుకున్న ఇద్దరు మాత్రం ఈ దాడి నుండి తప్పించుకున్నారు. ఒటవా ప్రజలు ఈ దీవిలో నివసించిన ప్రజల ఙాఅపకార్ధం ఈ దీవికి మి-షి-నే-మాకి నాంగ్ అని నామకరణం చేసాడు " అని ఉంది.[13] 1895 లో ఫోర్ట్ మాకినాక్స్ జాన్ ఆర్.బైలే (ఎం.డి) " మాకినాక్ ఫార్మర్లీ మిచిలిమాకినాక్ " పేరుతో చరిత్రక పుస్తకం వెలువరించాడు. ఆయన వ్రాతలలో కొంతమంది ఫ్రెంచ్ వ్యాపారుల ప్రస్తావన ఉంది. వారు 1664 లో ఇక్కడకు ప్రవేశించారు. 1665 లో అణ్వేషకుడు ఒకరు కనోయీ (పడవ)లో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నట్లు వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి.[1]

చరిత్ర[మార్చు]

చరిత్రకు పూర్వం[మార్చు]

A historical plaque at British Landing, mounted atop wooden poles. Bikes are chained to the poles.
Historical Marker at British Landing

మాకినాక్ ద్వీపం, పరిసరప్రాంతాలలో పూరాతత్వపరిశోధకులు జరిపిన త్రవ్వకాలలో మత్స్యకారుల మకాములు బయటపడ్డాయి. చేపలుపట్టేగాలాలు, మట్టిపాత్రలు, ఇతర కళావస్తువులు ఆధారంగా యురేపియన్ ప్రవేశానికి 700 ముందు ఇక్కడ స్థానిక అమెరికన్లు నివసించారని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆదిమవాసుల సంప్రదాయంలో ఈ దీవి పవిత్రప్రాంతగా ఉండేది. ఇది " గిత్చే మనితౌ " (గ్రేట్ స్పిరిట్) కు ఈ దీవి నివాసమన్న విశ్వాసం ఉండేది. పురాణం ఆధారంగా మాకినాక్ ద్వీపం గ్రేట్ హరే, ననబోఝొ (మిచబౌ) ఈ దీవిని సృష్టించాడని అలాగే ఇది ప్రళయానంతరం బయల్పడిన మొదటి భూభాగమని వివరించబడింది.[14] ఆదిమవాసులు ఇక్కడ కూడి " గిత్చే మనితౌ " కానుకలు సమర్పించేవారని అంతేకాక స్త్యానిక అమెరికన్ ప్రముఖులకు ఇది మరుభూమి అని విశ్వసిస్తున్నారు.[15]

17 నుండి 18 శతాబ్దం వరకు[మార్చు]

మాకినాక్ ద్వీపంలో మొదటిసారిగా ప్రవేశించిన యురేపియన్ జీన్ నికోలెట్. ఫ్రెంచ్ - కెనడియన్ కొరియర్ డెస్ బోయిస్ 1964 లో తన అణ్వేషణ యాత్రలో ఇక్కడకు చేరుకున్నాడు. సెసూయిట్ ప్రీస్ట్ 1670లో మాకినాక్ ద్వీపంలో స్థానిక అమెరికన్ల కొరకు ఒక మిషనరీ స్థాపించాడు. తరువాత వచ్చిన దాబ్లాన్ ఫాల్స్ మిషనరీని సెయింట్ ఇగ్నేస్‌కు మార్చాడు. [16][17] మిషన్ కారణంగా గుర్తించబడిన మాకినాక్ స్ట్రెయిట్ శీఘ్రగతిలో ఫ్రెంచ్ ఉన్ని వాణిజ్య కేంద్రంగా మారింది. ఫ్రెంచ్ - ఇండియన్ యుద్ధం తరువాత మాకినాక్ స్ట్రెయిట్ బ్రిటన్ స్వాధీనం అయింది. 1780లో మేజర్ పాట్రిక్ సింక్లియర్ మాకినాక్ ద్వీపంలో కోటను నిర్మించాడు.[6][15]" ది సిసూయిట్ రిలేషంస్ " లో మాకినాక్ ద్వీపం గురించిన దీర్ఘవివరణ ఉంది: జాలర్లు, గాలులు, ఆట్పోటులు, ప్రస్తూత కాలం, పురాతనకాల గిరిజనప్రజల నివాసం గురించిన వివరణ ఇక్కడ చోటుచేసుకుంది. అల్గాంకిన్ గిరిజనుల అభిమాన రిసార్ట్‌.

A white, flat-roofed gazebo over a spring, with a plaque located on a rock next to the spring. A short, wide wooden walkway leads from the road to the gazebo.
Dwightwood Spring, on Mackinac Island's eastern shore

" ది రిలేషంస్ " లో మాకినాక్ ద్వీపం వ్యూహాత్మక ప్రయోజనం గురించిన మరికొన్ని వివరణలు ఉన్నాయి. అలాగే అప్పర్ గ్రేట్ లేక్స్ ప్రాయాణికులకు ఇది కేంద్రస్థానంగా ఉంది. అలాగే అత్యధిక భాగం వన్యప్రాంతాలతో, ఆరంభకాల దేశాల, యురేపియన్ల (రైలు మార్గం వేయకముందు) ప్రజలకు నివాసంగా ఉంది. మాకినాక్ ద్వీపంలో నివసించిన ఆరంభకాల స్థానికులను ఇరాక్వీజాతి ప్రజలు ఇక్కడి నుండి తరిమి వేసారు. తరువాత 1670 వరకు ఈ దీవి నిర్జనంగా ఉంది. లేక్ సుపీరియర్ నుండి హ్యూరాన్ ప్రజలు సియోక్స్ భయంతో మాకినాక్ ద్వీపం ఉత్తర ప్రాంతానికి తరలి వెళ్ళారు. 1688 లో జాక్యూస్ - రెనె డీ బ్రిసే డీ డీనాంవిల్లె ఈ దీవిని ఫ్రెంచ్ తరఫున స్వాధీనం చేసుకున్నాడు. [18] తరువాత ఈ ద్వీపాన్ని మిచిల్లిమాకినాక్ అని పిలిచారు. తరువాత ఇక్కడ నిర్మించిన కోటకు, మాకినాక్ స్ట్రెయిట్‌లో స్థాపించిన చర్చికి మాకినాక్ పేరు నిర్ణయించబడింది. [1][19][20][21] బ్రిటన్ తమ నివాసాలు, స్థానిక జాతుల ప్రజలను ఫ్రెంచ్- కెనడియన్ దాడుల నుండి రక్షించడానికి కోట నిర్మించినప్పటికీ ఈ కోట ఎపూడూ దాడికి గురికాలేదు. 1783లో " ట్రీటీ ఆఫ్ పారిస్ " ద్వారా మాకినాక్ స్ట్రెయిట్ ప్రాంతం అంతటినీ యు.ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.అయినప్పటికీ 1794 వరకు బ్రిటన్ ఈ ప్రాంతం నుండి వైదొలగ లేదు. తరువాత జే ట్రీటీతో యు.ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద పూర్తి ఆధీనత సాధించింది.[22]

