మాతికెట్టన్ షోలా జాతీయ వనం
Jump to navigation
Jump to search
మాతికెట్టన్ షోలా జాతీయ వనం | |
---|---|
ప్రదేశం | కేరళ, భారతదేశం |
సమీప నగరం | మున్నార్ |
విస్తీర్ణం | 12.82 కి.మీ2 (4.95 చ. మై.) |
స్థాపితం | 2003 నవంబరు 21 |
మాతికెట్టన్ షోలా జాతీయ వనం కేరళ, ఇడుక్కి జిల్లా, ఉడుంబంచోలా తాలూకా లోని పూపారా ప్రాంతంలో ఉంది..[1] ఇది 12.82 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1897 లో ట్రావెన్కూరు ప్రభుత్వం ఈ అడవిని రిజర్వు ఫారెస్టుగా గుర్తించింది. ఇందులోని కొంత భాగాన్ని ఏలకుల తోటల పెంపకానికి లీజుకిచ్చారు. ఆ తరువాత, ఇందులోని వృక్ష జంతుజాలాన్ని, పర్యావరణాన్నీ సంరక్షించేందుకు దీన్ని 2003 నవంబరు 21 న జాతీయ వనంగా ప్రకటించారు.[2] ఈ వనంలో ఏనుగు ప్రధానమైన జంతువు.
రవాణా మార్గం
[మార్చు]పూపారా నుండి మున్నార్ మీదుగా మాతికెట్టన్ షోలాకు వెళ్ళవచ్చు. కొత్తమంగళం మీదుగా పూపారా నుండి ఇడుక్కి వెళ్ళే దారి గుండా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కొచ్చి, మదురైలు, దీనికి సమీపం లోని విమానాశ్రయాలు. దగ్గర లోని రైల్వే స్టేషను కొట్టాయం.
మూలాలు
[మార్చు]- ↑ Mathikettan Shola National Park Kerals Forests and Wildlife Department, 2009
- ↑ (21 November 2003) The Hindu, retrieved 6/21/2007 Mathikettan declared National Park Archived 2004-03-28 at the Wayback Machine