మాడ్యూల్ చర్చ:Databox

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవసరమైన మార్పులు

[మార్చు]

ఈ మాడ్యూల్లో కొన్ని మార్పుచేర్పులు అవసరమని భావిస్తూ వాటిని ఇక్కడ చేరుస్తున్నాను. వీటిని తెవికీలోనే మార్చుకోవాలి.

  1. వ్యక్తుల పేజీలో ప్రాపర్టీ P31 కాకుండా దాని స్థానంలో P106 పెడితే బాగుంటుంది. P31 కొంచెం ఆక్వర్డుగా ఉంది.
  2. సమాచారపెట్టె వెడల్పు, బొమ్మ/మ్యాపుల వెడల్పులను మార్చుకునేట్లుగా ఉంటే బాగుంతుంది.
  3. వికీడేటా ఎడిట్ లింకులు ఎక్కువైనట్లు అనిపిస్తోంది. ఆ ఎడిట్ లింకులు మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రతీ లక్షణానికీ కాకుండా ఒకచోట మాత్రమే ఇస్తే బాగుంటుంది లేదా ఆ ఎడిట్ పెన్సిలు బొమ్మను చిన్నదిగా/కనీకనబడనట్లుగా మార్చాలి
  4. వివిధ రంగాలకు చెందిన పేజీలకు తగినట్లుగా మార్పుచేర్పులు చేసుకోవాలి ఉదా: గ్రామం, జిల్లా, నగరం, వ్యక్తి, సంస్థ,..

__ చదువరి (చర్చరచనలు) 12:29, 27 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరిన్ని-
  1. తెవికీలో ఇప్పుడు వాడుతున్న సమాచారపెట్టెల్లో ఉంటున్న డేటాతో పోలిస్తే ఈ పెట్టెలో చూపించే డేటా తక్కువ ఉంది. ఉదాహరణకు గ్రామాల పేజీల్లో డేటా. వికీడేటాలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గ్రామాలకు సంబంధించిన డేటా చాలా సమగ్రంగా ఉన్నప్పటికీ, ఆ డేటాను ఇది తీసుకు రావడంలేదు. అందుకు తగ్గట్టు ఈ మాడ్యూలును మార్చుకోవాలి.
  2. వికీడేటా లోని గ్రామాల పేజీల్లో జనగణన వివరాల వంటి కొన్ని డేటాంశాలకు ఒకటి కంటే ఎక్కువ విలువలుంటై. అంటే 2001 జనాభా, 2011 జనాభా వివరాలు మొదలైనవి. అప్పుడు అత్యంత తాజా డేటా తేవాలి అంటే వస్తుందా? వికీడేటాలో రెండు కంటే ఎక్కువ విలువలున్న లక్షణంలో మనకు కావాల్సిన డేటా వస్తుందా? ఈ మాడ్యూలు అలా తేస్తే సరే.., లేదంటే ఆ వీలు కల్పించాలి.
  3. కామన్సులో బొమ్మల్లేనట్లైతే వికీడేటాలో బొమ్మ చేర్చే అవకాశం లేదు. అప్పుడు ఈ డేటాబాక్స్‌లో బొమ్మ రాదు. తెవికీలో స్థానికంగా ఎక్కించే సముచిత వినియోగపు బొమ్మను ఈ పెట్టెలో వాడలేం. అలా వాడుకునే వీలు ఈ మాడ్యూల్లో చేర్చాలి.
__ చదువరి (చర్చరచనలు) 14:51, 27 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]