19వ శతాబ్దం నుండి ప్రస్తుతకాలం వరకు[మార్చు]

A gray steel statue of Père Jacques Marquette, atop a marble pedestal
The statue of Jacques Marquette, Jesuit Priest and Great Lakes explorer, in front of Fort Mackinac

1812 యుద్ధం సమయంలో బ్రిటిష్ మాకినాక్ కోటను స్వాధీనం (ఫోర్ట్ మాకినాక్ దాడి) చేసుకుంది. తరువాత బ్రిటన్ దీవిని రక్షించడానికి మాకినాక్ కోట వెనుక జార్జి కోటను నిర్మించారు. 1814లో ద్వీపం ఉత్తర భాగంలో బ్రిటన్- అమెరికన్ యుద్ధం (రెండవ మాకినాక్ యుద్ధం) జరిగింది. మేజర్ ఆండ్ర్యూ హాల్ంస్ యుద్ధంలో మరణించిన కారణంగా అమెరికన్లు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడంలో విఫలం అయ్యారు. 1815 లో " ట్రీటీ ఆఫ్ ఘెంట్ " ద్వారా బ్రిటిష్ ఈ ద్వీపాన్ని, సమీపంలోని ప్రధాన భూభాగాన్ని యు.ఎస్ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. తిరిగి ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న యు.ఎస్ ప్రభుత్వం మేజర్ హాల్ంస్ ఙాఅపకార్ధం ఈ దీవిలోని జార్జ్ కోటకు " హాల్ంస్ కోట " అని నామకరణం చేసారు.[6][23] తరువాత 1895 వరకు మాకినాక్ ద్వీపం యు.ఎస్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుని అమెరికన్ అంతర్యుద్ధం సమయంలో కోటరక్షణార్ధం ప్రతినిధులను నియమించింది. యునైటెడ్ స్టేట్స్ సానుభూతిపరులను ఖైదులో ఉంచడానికి ఈ కోటను వాడుకున్నారు.[15] ప్రపంచయుద్ధం (1812) తరువాత మాకినాక్ ద్వీపంలో " జాన్ జాకబ్ అస్టర్ " అమెరికన్ ఫర్ కంపెనీ స్థాపించాడు. 19వ శతాబ్దం మధ్యకాలానికి కామన్ వైట్ ఫిష్, లేక్ ట్రౌట్ వ్యాపారం ఉన్ని వ్యాపారాన్ని అధిగమించి మాకినాక్ ప్రధాన పరిశ్రమగా మారింది. 1880 నాటికి చేపలుపట్టే క్రీడ మాకినాక్ ద్వీపంలో ప్రాబల్యత సంతరించుకుంది. క్రమంగా డెట్రాయిట్ నుండి రైలు, లేక్ బోట్ల ద్వారా వచ్చి చేరుతున్న పర్యాటకుల కొరకు హోటల్స్, రెస్టారెంట్లు అధికం అయ్యాయి.[6] అంతర్యుద్ధం తరువాత సరోవరతీరప్రాంతవాసులకు మాకినాక్ ద్వీపం ప్రధాన పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చెందింది. 1875లో మెకనాక్ ద్వీపంలోని అత్యధికభూభాగం రెండవ నేషనల్ పార్క్ (మెకనాక్ నేషనల్ పార్క్‌)గా అభివృద్ధిచేయబడింది. మొదటి నేషనల్ పార్క్ " యెల్లో స్టోన్ నేషనల్ " పార్క్ 1872లో ఏర్పాటుచేయబడింది. వరదలా వచ్చి చేరుతున్న పర్యాటకుల సౌకర్యార్ధం రైలు, బోట్ సంస్థలు హోటెల్స్ నిర్మాణం చేసారు. మాకినాక్ ద్వీపంలో నిర్మించిన గ్రాండ్ హోటల్ కూడా అందులో భాగమే. ద్వీపవాసులు సావనీర్ షాపుల నిర్వహణ ద్వారా పర్యాటకుల నుండి ఆదాయం పొందుతున్నారు. పలువురు సంపన్న వ్యాపారవేత్తలు నిర్మిచిన కాటేజీలు ద్వీపంలో కొంతకాలం నివసించడానికి సౌకర్యం కల్పిస్తున్నాయి. 1895లో ఫెడరల్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని వదిలి వెళ్ళిన తరువాత ద్వీపం మిచిగాన్ రాష్ట్రానికి అప్పగించబడింది. తరువాత ద్వీపం మొదటి మిచిగాన్ స్టేట్ పార్క్ అయింది.[7][24] 19వ శతాబ్దం చివరికాలానికి గుర్రపుబండి నడిపేవారు ఫిర్యాదుచేనకారణంగా ద్వీపవాసుల, గుర్రాల రక్షణార్ధం ద్వీపంలో మోటారు వాహనాలు రద్దుచేయబడ్డాయి. ఇది ప్రస్తుత కాలానికి కొనసాగుతూ ఉంది. అత్యవసర పరిస్థితిలో మాత్రమమే ద్వీపంలో మోటర్ వాహనాలు అనుమతించబడుతుంటాయి.[15][25]

భౌగోళికం[మార్చు]

An arch-shaped rock. The opening in the rock is sizable, and part of a road, trees, and a lake can be seen through the rock.
A view of M-185 through Arch Rock
A forest with tall, thin trees. One of the trees is fallen.
One of the many extensive forests of Mackinac Island

మాకినాక్ ద్వీపం 8 మైళ్ళ చుట్టుకొలత, 3.8 మైళ్ళ చ.మైళ్ళ వైశాల్యం కలిగి ఉంది.[5] హాల్ంస్ కోట (1895 కు ముందు దీనిని బ్రిటిష్ ప్రభుత్వం జార్జ్ కోటగా వ్యవహరించింది) ద్వీప!లో ఎత్తైనప్రాంతంగా గుర్తించబడుతుంది. ఇది సముద్రమట్టానికి 320 అడుగుల ఎత్తులో ఉంది.[23] 2010 యునైటెడ్ స్టేట్స్ గణాంకాలు అనుసరించి ద్వీపం జనసంఖ్య 492.[26] వేసవి కాలంలో హోటెల్, రెస్టారెంట్లలో పనిచ్శ్యడానికి స్వల్పకాలిక సిబ్బంధిని నియమించుకుంటారు. ఆసమయంలో ద్వీపంలో అధికసంఖ్యలో ప్రజలు నివసిస్తారు. ద్వీపానికి దాదాపు దినసరి 15.000 మంది సందర్శకులు వస్తుంటారు.[27][28]

