Jump to content

మాడభూషి భావనాచార్యులు

వికీపీడియా నుండి

మాడభూషి భావనాచారి స్వాతంత్ర్య సమర యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

భావనాచారి 1924లో పిఠాపురంలో జన్మించాడు. అతను తన 14వ యేటే 1938లో స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టాడు. అదే సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాకినాడ వచ్చాడు. ఆయనకు మద్దతుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సన్నాహక సభ నిర్వహించినందుకు ప్రభుత్వం మాడభూషికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలై మూడున్నరేళ్లు అజ్ఞాతవాసంలో వుండి ఉద్యమం నిర్వహించాడు. అదే సమయంలో మహత్మాగాంధీ, సి రాజగోపాలాచారి, బులుసు సాంబమూర్తి, టంగుటూరి ప్రకాశం తదితర స్వాతంత్ర్య సమరయోధులను కలుసుకున్నాడు. 1940 వ్యక్తి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో ఏడాది జైలు శిక్ష విథించింది. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో సుభాష చంద్రబోస్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన సమయంలో పోలీసులు కాల్పులు జరిపగా మాఢభూషి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అదే సంవత్సరం పిఠాపురం, గొల్లప్రోలు, కోలంక, లక్ష్మీనరసాపురం ఎస్టేట్ కు వ్యతిరేకంగా రైతాంగపోరాటాలు చేశాడు. ఈ సమయంలోనే మాఢభూషిని పట్టిచ్చిన వారికి ప్రభుత్వం ఆ రోజుల్లోనే రూ.10 వేలు బహుమతి ప్రకటించింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతంత్ర్యం అనంతరం భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు గౌరవ సూచకంగా ఇచ్చే తామ్రపత్రం అందజేసి గౌరవించింది. పలు కమిటీల్లో ఈయనకు చోటు కల్పించింది.

అతను సంస్కృత అంధ్ర భాషల్లో ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందాడు. మహాభారతం పై పరిశోధన చేసి బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఒకసారి, కుమార సంభవం సాంఘిక పార్స్వం థీసెస్ కు ఉజ్జయినీ విక్రామా యూనివర్సిటీ నుంచి మరోసారి డాక్టరేట్ లు పోందాడు. రుగ్వేదంపైనా పరిశోధన చేసాడు. చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చక్కెర కార్మికుల సమాఖ్య, టెక్స్ టైల్స్ వర్కర్స్ సమాఖ్యలను స్థాపించి అధ్యక్షులుగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]