నైసర్గికం[మార్చు]

మాకినాక్ ద్వీపం " విస్కాంసిన్ గ్లాసియేషన్ ఐస్ ఏజ్ " నుండి రూపొందిందని భావిస్తున్నారు. ఇది క్రీ.పూ13,000 సంవత్సరాల ముందు నుండి కరిగిపోవడం మొదలైంది. ద్వీపం అంర్భాగంలో శిల్పతల్పం (బెడ్ రాక్) చాలాపురాతనమైనది. ఇది సిలూరియన్, ఆరంభకాల డివోనియన్ కాలం నాటిదని (400-420 మిలియన్ సంవత్సరాలు) భావిస్తున్నారు. పైపొరలలో ఉన్న హాలైట్ నిల్వలు కరిగి లైంస్టోన్ బండలు విరిగిపడడానికి దారి ఇచ్చాయి. విరిగిపడిన లఒంస్టోంస్ ప్రస్తుతం దృఢపడ్డాయి. కరిగిన గ్లాసియర్లు గ్రేట్ లేక్స్ రూపొందడానికి కారణం అయ్యాయి. సరోవర జలాలు ద్వీపంలోని లైంస్టోంస్‌ను కరిగించి నిటారైన క్లిఫ్ట్ ఏర్పడడానికి కారణం అయ్యాయి. గతంలో ప్రస్తుత సరోవరం ఎత్తు కంటే అధికమైన మూడు స్థాయిలలో నీటిమట్టం ఉండి ఉంటాయని భావిస్తున్నారు. వీటిలో రెండు ప్రస్తుత సరోవర తీరం కంటే అధికస్థాయి ఎత్తైనవి:అల్గాంక్విన్ లెవల్ వయసు 13.000 సంవత్సరాల పూర్వానికి చెందింది. అలాగే నిపిసింగ్ లెవల్ 4,000 - 6,0000 పుర్వానికి చెందింది.[29] దిగువజలాలు, ఎగువజలాల కాలం మధ్య ఇరుకైన మాకినాక్ జలసంధి తీరంలోని కొండచరియల తూర్పుభాగం నుండి ప్రవహించే మాకినాక్ జలపాతం జలాలు హ్యూరాన్ సరోవరంలో సంగమించాయి.[30] గ్రేట్ లేక్స్ ప్రస్తుత స్థాయికి చేరుకున్న తరువాత మాకినాక్ ద్వీపం కూడా ప్రస్తుత వైశాల్యానికి చేరుకుంది.[5] నిటారుగా ఉండే కొండచరియలు బ్రిటిష్ సైన్యం కోటను నిర్మించడానికి తగినంత ప్రేరణ కలిగించాయి. 1715లో ఫ్రెంచ్ సైన్యం ప్రస్తుత మకినాక్ సమీపంలో మాకినాక్ కోటను నిర్మించింది. లైంస్టోన్ రూపాలు ద్వీపంలో భాగం అయ్యాయి. పర్యాటకులను ఇక్కడి ప్రకృతి సౌందర్యం అధికంగా ఆకర్షిస్తూ ఉంటుంది. లైంస్టోన్ ఆర్చి పర్యాటక ఆకర్షణలలో ప్రధానమైనది. ఇది జలప్రవాహం కారణంగా సహజంగా రూపొందింది.ఈ ఆర్చి భూమట్టానికి దాదాపు 146 అడుగుల ఎత్తున ఉంది.[6] ఇతర భౌగోళిక ఆకర్షణలలో డెవిల్ కిచన్, స్కల్ కేవ్, షుగర్ లోఫ్ ప్రధానమైనవి.[7]

ప్రకృతి[మార్చు]

A blue jay, a small bird with blue feathers.
A blue jay, one of Mackinac Island's resident birds

మాకినాక్ ద్వీపం పలు వైవిధ్యమైన భూభాగాలు కలిగి ఉంది. ఇందులో పంటపొలాలు, చిత్తడి నేలలు, బురదనేలలు, సరోవరతీరాలు, దట్టమైన వన్యప్రాంతం, లైంస్టోన్ రూపాలు కలగలిసి ఉంటాయి. స్టేట్ హిస్టారిక్ పార్క్ డిజైనేషన్ ఆధ్వర్యంలో ఈ ద్వీపం సరక్షించబడుతూ ఉంటుంది. మాకినాక్ ద్వీపంలోని సగం సరోవవర తీరాలు " స్ట్రెయిట్ ఆఫ్ మాకినాక్ షిప్రెక్ ప్రిజర్వ్ సంరక్షణలో ఉన్నాయి.[31] ప్రధానభూభాగం నుండి వేరుపడిన తరువాత ద్వీపంలో కుందేళ్ళు, నక్కలు, ఎర్రని, బూడిదరంగు ఉడుతలు మొదలైన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అరుదుగా తోడేళ్ళు కనిపిస్తూ ఉంటాయి.[32] జలాన్ని దాటటానికి ఆటంకం ఉండని కారణంగా గబ్బిలాలు విస్తారంగా ద్వీపంలోకి వలసవచ్చాయి. లైంస్టోన్ గుహలు గబ్బిలాలకు నివాసయోగ్యంగా ఉంటాయి. ద్వీపంలోని కీటకాలు గబ్బిలాలకు ఆహారంగా ఉంటాయి.

పక్షులు[మార్చు]

వేసవి, శీతాకాలాల మద్య వలసపోయే పక్షులకు ఈ ద్వీపం ఒక మజిలీగా ఉపయోగపడుతూ ఉంది.ఏప్రెల్, మే మాసాలలో డేగలు, రాబందు విస్తారంగా ఉంటాయి. వేసవికాల ఆరంభంలో యెల్లో వార్బ్లర్, అమెరికన్ రెడ్స్తార్ట్స ఇండిగో బంటింగ్ వంటి చిన్న పక్షులు అధికంగా ఉంటాయి. సరోవరతీరంలో గల్స్, హెరాంస్, బాతులు, లూంస్ అధికంగా ఉంటాయి. ఆర్కిటిక్ నుండి మంచు గుడ్లగూబలు, మహా బూడిదరంగు గుడ్లగూబలు వెచ్చని వాతావరణంలో వేట కొరకు ఈ ద్వీపంలో ప్రవేశిస్తుంటాయి. చికాడీస్, కార్డినల్ బ్లూ జేస్, వడ్రంగి పిట్టలు సంవత్సరమంతా ద్వీపంలో నివసిస్తుంటాయి. కప్పలు కూడా కనిపిస్తూ ఉంటాయి.[33]

వృక్షజాలం[మార్చు]

మాకినాక్ ద్వీపంలో 600 జాతుల నాళికామొక్కలు (వాస్కులర్ మొక్కలు) ఉన్నాయి. వన్యప్రాంతంలో ట్రిల్లియం, లేడీ స్లిప్పర్స్, ఫర్గెట్ మి నాట్, వయలెట్, ట్రౌట్ లిల్లీ, స్ప్రింగ్ బ్యూటీ, హెపాటికా, బటర్ కప్స్, హాక్ వీడ్ మొదలైన పూలమొక్కలు, అడవిపూలమొక్కలు విస్తారంగా ఉన్నాయి. సరోవర తీరప్రాంతంలో ఆర్చిడ్స్, ఫ్రింజ్డ్ జెనెటియన్, బటర్ అండ్ ఎగ్స్, అరైసీమా ట్రిఫిల్ మొదలైన మొక్కలు ఉంటాయి. అడవిలో మేపుల్, బిర్చ్,ఎల్మ్‌, సెడార్, పైన్, స్ప్రూస్ మొదలైన వృక్షాలు ఉన్నాయి. [33]

Marquette Park on Mackinac Island
Marquette Park on Mackinac Island

మాధ్యమం[మార్చు]

మాకినాక్ ద్వీపంలో " మాకినాక్ ఐలాండ్ టౌన్ క్రీయర్ " అనే వార్తాపత్రిక వెలువడుతుంది. దీనిని 1957లో వెస్లీ హెచ్.మౌరర్ సర్, ఆయన కుటుంబం స్థాపించి ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నారు.[34] మే - సెప్టెంబర్ మాసాల మధ్య ఇది వారపత్రికగా వెలువడుతూ సంవత్సరంలోని మిగిలిన కాలంలో ఇది మాసపత్రికగా వెలువరించబడుతూ ఉంది.[35]

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

A medium-sized watercraft with two hulls.
An Arnold Line high-speed catamaran used to transport people to and from the island
A street, surrounded on both sides by two- and three-story buildings. One person is riding on horseback in the middle of the street, while others are walking on the sidewalk. Bikes are parked at the curb.
Mackinac Island's main street, looking west. Transportation on the island is by horse, bike, or foot.

ద్వీపాన్ని చేరుకోవాలంటే ప్రైవేట్ బోట్లు, ఫెర్రీ, చిన్న విమానాలు, శీతాకాలాలలో స్నో మొబైల్ (మంచు వంతెన మీదుగా) ఉంటాయి. మాకినాక్ ద్విపం విమానాశ్రయం నుండి దినసరి విమానాలు లభిస్తాయి.[36] పర్యాటకులు సందర్శించే సీజన్‌లో అర్నాల్డ్ ట్రాంసిస్ట్ కంపెనీ, షెప్లర్స్ ఫెర్రీ, స్టార్ లైన్ సెర్రీ సంస్థల సేవలు అందుబాటులో ఉంటాయి. సెయింట్ ఇగ్నేస్, మాకినాక్ సిటీ (మిచిగాన్) షటిల్ సేవలు లభిస్తాయి.[37] 1898 నుండి ద్వీపంలో మోటరైజ్డ్ వాహనాలు నిషేధించబడ్డాయి.[38] శీతాకాలంలో స్నో మొబైల్, అత్యవసర వాహనాలు, సర్వీస్ వెహికల్స్ మొదలైన వాటికి నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది. ద్వీపంలో ప్రయాణించడానికి నడకదారి, సైకిల్, గుర్రపు బండి ఉంటాయి. డౌన్ టౌన్ ప్రాంతం మినహాహించి మిగిలిన ప్రాంతంలో స్కేటింగ్, రోలర్ బ్లేడ్స్ ఉపయోగించి ప్రయాణం చేయవచ్చు. సైకిల్, స్కేటింగ్, రోలర్ బ్లేడర్లు, స్వారీ గుర్రాలు, గుర్రపు బండ్లు అద్దెకు లభిస్తాయి. ద్వీపం అంతటా పయనించడానికి రహదారి సౌకర్యం ఉంది. వన్యప్రాంతంలో సంచరించి వినోదించడానికి ట్రైల్స్, కాలిబాటలు ఉన్నాయి. [39] " మిచిగాన్ హైవే 185 ", " ది యునైటెడ్ స్టేట్స్ ఓన్లీ " (స్టేట్ హైవే) హైవేలో మోటర్ వాహనాలను రద్దు చేస్తూ సర్కులర్ జారీ చేసింది.[40] ద్వీపంలోని " మాకినాక్ ఐలాండ్ స్టేట్ పార్క్ " ద్వీపంలో 80% భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. మిగిలిన భూభాగంలో మాకినాక్ కోట, ద్వీపంలోని చారిత్రాత్మక డౌన్ టౌన్, హార్బర్ ఉన్నాయి. ద్వీపంలో కేంపింగ్ చేయడానికి అనుమతి లేనప్పటికీ పలు వసతి గృహాలు (హోటళ్ళు), బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.[37][41] డౌన్ టౌన్ వీధులలో వరుసగా చిల్లర దుకాణాలు, కేండీ షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి. అంతర్జాతియంగా ప్రాబల్యత కలిగిన ఫడ్జ్ అనే తినుబండారం ఇక్కడ ప్రాంతీయంగా తయారు చేయబడడం ఈ ద్వీపం ప్రత్యేకత. పలు దుకాణదారులు వైవిధ్యం కలిగిన ఫడ్జీలు అందిస్తున్నాయి. కొన్ని దుకాణాలు ఒక శతాబ్దం కంటే ముందు నుండి నిర్వహించబడుతుండడం విశేషం. ఇక్కడ తయారు చేయబడుతున్న ఫడ్జీలకు మిచిగాన్ రాష్ట్రంలోనే కాక రాష్ట్రం వెలుపల కూడా విక్రయించబడుతున్నాయి. [42][43][44]

నిర్మాణకళ[మార్చు]

మాకినాక్ ద్వీపంలోని అత్యధిక భవనాలు చెక్కతో నిర్మించబడ్డాయి. కొన్ని ఇళ్ళు రాళ్ళతో నిర్మించబడ్డాయి. అధికంగా క్లాప్ బోర్డ్ సైడిగ్ ఉంటుంది.[5] 300 సంవత్సరాల పూర్వంనాటి నిర్మాణశైలితో ద్వీపంలోని గృహాలు నిర్మించబడ్డాయి. స్థానిక అమెరికన్ శైలిలో ద్వీపంలోని గృహాలు నిర్మించబడ్డాయి. అలాగే 19వ శతాబ్ధానికి చెందిన ఆగ్లేయుల శైలి గృహాలు కూడా ఉన్నాయి. ఆరంభకాల నిర్మాణాలను అనిషినాబే, ఒజిబ్వే (చిప్పెవా) గిరిజనులు యురేపియన్ అణ్వేషకులు ఈ ద్వీవిలో ప్రవేశించక ముందు నిర్మించారు. 18వ శతాబ్ధానికి చెందిన ఫ్రెంచ్ సెటిల్మెంట్‌కు చెందిన రెండు నిర్మాణాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో సజీవంగా ఉన్న నార్తెన్ ఫ్రెంచ్ రస్టిక్ నిర్మాణాల ఉనికికి మాకినాక్ ద్వీపం ఉదాహరణగా ఉంది.

మాకినాక్ ద్వీపంలో ఫెడరలిస్ట్, అమెరికన్ కాలనియల్, గ్రీకు రివైవల్ శైలి నిర్మాణాలకు ఉదాహరణగా ఉంది. ద్వీపంలోని అత్యధిక నిర్మాణాలు గోతిక్, స్టిక్ శైలి, ఇటాలినేట్, సెకండ్ ఎంపైర్, రిచర్డ్సన్ రోమనిస్క్యూ, క్వీన్ అన్నే శైలి (యునైటెడ్ స్టేట్స్ శైలి)కి చెందిన విక్టోరియన్ కాల నిర్మాణాలు ఉన్నాయి. 19 వ శతాబ్దం నుండి 1930 వరకు నిర్మించిన కాలనియల్, టుడాల్ నిర్మాణాలను ఆధినిక నిర్మాణాలని భావించవచ్చు.[45]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

A medium-sized four-story house with wooden siding and a covered porch on the first floor.
The Governors House on Mackinac Island. The Governor of Michigan, while in office, can use this residence as a vacation home.
A white church steeple, with a black pointed roof.
St. Anne's Catholic Church on Mackinac Island

1960లో మాకినాక్ ద్వీపం " నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ "గా ప్రకటించబడింది. అదనంగా ఈ ద్వీపానికి ఉన్న దీర్ఘకాల చరిత్ర కారణంగా 1890 నుండి ఈ దీవిని సంరక్షించే ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ " నేషనల్ హిస్టరీ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్ " జాబితాలో ఈ ద్వీపంలోని 8 ప్రదేశాలు, రౌండ్ ఐలాండ్ చోటుచేసుకున్నాయి. [15]

 • ద్వీపం మొత్తం, హల్దిమండ్ బే, స్మాల్ షిప్రెక్ కలిపి హిస్టారిక్ డిస్ట్రిక్‌గా రూపొందించబడింది.

[5][46]

 • " ఫోర్ట్ మాకినాక్ " 1780 లో నిర్మించబడి 1895లో మూసివేయబడింది. 19వ శతాబ్దం ఆఖరిలో కోటను తిరిగి పునరుద్ద్యరించే ప్రయత్నాలు ఆరంభమై 1930 నాటికి ప్రయత్నాలు సఫలం అయ్యాయి.[47][48]
 • మాకినాక్ ద్వీపంలో " ది బైడల్ హౌస్ (మాకినాక్ ద్వీపం) " పురాతన నిర్మాణాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది 1780లో నిర్మించబడింది.

[49][50]

 • " ఎం.సి. గుల్పిన్ హౌస్ " ఇది ఒక శ్రామికవర్గం నివసించే గృహం. ఇది 1780లో నిర్మించబడింది. ఇది శ్రామిక వర్గం నివాసానికి నమూనాగా గుర్తించబడుతుంది.[49]
 • ది ఏజెంసీ హౌస్ ఆఫ్ అమెరికన్ ఫర్ కంపెనీ. ఇది 1820లో నిర్మించబడింది. ఇది కంపెనీకి చెందిన మాకినాక్ ద్వీపం ప్రతినిధి " రాబర్ట్ స్టూరట్ " (అణ్వేషకుడు) నివాసం.

[51]

 • " ది మిషన్ హౌస్ " : ఇది 1825లో మిషన్ పాయింట్ వద్ద నిర్మించబడింది. దీనిని ప్రెస్ బిటరియన్ మిషనరీకి చెందిన విలియం మోంటేజ్ ఫెర్రీ నిర్మించాడు. ఇక్కడ స్థానిక అమెరికన్ విద్యార్థుల బోర్డింగ్ స్కూల్ నిర్వహించబడింది. 1849 లో ఇది హోటెల్‌గా మార్చబడింది. 1939లో ఇది వసతిగృహంగా మార్చబడింది. ప్రస్తుతం ఇది స్టేట్ పార్క్ సిబ్బంది నివాసగృహ ప్రాంతంగా మార్చబడింది.[52]
 • ద్వీపంలోని మిషన్ పాయింట్ వద్ద108 అడుగుల ఎత్తైన గ్లాస్ మ్యూజియం ఉంది. ఇక్కడ మాకినాక్ జలసంధి సుందర దృశ్యాలు, మాకినాక్ ద్వీపం నావికాచరిత్ర, గ్రేట్ లేక్ లైట్ హౌస్,షిప్పింగ్, మాకినాక్ వంతెన నిర్మాణం, షిప్ రెక్స్ ప్రదర్శించబడుతున్నాయి. ఇక్కడ ఉన్న మిషన్ పాయింట్ నేపథ్యంలో చిత్రీకరించిన " సం వేర్ ఇన్ టైం " చిత్రం ప్రదర్శినబడుతుంది.[53]
 • 1829లో నిర్మించబడిన " ది మిషన్ చర్చి " మాకినాక్ ద్వీపంలో పురాతన నిర్మాణాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. చర్చి పురాతన శైలిని సరక్షిస్తూ పునర్నిర్మాణపు పనులు చేపట్టబడ్డాయి.[54]
 • యు.ఎస్. పర్యవేక్షణలో " ది ఇండియన్ డార్మెంటరీ " నిర్మించబడింది. 1836 ట్రీటీ ఆఫ్ వాషింగ్టన్ ఒప్పందం తరువాత ఇండియన్ ప్రతినిధి " హెంరీ రోవే పాఠశాల క్రాఫ్ట్ " దీనిని నిర్మించాడు. ఇందులో పాఠశాల నిర్వహించబడింది. ఇది స్థానిక ఇండియన్ ప్రజలకు ఆశ్రయం కల్పించబడింది. ఇది 1936లో పునర్నిర్మించబడింది. తరువాత ఇది మ్యూజియంగా మార్చబడింది. ఇది 2003 లో మూత పడింది.[55]

2010 జూలైలో ఇది తిరిగి ది రిచర్డ్ అండ్ జానే మనూజియన్ మెకనాక్ ఆర్ట్ మ్యూజియంగా తెరవబడింది. ఇందులో చరిత్రపూర్వ మాకినాక్ కళాఖండాలు ప్రదర్శించబడుతున్నాయి. ఇక్కడ " కిడ్స్ ఆర్ట్ స్టూడియో " కూడా ఉంది.[56]

 • 1846లో " ది మాత్యూ గియరీ హౌస్ " నిర్మించబడింది. ఇది 1971 లో రిజిస్టర్‌కు చేర్చబడింది. ఇది ప్రస్తుతం వసతిగృహంగా ఉపయోగించబడుతుంది.[46][57]
 • ప్రస్తుత " సెయింటే అన్నే చర్చి " 1874 లో నిర్మించబడింది. మాకినాక్ ద్వీపంలో 1695 నుండి ఉనికిలో ఉన్న పారిష్ చర్చి స్థానంలో ఇది నిర్మించబడింది.

[58]

 • ది గ్రాండ్ హోటెల్ " 1887 లో విక్టోరియన్ శైలిలో నిర్మించబడింది. 1980 లోని కొన్ని సన్నివేశాలు " సంవేర్ ఇన్ టైం " ఈ హోటల్ ప్రాంగణంలో చిత్రీకరించబడ్డాయి.

[59]

 • మాకినాక్ ద్వీపానికి దక్షిణంలో ఉన్న " ది రౌండ్ ఐలాండ్ " నివాసరహితంగా గుండ్రంగా ఉండే ద్వీపం. 1894 లో ఇక్కడ లైట్ హౌస్ నిర్మించబడింది. 1924 లో లైట్ హౌస్ ఆధినీకరణ చేయబడింది. 1970 లో లైఠ్ హౌస్ పునరుద్ధరణ పనులు విస్తారంగా చేపట్టారు.[60]
 • 1898 లో " వావష్కమొ గోల్ఫ్ క్లబ్ " స్త్యాపించబడింది. ఇది మిచిగాన్ రాష్ట్రంలో ఇప్పటివరకు చురుకుగా కొనసాగుతున్న పురాతన గోల్ఫ్ క్లబ్‌గా గుర్తించబడుతుంది.

[61]

 • 1942 లో హార్బర్‌ కనిపించే దిశలో నిర్మించబడిన " ది మిచిగాన్ గవర్నర్స్ రెసిడెంస్ "ను రాష్ట్ర ప్రభుత్వం 1943 లో కొనుగోలు చేసి ప్రస్తుత గవర్నర్ నివాసంగా మార్చబడింది.

[62]

 • 1916 లో " అన్నే టాబ్లెట్ " అనే శిల్పం స్థాపించబడింది.[63]
 • ద్వీపంలో పలు చిల్డ్రంస్ పార్కులు ఉన్నాయి.[64]

సంస్కృతి[మార్చు]

Ships docked in a harbor
Harbor, as seen from the village
A historic fort, with a wooden fence over a white stone wall that encircles the fort.Fort Mackinac in 2004

సంఘటనలు[మార్చు]

మాకినాక్ ద్వీపం " అమెరికన్ ఆర్ట్స్ " వంటి పలు సంస్కృతిక ఉత్సవాలకు కేంద్రంగా ఉంది. ద్వీపంలో కనీసం 5 ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. [65] 1949 నుండి ద్వీపవాసులున స్థానిక లిలాక్ ప్రజలతో కలిసి వార్షికంగా 10 రోజులపాటు లిలాక్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుర్రాలతో లాగబడే వాహనాలలో పేరేడ్ నిర్వహిస్తారు.[66][67][68][69][70][71]

స్కౌట్ సర్వీస్ కేంప్[మార్చు]

ప్రతి వేసవిలో మాకినాక్ ద్వీపం 54 మిచిగాన్ " స్కౌట్ బాయ్స్ ", గర్ల్ స్కౌట్ యు.ఎస్.ఎ.కు వారి నాయకులకు వేరు వేరుగా వసతి కలిగిస్తుంది. ఈ స్కౌట్ సభ్యులు " మాకినాక్ ఐలాండ్ గవర్నర్స్ హానర్ గార్డ్ "గా సేవలు అందిస్తారు. 1929లో స్టేట్ పార్క్ కమిషన్ 8 మంది ఇగల్ స్కౌట్ బాయ్స్ "కు మిచిగాన్ గవర్నర్ హానర్ గార్డులుగా సేవలు అందించడానికి ఆహ్వానం పంపినప్పటి నుండి ఇలా ద్వీపానికి స్కౌట్ బాయ్స్‌ను అనుమతించే సప్రదాయం కొనసాగుతుంది.

A downhill view of houses. A harbor is visible at left.
A view of the island from atop Fort Mackinac

1974 లో స్కౌట్ ఆహ్వానం బాలికలకు విస్తరించింది. ఈ కార్యక్రమం ప్రాబల్యత సంతరించుకుంది. స్కౌట్స్ ద్వీపంలో 26 జంఢాలను ఎగురవేసి గైడ్స్‌గా సేవలు అందించి వాలంటీర్ సర్వీస్ ప్రాజెక్ట్ పూర్తిచేస్తారు.స్కౌట్స్ మాకినాక్ కోట వెనుక శిబిరాలలో బస చేస్తారు.[72][73][74]

సెయిలింగ్[మార్చు]

మాకినాక్ ద్వీపం రెండు సెయిలింగ్ పదాలకు కేంద్రంగా ఉంది. ద్వీపంలో ఒక సెయిలింగ్ క్లబ్ (మాకినాక్ ఐలాండ్ యాచ్త్ క్లబ్) ఉంది. యాచ్త్ క్లబ్ " పోర్ట్ హ్యురాన్ టు మాకినాక్ రేస్ ", ది చికాగో యాచ్త్ క్లబ్ రేస్ టు మాకినాక్ " అనే రెండు సెయిలింగ్ రేసులను నిర్వహిస్తుంది. ఈ రేసులు ఒక వారం రోజుల కాలం నిర్వహించబడుతుంటాయి. ఇవి ప్రపంచంలో అత్యంత పొడవైన మంచినీటి పడవ పందాలుగా గుర్తించబడుతున్నాయి.[75] ఈ పందాలలో 500 పడవలు, 3,500 మంది నావికులు భాగస్వామ్యం వహిస్తారు. [76][77] చరిత్మాత్మకమైన ఈ రెండు పందాలు 1920 నుండి నిర్వహించబడుతున్నాయి.[78][79]

చిత్రీకరణ నేపథ్యం[మార్చు]

గ్రాండ్ హోటల్‌లో ఉన్న ఈస్తర్ విలియంస్ స్విమ్మింగ్ పూల్ నిర్మించిన ఈస్తర్ విలియంస్ " దిస్ టైం ఫర్ కీప్స్ " నటించాడు. ఈ చిత్రంలోని పలు దృశ్యాలు మాకినాక్ ద్వీపంలో చిత్రీకరించబడ్డాయి.[80][81] 1980 లో నిర్మించబడిన " సం వేర్ ఇన్ టైం " చిత్రంలోని దృశ్యాలు మాకినాక్ ద్వీపంలోని మిషన్ పాయింట్ వద్ద చిత్రీకరించబడ్డాయి.[53] గ్రాండ్ హోటెల్, రౌండ్ ఐలాండ్ సమీపంలో ఉన్న లైట్ హౌస్ మొదలైన ప్రదేశాలు ఈ చిత్రం చోటు చేసుకున్నాయి. చిత్ర దర్శకుడు 80 సంవత్సరాల నుండి మార్పు చెందని ఒక ప్రదేశం కొరకు అణ్వేషించి మాకినాక్ ద్వీపాన్ని ఎన్నుకున్నట్లు వివరించాడు.[82] మాకినాక్ ద్వీపం మిడ్ - 2000 టి.వి. సీరీస్ " డైరీ జాబ్స్ " లోని రెండు ఎపిసోడులలో చోటు చేసుకుంది.[83][84]

ప్రముఖులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Bailey, John R (1896). Mackinac formerly Michilimackinac. Lansing, Michigan: Darius D. Thorp & Son.
 2. National Park Service (2008-04-15). "National Register Information System". National Register of Historic Places. National Park Service.
 3. State of Michigan (2009). "Mackinac Island". Archived from the original on 2012-05-28. Retrieved August 2, 2010.
 4. "Mackinac Island". National Historic Landmark summary listing. National Park Service. Archived from the original on 2012-09-05. Retrieved June 27, 2008.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 "National Historic Landmark Nomination: Mackinac Island" (PDF). United States Department of the Interior. Archived from the original (PDF) on 2008-05-10. Retrieved March 10, 2007.
 6. 6.0 6.1 6.2 6.3 6.4 Petersen, Eugene T. "High Cliffs". Mackinac.com. Archived from the original on 2007-02-13. Retrieved March 4, 2007.
 7. 7.0 7.1 7.2 Petersen, Eugene T. "A Historic Treasure Preserved". Mackinac.com. Archived from the original on 2013-03-01. Retrieved March 5, 2007.
 8. Nichols, John D.; Nyholm, Earl (1995). A Concise Dictionary of Minnesota Ojibwe. Minneapolis: University of Minnesota Press.
 9. Andrew J. Blackbird, "Earliest Possible Known History of Mackinac Island," History of the Ottawa and Chippewa Indians of Michigan (Ypsilanti, MI: Ypsilanti Auxiliary of the Woman's National Indian Association, 1887) pp. 19-20
 10. Harper, Douglas. "Mackinaw". Online Etymology Dictionary. Retrieved March 8, 2007.
 11. Ferjutz, Kelly. "Broadcloth, Brocade and Buckskin—Return to the past on Mackinac Island". FrugalFun.com. Retrieved March 8, 2007.
 12. Swanton, John R. (1952). Indian Tribes of North America. Washington DC: US Government Printing Office. pp. 250–256.
 13. Blackbird (Mack-e-te-be-nessy), Andrew J. (1887). History of the Ottawa and Chippewa Indians of Michigan: Earliest Possible Known History of Mackinac Island. Ypsilanti, Michigan: Ypsilanti Auxiliary of the Woman's National Indian Association. pp. 19–20.
 14. Zacharias, Pat. "The breathtaking Mackinac Bridge". Detroit News. Archived from the original on 2004-05-08. Retrieved July 18, 2007.
 15. 15.0 15.1 15.2 15.3 15.4 Slevin, Mary McGuire. "History". MackinacIsland.org. Archived from the original on January 23, 2007. Retrieved March 8, 2007.
 16. Hamilton, Raphael N., S.J (1970). Father Marquette. Grand Rapids: William B. Eerdmans. p. 43.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
 17. Boynton, James, S.J. (1996). Fishers of Men: The Jesuit Mission at Mackinac, 1670–1765. Mackinac Island: Ste. Anne's Church. pp. 14–15.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
 18. O'Callaghan, E.B., ed. (1855). Documents relative to the colonial history of the state of New York. Vol. 9. Albany, New York: Weed, Parsons, and Co. p. 383.
 19. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; jesuitrelations1671 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 20. Thwaites, Reuben Gold (1898). The Story of Mackinac. State Historical Society of Wisconsin. pp. 1–16.
 21. Cook, Samuel F. (1895). Mackinaw in History. Lansing, Michigan: Robert Smith and Co.
 22. Brinkley, Alan (2003). American History: A Survey (11 ed.). New York: McGraw-Hill Higher Education. pp. 141, 173. ISBN 0-07-242436-2.
 23. 23.0 23.1 Brennan, James. "Fort Holmes". The Michigan Historical Marker Web Site. Archived from the original on 2007-09-27. Retrieved March 4, 2007.
 24. Petersen, Eugene T. "The Victorian Era: A Resort Meca". Mackinac.com. Archived from the original on 2013-03-01. Retrieved March 5, 2007.
 25. Slevin, Mary McGuire. "Mackinac Island Fact Sheet" (PDF). Mackinac Island Tourism Bureau. Archived from the original (PDF) on 2008-05-29. Retrieved March 5, 2007.
 26. "Population of Michigan Cities and Villages: 2000 and 2010". michigan.gov. Retrieved March 23, 2011.
 27. "Eselco Inc · 10-K405 · For 12/31/96 · EX-13". SEC Info. March 31, 1997. Archived from the original on 2016-03-03. Retrieved March 14, 2007.
 28. "Welcome to Mackinac Island". Superior Sights. Retrieved March 14, 2007.
 29. William L. Blewett. "Understanding Ancient Shorelines in the National Parklands of the Great Lakes" (PDF). Pictured Rocks National Lakeshore. Retrieved May 22, 2010.
 30. "Ancient Waterfall Discovered Off Mackinac Island's Shoreline". Mackinac Island Town Crier. Archived from the original on 2008-07-19. Retrieved September 10, 2007.
 31. Bailey, Dan Holden (September 1999). "Mackinac Straits". Diver Magazine. Archived from the original on June 20, 2006. Retrieved May 23, 2007.
 32. "Coyote Population Begins To Cause Concern on Mackinac Island". St. Ignace News. Archived from the original on 2009-05-02. Retrieved April 12, 2008.
 33. 33.0 33.1 Slevin, Mary McGuire. "Ecosystem". MackinacIsland.org. Archived from the original on May 15, 2007. Retrieved May 17, 2007.
 34. "St. Ignace". Hunts' Guide to Michigan's Upper Peninsula. Midwestern Guides. Retrieved May 22, 2007.
 35. "Contact Us". Mackinac Island Town Crier. Archived from the original on 2016-03-15. Retrieved May 22, 2007.
 36. "By Air". Mackinac.com. Retrieved March 14, 2007.[permanent dead link]
 37. 37.0 37.1 "Mackinac Island FAQs". Mackinac State Historic Parks. Archived from the original on 2007-03-20. Retrieved March 14, 2007.
 38. "What happened to a place in Michigan when cars were banned for 115 years?". Bike Delaware. Retrieved February 28, 2013.
 39. Dearle, Brian. "Mackinac Island". The New Colonist. Archived from the original on 2012-11-22. Retrieved March 14, 2007.
 40. "Mackinac Island State Park: Points of Interest". Mackinac State Historic Parks. Retrieved June 1, 2009.
 41. "Accommodations". Mackinac.com. Retrieved March 14, 2007.[permanent dead link]
 42. Porter, Phil (2001). Fudge: Mackinac's Sweet Souvenir. Mackinac Island, Mich.: Mackinac State Historic Parks. ISBN 0-911872-78-7.
 43. Straus, Frank (February 11, 2006). "The Sweet Surrender of Mackinac Island Fudge". Mackinac Island Town Crier. Archived from the original on 2009-02-09. Retrieved March 14, 2007.
 44. Slevin, Mary McGuire. "Shopping". Mackinac Island Tourism Bureau. Archived from the original on May 6, 2007. Retrieved May 30, 2007.
 45. Slevin, Mary McGuire. "Architecture". Mackinacisland.org. Archived from the original on December 11, 2006. Retrieved March 10, 2007.
 46. 46.0 46.1 "Michigan: Mackinac County". Nationalregisterofhistoricalplaces.com. Retrieved March 9, 2007.
 47. "Fort Mackinac". Hunts' Guide to Michigan's Upper Peninsula. Midwestern Guides. Retrieved May 23, 2007.
 48. "A Brief History of Fort Mackinac". Mackinac Island State Park Commission. Archived from the original on 2007-06-13. Retrieved May 23, 2007.
 49. 49.0 49.1 "Historic Buildings". Mackinac State Historic Parks. Archived from the original on 2010-03-06. Retrieved February 4, 2010.
 50. "Biddle House". michmarkers.com. Archived from the original on 2014-07-17. Retrieved February 1, 2010.
 51. "Market Street, 1820s fur trade center". Hunts' Guide to Michigan's Upper Peninsula. Midwestern Guides. Retrieved May 23, 2007.
 52. "Mission House". MI State Historic Preservation Objects. Archived from the original on 2007-09-27. Retrieved May 23, 2007.
 53. 53.0 53.1 Mission Point historical museum [1] Archived 2014-06-20 at the Wayback Machine Retrieved June 11, 2014
 54. "Your Wedding at Mission Church". Mackinac Island State Park Commission. Archived from the original on 2007-06-04. Retrieved May 23, 2007.
 55. Petersen, Eugene. "Indian Dormitory". History of Mackinac Island. Mackinac.com. Archived from the original on 2012-11-08. Retrieved May 23, 2007.
 56. "Richard and Jane Manoogian Mackinac Art Museum". Mackinac State Historic Parks. Retrieved May 31, 2012.
 57. "Geary House Rental". Mackinac Island State Park Commission. Archived from the original on 2007-06-13. Retrieved May 23, 2007.
 58. "St. Anne, Mackinac Island". Roman Catholic Diocese of Marquette. Retrieved March 22, 2013.[permanent dead link]
 59. "Grand Hotel". Roadside America. Retrieved September 10, 2007.
 60. Pepper, Terry (December 12, 2003). "Round Island Light". Archived from the original on 2016-09-18. Retrieved May 23, 2007.
 61. "Wawashkamo Golf Club". michmarkers.com. Retrieved September 21, 2011.
 62. "Governor's Summer Residence Tours". Mackinac Island State Park Commission. Archived from the original on 2007-04-17. Retrieved May 23, 2007.
 63. "Traverse Classics: The Secret of Anne's Tablet on Mackinac Island". mynorth.com. Archived from the original on 2016-03-31. Retrieved February 26, 2014.
 64. "Mackinac Island State Parks". mackinacparks.com. Retrieved February 10, 2015.
 65. Slevin, Mary McGuire. "The Arts". Mackinacisland.org. Archived from the original on December 9, 2006. Retrieved March 10, 2007.
 66. "History". Mackinac Island Lilac Festival. Archived from the original on 2006-04-20. Retrieved March 11, 2007.
 67. "Tocqueville's Mackinac". Tocqueville's America. University of Virginia. Archived from the original on 2016-03-03. Retrieved July 20, 2007.
 68. "Summer on the Lakes, in 1843". University of Illinois Press. Archived from the original on September 5, 2006. Retrieved July 20, 2007.
 69. "Preservation of Thoreau Country". The Thoreau Society. 2006. Archived from the original on 2007-07-05. Retrieved July 20, 2007.
 70. Havranek, Carrie (May 19, 2005). "Lose Yourself on the Tiny, Exclusive, Still-Affordable Mackinac Island". Frommer's. Retrieved July 20, 2007.
 71. "Michigan Salutes Mackinac Island". Documents News from Around the State. Michigan State University. June 1995. Archived from the original on 2007-08-13. Retrieved 2016-08-08.
 72. "Mackinac Island Honor Scouts". Girl Scouts – Michigan Trails. Archived from the original on June 24, 2006. Retrieved March 11, 2007.
 73. Wilson, Suzanne (May–June 2005). "A 75-Year Tradition of Summer Service". Scouting Magazine. Retrieved March 11, 2007.
 74. "Mackinac Island Scout Service Camp" (PDF). upscouting.org. Archived from the original (PDF) on May 29, 2008. Retrieved March 11, 2007.
 75. Ely, Sean. "World's Longest Freshwater Sailing Race Bound for Island Harbor". Mackinac Island Town Crier. Archived from the original on 2016-03-21. Retrieved July 23, 2012.
 76. "350 boats start Chicago-Mackinac race on Lake Michigan". Detroit Free Press. Retrieved July 23, 2012.
 77. "Bayview Yacht Club Retains Jonathan Witz & Associates to Manage Sponsorship, Marketing & Public Relations for Bell's Beer Bayview Mackinac Race" (Press release). Archived from the original on 2016-03-04. Retrieved July 23, 2012.
 78. "FAQ Race to Mackinac". Retrieved July 23, 2012.
 79. "Bayview Yacht Club Retains Jonathan Witz & Associates to Manage Sponsorship, Marketing & Public Relations for Bell's Beer Bayview Mackinac Race" (Press release). Archived from the original on 2016-03-04. Retrieved July 23, 2012.
 80. Keith Stokes. "Mackinac Island Michigan photographs". Mightymac.org. Retrieved May 31, 2012.
 81. "esther williams pool - America's True Grand Hotel".
 82. "Mackinac Island". Find Travel Guide. September 18, 2009. Archived from the original on 2012-04-30.
 83. ""Dirty Jobs" airs Mackinac Island episode August 28". Michigan Film Office. Archived from the original on December 20, 2007. Retrieved June 8, 2008.
 84. Gould, Karen (June 7, 2007). "Island Work Featured on 'Dirty Jobs': Discovery Channel Show Gets the Dirt on Toughest Island Jobs". Mackinac Island Town Crier. Archived from the original on 2008-08-18. Retrieved June 8, 2008.
 85. "Prisoners of War - War of 1812 - PBS".
 86. "Battle of Mackinac Island, 17 July 1812".

వెలుపలి లింకులు[మార్చు]